అంతరిక్షంలోకి మనుషులు... మరో సంచలనానికి తెర లేపిన ఎలన్ మస్క్

Edited by - ZH Telugu Desk | Last Updated : May 15, 2022, 01:26 PM IST
  • మరో సంచలనానికి తెరలేపుతున్న ఎలన్ మస్క్
  • వచ్చే వారం నుంచే ట్రైనింగ్‌ క్లాసులు
  • ఔత్సాహికులు సద్వినియోగం చేసుకోవాలని కోరారు
అంతరిక్షంలోకి మనుషులు... మరో సంచలనానికి తెర లేపిన ఎలన్ మస్క్

Space travel టెస్లాతో సక్సెస్ అయి. ట్విట్టర్ తో పాపులర్ అయి. స్పెస్ ఎక్స్‌తో సార్థకమైన ఎలన్‌ మస్క్ ఇప్పుడు మరో సంచలనానికి తెరలేపుతున్నారు. సివిలియన్ పొలారిస్ డాన్ మిషన్‌ ద్వారా అంతరిక్షంలో నడిచేందుకు ట్రైనింగ్‌ క్లాసును ప్రారంభించారు.  ఈ  ట్రైనింగ్ క్లాస్ సక్సెస్ ఫుల్ గా పూర్తి చేసుకున్న తర్వాత నలుగురు సిబ్బంది అంతరిక్షంలోకి పంపుతామని ప్రకటించారు.  'ఇన్స్పిరేషన్‌4' పేరుతో ఈ ప్రాజెక్టును టేక్‌ అప్ చేసినట్లు సమాచారం. ఇన్స్పిరేషన్‌4 ద్వారా షిఫ్ట్‌4 పేమెంట్స్‌ అధినేత బిలియనీర్‌ జేర్డ్‌ ఐసాక్‌మాన్‌ నేతృత్వంలోని ఈ ప్రాజెక్టు ముందుకు సాగనుంది. కిందటి  870 మైళ్ల గరిష్ట ఎత్తును అధిగమించి ఈసారి అంత కంటె పెద్ద రికార్డు సృష్టించాలని ప్రయత్నిస్తున్నారు.
 
వచ్చే వారం నుంచే ట్రైనింగ్‌ క్లాసులు ప్రారంభంకానున్నాయని  ఐసాక్‌మాన్ ట్వీట్‌లో చేశారు. ఔత్సాహికులు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని కోరారు. భూమ్మీద ఎంతో పుడతారు ఎంతో మంది చస్తారు వాళ్ల గురించి లెక్క చేయకుండా మీ మిషన్ ను సక్సెస్ చేసుకునేందుకు మా సహకారం తీసుకోండి అంటూ ట్వీట్ చేశారు. దీంతో ఈపాటికే చాలా మంది రియాక్ట్ అయి రిప్లై ఇస్తున్నారు. అయితే ట్రైనింగ్ లో పాస్ అయిన నలుగురిని మాత్రమే ఎంపిక చేసుకొని సొంత ఖర్చుల మీద అంతరిక్షంలోకి పంపుతామని ఐసాక్ మాన్ ట్విట్టర్‌ లోపేర్కొన్నారు.

స్పేస్‌ ఫ్లైట్‌ నౌ కథనం ప్రకారం.. ఇటీవల జరిగిన ఇంటర్వ్యూలో ఐసాక్‌మాన్‌ స్పేస్‌వాక్‌ గురించి తన అభిప్రాయాలను వెల్లడించారు. ప్రస్తుతం స్పేస్‌ ఎక్స్‌ ప్రస‍్తుతం కూ-3, ప్రైవేట్‌ ఏఎక్స్‌-1 లాంచింగ్‌, లాంచ్‌ క్రూ-4తో బిజిగా ఉంది చెప్పారు. అయితే ఇంకా ఎవరైనా తమ జీవితంలో నిజంగా పైకి రావాలి అని అనుకుంటే తము ఇచ్చే అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని కోరారు. పొలిటికల్ టూరిస్టుల కోసమో, విభజన వాదుల కోసమో...భస్మాసుర హస్తాల కోసమో తాను ఈ అవకాశాన్ని కల్పించలేదని తేల్చిచెప్పారు. అంతరిక్షంలో ప్రయాణించాలన్న కాంక్ష ఉన్న వాళ్ల కోసమే ఈ ఆఫర్ చేస్తున్నట్లు తేల్చిచెప్పారు.

also read డబ్బులన్నీ పోయాక యూట్యూబర్‌కు జ్ఞానోదయం

also read Apple iphone 11: రూ.51 వేలు విలువ చేసే 'ఐఫోన్ 11' కేవలం రూ.33 వేలకే... డిస్కౌంట్ ఇలా పొందండి..

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3hDyh4G

Apple Link - https://apple.co/3loQYe

 

Trending News