ZEEL MD & CEO Punit Goenka: దేశంలోనే మొట్టమొదటిసారిగా శాటిలైట్ టీవీ ఛానెల్ స్థాపించి ప్రైవేటు టీవీ ఛానెల్స్ పరిశ్రమకు బాటలు వేసిన సంస్థ జీ ఎంటర్టైన్మెంట్స్ ఎంటర్ప్రైజెస్ లిమిటెడ్ (జీల్) అని అన్నారు ఆ సంస్థ మేనేజింగ్ డైరెక్టర్, సీఈఓ పునిత్ గోయెంక. తాజాగా జీ టీవీ ప్రస్థానం, భవిష్యత్ ప్రణాళికల గురించి పునిత్ గోయెంక మాట్లాడుతూ.. '' జీ టీవీ వచ్చిన తర్వాతే దేశంలో ప్రైవేటు టీవీ ఛానెల్స్ వచ్చాయి'' అని అన్నారు. అంతేకాకుండా భారత దేశం సంస్త్కృతి, సంప్రదాయలు ఉట్టిపడేలా జీ టీవీ ఎంటర్టైన్మెంట్ కంటెంట్ ఉంటుందన్నారు. దేశ ఆర్థికాభివృద్ధిలో ఎంటర్టైన్మెంట్ ఇండస్ట్రీ ఎంతో కీలక పాత్ర పోషిస్తుందని.. చెబుతూ వినోదరంగంలో జీ గ్రూప్ అతి పెద్ద సంస్థగా అవతరించిందని సగర్వంగా ప్రకటించారు.
జీటీవీ స్థాపించి దాదాపు 30 ఏళ్లు పూర్తిచేసుకున్న జీ ఎంటర్టైన్మెంట్స్ ఎంటర్ప్రైజెస్ లిమిటెడ్.. అప్పట్లోనే శాటిలైట్ టీవీ ఆలోచన చేసి ఎలాగైతే ఇండస్ట్రీని ముందుకు నడిపించిందో.. అలాగే ఇకపై రాబోయే మరో 30 ఏళ్లకు సరిపడా భవిష్యత్ ప్రణాళికలు సైతం జీ ఎంటర్టైన్మెంట్స్ ఎంటర్ప్రైజెస్ లిమిటెడ్ వద్ద సిద్ధంగా ఉన్నట్టు పునిత్ గోయేంక తెలిపారు. జీ గ్రూప్ ఇప్పటివరకు ఎలాగైతే ఎంటర్టైన్మెంట్ ఇండస్ట్రీని తిరుగులేని రారాజుగా ఏలిందో.. అలాగే ఇకపై కూడా పరిశ్రమ అభివృద్ధిలో కీలక పాత్ర పోషిస్తుందని పునిత్ గోయెంక (ZEEL MD & CEO Punit Goenka) ధీమా వ్యక్తంచేశారు.
Also Read : Zee Brand Works: 'జీ' సంస్థ నుంచి 'జీ బ్రాండ్ వర్క్స్' లాంచ్..
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3P3R74U
Apple Link - https://apple.co/3loQYe
Twitter , Facebookమా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి