5G smartphones: దేశంలో ఇక 5G సేవలు.. చీప్ అండ్ బెస్ట్ 5G స్మార్ట్‌ఫోన్స్ ఇదిగో

5G Smartphones: 5G నెట్‌వర్క్ సేవలు రేపటి నుంచే అందుబాటులోకి రానున్నాయి. దీంతో 5G నెట్‌వర్క్ సేవలు అందిపుచ్చుకోవాలనుకునే వారు తమ ఫోన్‌ని అప్‌గ్రేడ్ చేసుకునే ఆలోచనలో పడ్డారు. ఇప్పటికే 5G స్మార్ట్ ఫోన్ ఉన్న వారికి ఏ ఇబ్బంది లేదు కానీ ఒకవేళ 5జీ హ్యాండ్‌సెట్ లేని వారే తమ ఫోన్‌ని అప్‌గ్రేడ్ చేసుకోవాల్సిన అవసరం ఉంది.

Written by - Pavan | Last Updated : Oct 1, 2022, 05:07 AM IST
  • అమేజాన్ గ్రేట్ ఇండియన్ ఫెస్టివల్ సేల్ 2022 లో 5G స్మార్ట్ ఫోన్లపై ఆఫర్స్
  • 5జి సేవలు అందిపుచ్చుకోవాలంటే 5జి స్మార్ట్‌ఫోన్‌కి అప్‌గ్రేడ్ అవ్వాల్సిందే
  • 5జి సేవలు అందుబాటులోకి వస్తుండటంతో 5జి ఫోన్లకు ఏర్పడనున్న డిమాండ్
5G smartphones: దేశంలో ఇక 5G సేవలు.. చీప్ అండ్ బెస్ట్ 5G స్మార్ట్‌ఫోన్స్ ఇదిగో

5G Smartphones: 5G నెట్‌వర్క్ సేవలు రేపటి నుంచే అందుబాటులోకి రానున్నాయి. దీంతో 5G నెట్‌వర్క్ సేవలు అందిపుచ్చుకోవాలనుకునే వారు తమ ఫోన్‌ని అప్‌గ్రేడ్ చేసుకునే ఆలోచనలో పడ్డారు. ఇప్పటికే 5G స్మార్ట్ ఫోన్ ఉన్న వారికి ఏ ఇబ్బంది లేదు కానీ ఒకవేళ 5జీ హ్యాండ్‌సెట్ లేని వారే తమ ఫోన్‌ని అప్‌గ్రేడ్ చేసుకోవాల్సిన అవసరం ఉంది. దీంతో ఇప్పటికే 5G ఫోన్లకు భారీ డిమాండ్ ఉండగా.. తాజాగా 5జీ సేవలు కూడా అందుబాటులోకి వస్తుండటంతో ఆ డిమాండ్ మరింత రెట్టింపయ్యింది. ఈ నేపథ్యంలో అమేజాన్ గ్రేట్ ఇండియన్ ఫెస్టివల్ సేల్ 2022 లో ప్రస్తుతం అందుబాటులో ఉన్న కొన్ని 5G స్మార్ట్ ఫోన్లపై ఉన్న డిస్కౌంట్ ఆఫర్స్‌పై ఓ స్మాల్ లుక్కేద్దాం.

Redmi 11 Prime 5G: రెడ్‌మి 11 ప్రైమ్ 5జీ
రెడ్‌మి 11 ప్రైమ్ 5జీ మార్కెట్లోకి లాంచ్ అయినప్పుడు 4GB RAM + 64GB స్టోరేజీ కలిగిన బేసిక్ మోడల్ ఖరీదు రూ. 13,999 గా ఉంది. అయితే, అమేజాన్ గ్రేడ్ ఇండియన్ సేల్ లో భాగంగా ఈ ఫోన్ రూ. 12,999 కే లభిస్తోంది. అంతేకాకుండా ఎక్స్ చేంజ్ ఆఫర్ కింద రూ 12,150 కే లభిస్తోంది. ఈఎంఐ పద్ధతిలో ఫోన్ కొనుగోలు చేస్తే.. నెలకు కేవలం రూ. 621 కే ఈ ఫోన్ మీ సొంతం చేసుకోవచ్చు.

Realme Narzo 50 5G: రియల్‌మి నార్జో 50 5జి
రియల్‌మి నుండి వచ్చిన 5జి స్మార్ట్ ఫోన్లలో రియల్ మి నార్జో 50 5జి స్మార్ట్ ఫోన్ చీపెస్ట్ ఫోన్. ఈ ఏడాది మే నెలలో ఫోన్ మార్కెట్లోకి లాంచ్ అయ్యేటప్పుడు ఫోన్ ఖరీదు రూ. 15,999 గా ఉంది. ఇదే ఫోన్ ప్రస్తుతం అమేజాన్ గ్రేట్ ఇండియన్ ఫెస్టివల్ సేల్ లో రూ. 12,249 గా ఉంది. అదనంగా పాత స్మార్ట్ ఫోన్ ఎక్స్ చేంజ్ ఆఫర్ కింద ఈ స్మార్ట్ ఫోన్ రూ. 11,550 గా ఉంది. ఈఎంఐ చెల్లింపులో ఫోన్ ని కొనుగోలు చేస్తే.. రూ 750 కే ఈ ఫోన్ లభిస్తుంది. 

OnePlus Nord CE 2 Lite 5G: వన్‌ప్లస్ నార్డ్ సీఈ 2 లైట్ 5జి
సాధారణంగా అయితే వన్‌ప్లస్ నార్డ్ సీఈ 2 లైట్ 5జి ఖరీదు రూ. 19,999 గా ఉండగా.. అమేజాన్ గ్రేట్ ఇండియన్ ఫెస్టివల్ సేల్‌లో భాగంగా రూ. 18,999 కే లభిస్తోంది. ఇదే కాకుండా ఎస్బీఐ క్రెడిట్ కార్డు ఉపయోగించి రూ. 750 ఇన్‌స్టాంట్ డిస్కౌంట్ పొందవచ్చు. 18 వేల వరకు ఎక్స్‌చేంజ్ ఆఫర్ కూడా ఉంది. ఇంతకంటే సూపర్ ఆఫర్ ఇంకేం కావాలి 

Redmi Note 11 Pro+ 5G: రెడ్‌మి నోట్ 11 ప్రో+ 5జి
రెడ్‌మి నోట్ 11 ప్రో+ 5జి స్మార్ట్ ఫోన్.. ఈ మోడల్లో బేసిక్ వేరియంట్ ఫోన్ 6GB RAM, 128GB ఫోన్ ఖరీదు రూ. 20,999 గా ఉండగా.. అమేజాన్ లో ఈ ఫోన్ ఖరీదు ప్రస్తుతం రూ. 19,999 పలుకుతోంది. ఎస్బీఐ క్రెడిట్ కార్డు ద్వారా ఫోన్ కొనుగోలు చేస్తే.. అదనంగా రూ. 750 ఇన్‌స్టాంట్ డిస్కౌంట్ లభిస్తుంది. ఎక్స్ చేంజ్ ఆఫర్ కింద రూ. 18,500 వరకు డిస్కౌంట్ వర్తిస్తుంది.

Also Read : ZEEL MD & CEO Punit Goenka: ఇండియాలో ఫస్ట్ శాటిలైట్ టీవీ మాదే.. రాబోయే 30 ఏళ్లు కూడా మావే: పునిత్ గోయెంక

Also Read : Gas Prices Hike: పండుగల వేళ మరో షాక్, రేపట్నించి పెరగనున్న గ్యాస్ ధరలు, వంట గ్యాస్ కూడా

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

Android Link https://bit.ly/3P3R74U

Apple Link - https://apple.co/3loQYe 

Twitter , Facebookమా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి

Trending News