Cheapest Cars: 5 లక్షల బడ్జెట్‌లో కొత్త కారు కోసం చూస్తున్నారా, 3 బెస్ట్ కార్లు మీ కోసం

Cheapest Cars: దేశంలో ఎన్నో రకాల కార్లు అందుబాటులో ఉన్నాయి. ఒక్కొక్కరి బడ్జెట్, అభిరుచిని బట్టి వివిధ కంపెనీల కార్లు ఉన్నాయి. 5 లక్షల్లో బడ్జెట్ అయినా మార్కెట్‌లో మంచి మంచి కార్లు లభిస్తున్నాయి. ఆ వివరాలు మీ కోసం.  

Written by - Md. Abdul Rehaman | Last Updated : Jul 30, 2023, 12:06 AM IST
Cheapest Cars: 5 లక్షల బడ్జెట్‌లో కొత్త కారు కోసం చూస్తున్నారా, 3 బెస్ట్ కార్లు మీ కోసం

Cheapest Cars: ఇండియాలో ప్రస్తుతం లో బడ్జెట్ కార్లకు డిమాండ్ పెరుగుతోంది. ప్రతి ఒక్కరికీ సొంత కారు ఉండాలనే కోరిక ఇందుకు కారణం. అందరికీ బడ్జెట్ సహకరించని కారణంగా చాలామంది తక్కువ బడ్జెట్‌లో కారు ఉండాలని భావిస్తుంటారు. 

కొత్త కారు కొనాలని చాలా మందికి ఉంటుంది. అయితే కొంతమందికి బడ్జెట్ సహకరించదు. లేదా కొంతమంది 5 లక్షలే బడ్జెట్ పెట్టుకుంటారు. 5 లక్షల బడ్టెట్‌లో ఏయే కార్లు అందుబాటులో ఉంటాయో తెలుసుకోవడం కష్టమౌతుంటుంది. ఎందుకంటే దాదాపు 4-5 కంపెనీ షోరూంల నుంచి వివరాలు సేకరించగలగాలి. అందుకే మీ కోసం 5 లక్షల బడ్జెట్‌లో లభించే కొన్ని కార్ల జాబితా అందిస్తున్నాం. వివిధ కంపెనీలు ఏప్రిల్ 1 నుంచి కొన్ని కార్లను నిలిపివేశాయి. ఇందులో ఆల్టో 800, రెనో క్విడ్ 800 సిసి ఉన్నాయి. 

5 లక్షల బడ్జెట్‌కు లభించే కార్లలో రీనాల్ట్ క్విడ్ బెస్ట్ అని చెప్పవచ్చు. ఇందులో 1.0 లీటర్ మూడు సిలెండర్ పెట్రోల్ ఇంజన్ అందుబాటులో ఉంది. ఈ ఇంజన్ 68 పీఎస్ , 91 ఎన్ఎం టార్క్ ఉత్పత్తి చేస్తుంది. రీనాల్ట్ క్విడ్ కారు ధర 4.70 లక్షల నుంచి 6.33 లక్షల వరకూ ఉంటుంది. రీనాల్ట్ ఇటీవలే తన 800 సిసి ఇంజన్ వేరియంట్ నిలిపివేసింది. 

ఇక ఇదే బడ్జెట్‌కు లభించే మరో కారు మారుతి సుజుకి ఎస్ ప్రెసో. ఈ కారు ధర 4.25 లక్షల్నించి ప్రారంభమౌతుంది. ఇందులో  స్మార్ట్‌ఫోన్ కనెక్టివిటీ, డిజిటల్ స్పీడోమీటర్, టచ్ స్క్రీన్ ఇన్ఫోటైన్‌మెంట్ సిస్టమ్ వంటి ఫీచర్లు ఉన్నాయి. సెక్యూరిటీ కోసం డ్యూయల్ ఫ్రంట్ ఎయిర్ బ్యాగ్స్, రేర్ పార్కింగ్ సెన్సార్, స్పీడ్ అలర్ట్ ఈబీడీ విత్ ఏబీఎస్ , ఫ్రంట్ సీట్ బెల్ట్ రిమైండర్ ఉన్నాయి .

ఇక ఈ బడ్జెట్‌లో లభించే మరో కారు మారుతి సుజుకి ఆల్టో కే10. మారుతి సుజుకి ఆల్టో 800 ఉత్పత్తి ఆగిపోయింది. అందుకే ఆల్టో కే10 అత్యంత చౌక కారుగా మిగిలింది. భారతీయ మార్కెట్‌లో అత్యంత ఆదరణ పొందిన చౌక కార్లలో ఇదొకటి. ఇందులో 1.0 లీటర్ మూడు సిలెండర్ల ఇంజన్ ఉంది. ఈ కారు ధర 3.99 లక్షల నుంచి ప్రారంభమై 5.95 లక్షల వరకూ ఉంటుంది. ఆల్టో కే10లో 7 ఇంచెస్ టచ్ స్క్రీన్ ఇన్‌ఫోటైన్‌మెంట్ సిస్టమ్, యాపిల్ కార్ ప్లే, ఆండ్రాయిడ్ ఆటో, కీలెస్ ఎంట్రీ, డిజిటల్ ఇన్‌స్ట్రుమెంట్ క్లస్టర్ ఉన్నాయి. సెడాన్ మోడల్‌లో స్టీరింగ్ మౌంటెడ్ కంట్రోల్ , మేన్యువల్‌గా ఎడ్జస్ట్ చేసే ఓఆర్వీఎం ఉన్నాయి.

Also read: Maruti Suzuki Subscription: కారు కొనకుండానే నెలవారీ సబ్‌స్క్రిప్షన్‌తో మీ సొంతం చేసుకోవడం ఎలా

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.     

Android Link - https://play.google.com/store/apps/details?id=com.indiadotcom.zeetelugu     

Apple Link - https://apps.apple.com/in/app/zee-telugu-news/id1633190712

మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook

Trending News