EPF Interest Credit: పీఎఫ్ ఖాతాదారులకు శుభవార్త, త్వరలోనే పీఎఫ్ వడ్డీ డబ్బులు మీ ఖాతాల్లో

EPF Interest Credit: ఉద్యోగులకు దీపావళి ఈసారి మరింత ప్రకాశితం కానుంది. దీపావళికి ముందే ఈపీఎఫ్ ఖాతాల్లో వడ్డీ డబ్బులు జమ కానున్నాయి. ఈపీఎఫ్ వడ్డీ ఎంత జమ కానుందో చూద్దాం..

Written by - Md. Abdul Rehaman | Last Updated : Oct 8, 2022, 08:45 PM IST
EPF Interest Credit: పీఎఫ్ ఖాతాదారులకు శుభవార్త, త్వరలోనే పీఎఫ్ వడ్డీ డబ్బులు మీ ఖాతాల్లో

EPF Interest Credit: దేశవ్యాప్తంగా ఉన్న 6.5 కోట్లమంది ఈపీఎఫ్ ఖాతాదారులకు గుడ్‌న్యూస్. దీపావళి పండుగకు ముందే ఉద్యోగులకు లాభం చేకూరనుంది. ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్న పీఎఫ్ డబ్బులు జమ కానున్నాయి. పీఎఫ్ ఖాతాదారుల ఎక్కౌంట్స్‌లో త్వరలోనే వడ్డీ డబ్బులు పడనున్నాయి. 

దేశంలోని 6.5 కోట్లమంది పీఎఫ్ ఖాతాదారుల ఎక్కౌంట్స్‌లో 2021-22 వడ్డీ డబ్బులు జమ కానున్నాయని ప్రకటన రానుంది. ఎంప్లాయిస్ ప్రోవిడెంట్ ఫండ్ ఈసారి సభ్యులకు 8.1 శాతం వడ్డీ ఇవ్వనుంది. ఈ డబ్బులు నేరుగా ఖాతాదారుడి ఎక్కౌంట్లోనే జమ కానుంది. ఈపీఎఫ్ఓ కేంద్ర బోర్డ్ గత భేటీలో ఈ మేరకు నిర్ణయమైంది. ప్రోవిడెంట్ ఫండ్ ఎక్కౌంట్‌లో ఉద్యోగి, యజమాని ఇద్దరి షేర్ ఉంటుంది. ఇందులో బేసిక్, డియర్‌నెస్ అలవెన్స్ కలిపి 24 శాతం ఉంటుంది. 

పీఎఫ్ వడ్డీ ఎలా లెక్కగడతారు

పీఎఫ్ అనేది ప్రతి నెలా జమ అవుతుంటుంది. వడ్డీ ఏడాది ఆధారంగా జమ అవుతుంది. వడ్డీను నెల ఆధారంగానే లెక్కిస్తారు. ఈపీఎఫ్ఓ నిబంధనల ప్రకారం ఆర్ధిక సంవత్సరం చివర్లో విత్‌డ్రాయల్ జరిగితే..దానిని తప్పించి 12 నెలల వడ్డీ లెక్కిస్తారు. ఎక్కౌంట్ ఓపెనింగ్, క్లోజింగ్ బ్యాలెన్స్ చూస్తారు. దీని ప్రకారం నెలవారీ రన్నింగ్ బ్యాలెన్స్ చేర్చుతారు. 

ఈపీఎఫ్ఓలో వడ్డీ డబ్బులు చెక్ చేసేందుకు పెద్దగా ఆందోళన అవసరం లేదు. మీ ఖాతాలో వడ్డీ డబ్బులు వచ్చాయా లేదా అనేది చాలా సులభంగా చెక్ చేయవచ్చు. ఈపీఎఫ్ వడ్డీ డబ్బులు జమ కాగానే మెస్సేజ్ ద్వారా ఖాతాదారుడికి తెలుస్తుంది. స్వయంగా ఎవరికివారు మెస్సేజ్ పంపించి తెలుసుకోవచ్చు. దీనికోసం మీరు మీ రిజిస్టర్డ్ మొబైల్ నెంబర్ నుంచి EPFOHO UAN ENG టైప్ చేసి 7738299899 నెంబర్‌కు మెస్సేజ్ పంపిస్తే..మీ బ్యాలెన్స్ తెలుస్తుంది. 

Also read: Post Office Franchise: పోస్టాఫీసు ఫ్రాంచైజీ వ్యాపారంలో మంచి లాభాలు, ఇవాళే ప్రారంభించండి

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.    

Android Link - https://play.google.com/store/apps/details?id=com.indiadotcom.zeetelugu  

Apple Link - https://apps.apple.com/in/app/zee-telugu-news/id1633190712

మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook

Trending News