Maruti Suzuki Subscription: మారుతి సుజుకి గతంలో అంటే మూడేళ్ల క్రితం ప్రారంభించిన ఓ స్కీమ్ కు విశేష ఆదరణ లభించింది. ఈ స్కీములో భాగంగా కారు కొనకుండానే కేవలం సబ్‌స్క్రిప్షన్ ఆధారంగా కారు వాడుకునే సౌలభ్యం కల్పించింది మారుతి సుజుకి కంపెనీ. ఆశ్చర్యంగా ఉందా..ఆ వివరాలు తెలుసుకుందాం..
దేశంలో ప్రతి ఒక్కరికీ కారు కొనాలనే ఆలోచన ఉంటుంది. కానీ కార్ల ధరలు ఆకాశాన్నంటుతుండటంతో ఏం చేయాలో అర్ధం కాని పరిస్థితిలో ఉంటారు. బహుశా అందుకే అనుకుంటా మారుతి సుజుకి కంపెనీ మూడేళ్ల క్రితం లాంచ్ చేసిన ఓ స్కీమ్‌కు కస్టమర్ల నుంచి పెద్దఎత్తున స్పందన లభించింది. ఈ స్కీమ్‌లో కస్టమర్లు కారు కొనకుండా కేవలం సబ్‌స్క్రిప్షన్ ఆధారంగా కారు వాడుకునే అవకాశం ఉంటుంది. దీనిని సబ్‌స్క్రిప్షన్ ఫైనాన్స్ మోడల్ అంటారు. వాస్తవారికి ఈ తరహా స్కీములు ఖరీదైన లగ్జరీ కార్లకు ఉంటాయి. ఇప్పుడు సాధారణ కార్లకు కూడా ఈ మోడల్ పరిచయం చేస్తున్నాయి వివిధ కారు కంపెనీలు. మారుతి సుజుకి ప్రవేశపెట్టిన ఈ స్కీము కంపెనీకు ఏ విధంగా ప్రయోజనకరమైందో తెలుసుకుందాం.
మారుతి సుజుకి ప్రవేశపెట్టిన మారుతి సుజుకి సబ్‌స్క్రైబ్ ప్రోగ్రామ్‌లో 292 శాతం వృద్ధి కన్పించింది. ఈ స్కీమ్ ప్రకారం ఏదైనా కారుని ఆ కారును కొనుగోలు చేయకుండానే నెలవారీ సబ్‌స్క్రిప్షన్ ఆధారంగా నచ్చిన కారుని ఇంటికి తీసుకెళ్లవచ్చు. ఈ ప్రోగ్రామ్ ఇప్పుడు 25 నగరాల్లో ఉంది. గత ఏడాదిగా ఈ ప్రోగ్రాంలో వృద్ధి నమోదవుతోంది. మారుతి సుజుకి సబ్‌స్క్రిప్షన్ ప్రోగ్రామ్‌లో 2022-23 ఆర్ధిక సంవత్సరంలో 292 శాతం వృద్ధి కన్పించింది. సబ్‌స్క్రిప్షన్ మోడల్ కింద కారు తీసుకెళ్లే కస్టమర్లు కేవలం నెలవారీ రుసుము చెల్లించాలి. మారుతి కంపెనీనే ఆర్టీవో, కారు ఇన్సూరెన్స్, మెయింటెనెన్స్, రోడ్ సైడ్ అసిస్టెన్స్ వంటివి చూసుకుంటుంది.
అయితే ఈ ప్రోగ్రాంలో కొన్ని నిబంధనలున్నాయి. కస్టమర్లు మెంబర్‌షిప్ ప్రోగ్రామ్ ఎంపిక చేసుకోవల్సి ఉంటుంది. అది 1-5 ఏళ్ల మధ్యలో ఉంటుంది. షరతులు ప్రకారం ఒక ఏడాదిలో 10 వేల కిలోమీటర్లు లేదా 25 వేల కిలోమీటర్ల కంటే ఎక్కువ నడపకూడదు.
ప్రస్తుత మారుతి సుజుకి ఏయే కార్లకు ఈ సబ్‌స్క్రిప్షన్ ప్రోగ్రామ్ అందిస్తుందో వెల్లడిస్తోంది. ఇందులో సెలేరియో, వేగన్ ఆర్, స్విఫ్ట్, డిజైర్, ఎర్టిగా , బ్రిజా ఎస్‌యూవీ ఉన్నాయి. కొత్తగా లాంచ్ చేసిన ఫ్రాంక్స్, గ్రాండ్ విటారా హైబ్రిడ్, ఫ్లాగ్‌షిప్ మోడల్ ఇన్విక్టో హైబ్రిడ్ ఎంపీవీలు కూడా ఈ ప్రోగ్రాంలో కంపెనీ త్వరలో అందించనుంది. వేగన్ ఆర్ నెలవారీ రుసుము 12,783 రూపాయలు కాగా ఇన్విక్టోకు నెలకు 61,860 రూపాయలు అవుతుంది.
ప్రస్తుతం మారుతి సుజుకి సబ్‌స్క్రిప్షన్ ప్రోగ్రామ్ ఢిల్లీ, గురుగ్రామ్, నోయిడా, ఘజియాబాద్, ఫరీదాబాద్, బెంగళూరు, హైదరాబాద్, పూణే, ముంబై, నవీ ముంబై, ఠాణే, చెన్నై, అహ్మదాబాద్, గాంధీనగర్, జైపూర్, ఇండోర్, మంగళూరు, మైసూరు వాసులకు అందుబాటులో ఉంది. త్వరలో మరిన్ని నగరాలకు ఈ కార్యక్రమం విస్తరించనుంది.
Also read: PF Advance Rules: పీఎఫ్ అడ్వాన్స్ నియమాలేంటి, ఏయే అవసరాలకు, ఎలా తీసుకోవాలి
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://play.google.com/store/apps/details?id=com.indiadotcom.zeetelugu
Apple Link - https://apps.apple.com/in/app/zee-telugu-news/id1633190712
మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook