Youtuberక్రిప్టో కరెన్సీ దెబ్బకు గతంలో కొంత మంది ఎనలేని సంపద పోగుచేసుకుంటే... ఇప్పుడు చాలా మంది క్రిప్టో దెబ్బకు దివాళా తీస్తున్నారు. పెట్టుబడిదారుల అపనమ్మకం, ప్రభుత్వాలు విధించే ట్యాక్స్, సైబర్ ఎటాక్స్ తదితర కారణాల వల్ల క్రిప్టో కరెన్సీ మార్కెట్ క్రాష్ అవుతోంది. దీంతో ఎంతో మంది డబ్బులు పోగొట్టుకుంటున్నారు. ఈ జాబితాలో ప్రముఖ యూట్యూబర్ కేఎస్ఐ కూడా చేరిపోయారు. ఆయన ఏకంగా 2.8 మిలియన్ పౌండ్లను క్రిప్టో కారణంగా నష్టిపోయారు.
కేవలం వారం రోజుల వ్యవధిలో క్రిప్టో కరెన్సీ అయిన లూనా ఏకంగా వంద శాతం క్రాష్ అయింది. దీంతో అందులో పెట్టుబడి పెట్టిన వాళ్ళ డబ్బులన్నీ ఆవిరి అయిపోయాయి.
ఈకారణంగా లునా కరెన్సీలో పెట్టుబడి పెట్టిన యూట్యూబర్ కేఎస్ఐ 2.8 మిలియన్ పౌండ్ల నిలువుదోపిడీకి గురి అయ్యారు. దాచుకున్న డబ్బులు పోవడంతో యూట్యూబర్ కేఎస్ఐ వినూత్నమైన ట్వీట్ పెట్టారు. ఆయన ట్వీట్‌లో తాత్వికత గోచరించింది. డబ్బుల కంటే ముఖ్యమైన విషయాలు ఇంకా చాలానే ఉన్నాయని డబ్బు పోయిన తర్వాత దాని విలువ తెలిసిందని ఆయన ట్వీట్ చేశారు. ఇటీవలే తాను స్వీకరించిన థెరపీ వల్లే ఇదంతా సాధ్యమైందని అన్నారు. డబ్బులు ఉన్నప్పటి కంటే ఇప్పుడే హాయిగా ఉందని ట్వీట్ చేశారు.
కిందటి ఏడాది తాను ఓ వ్యక్తి దగ్గర థెరపీ కోసం వెళ్లాలని ఇక అప్పటి నుంచి తాను చాలా హాయిగా ఉన్నట్లు వెల్లడించారు. డబ్బు పోతే పోయింది కాని తనకు ఏమి కానందుకు దేవుడికి కృతజ్ఞతలు తెలుపుతున్నానని చెప్పారు. తనకు తన కుటుంబానికి ఏమీ కానందుకు దేవుడి కృతజ్ఞతలు తెలిపుతున్నానని చెప్పారు. అయితే బతికుంటే డబ్బులు ఎలాగైన మళ్లీ సంపాదించుకుంటానని చెప్పారు. థెరపీ ద్వారా తనను కాపాడిని వ్యక్తికి ధన్యవాదాలు తెలిపారు. బతికి ఉంటే బలుసాకు తినొచ్చు. ఇంకా మంచిగా బతికితే హిమాలయాల్లో ఆకుపసర్లు తిని ఇంకా చక్కగా బతకొచ్చని ట్వీట్ చేశారు. తనకు ప్రాణ భిక్ష పెట్టిన థెరిపిస్టుకు ధన్యవాదులు తెలిపారు. అయితే ఇకపై తనకు ఏది లాభం అయితే అదే చేసుకుంటానని తేల్చిచెప్పారు. అందరి సహకారంతో అందరి అంగీకారంతో త్వరలో మరో థెరిపిస్టు దగ్గరకు వెళ్లి లైఫ్ సెటిల్ చేసుకుంటానని తెలిపారు. డబ్బు బతకడానికే కాని డబ్బు కోసం బతికే నేచర్ తనది కాదని చెప్పారు. తన శ్రేయస్సు కోరే పెద్దలే త్వరలో మంచి థెరిపిస్టును చూపించి అక్కడ సెటిల్ చేస్తారనే ఆశాభావం వ్యక్తం చేశారు. ఒక వేళ అది సాధ్యం కాకపోతే ఇంకేదైన పని చేసుకొని హాయిగా బతికేస్తానని ట్వీట్ చేశారు.
also read Scooty Price: 70 వేలల్లో స్కూటీ కొనాలనుకుంటున్నారా.. అయితే ఇది మీకోసమే..!
alsor read Wheat price ఎగుమతలపై నిషేధంతో భారత్‌లో తగ్గనున్న గోధుమల ధరలు
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3hDyh4G
Apple Link - https://apple.co/3loQYe
Twitter , Facebookమా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి