Flipkart Sale: రేపటి నుంచి ఫ్లిప్ కార్ట్ బిగ్ బచత్ సేల్.. అనేక వస్తువులపై భారీ డిస్కౌంట్స్!

Flipkart Sale: ఫ్లిప్ కార్ట్ లో ప్రస్తుతం బిగ్ బచన్ ధమాల్ సేల్ ప్రారంభం కానుంది. మే 20న ప్రారంభం కానున్న ఈ సేల్ లో ఎలక్ట్రానిక్ వస్తువులు సహా అనేక వస్తువులపై భారీ డిస్కౌంట్ అందుబాటులోకి రానుంది.   

Written by - ZH Telugu Desk | Last Updated : May 19, 2022, 02:46 PM IST
Flipkart Sale: రేపటి నుంచి ఫ్లిప్ కార్ట్ బిగ్ బచత్ సేల్.. అనేక వస్తువులపై భారీ డిస్కౌంట్స్!

Flipkart Sale: ప్రముఖ షాపింగ్ వెబ్ సైట్ ఫ్లిప్ కార్ట్ లో ప్రస్తుతం బిగ్ బచత్ ధమాల్ సేల్ ప్రారంభం కానుంది. మే 20న ప్రారంభం కానున్న ఈ సేల్ 22 వరకు కొనసాగనుంది. ఈ సేల్ లో స్మార్ట్‌ఫోన్‌లు, ల్యాప్‌టాప్‌లతో సహా అనేక వస్తువులను చాలా చౌకగా కొనుగోలు చేయవచ్చు. ఈ సేల్ వల్ల అనేక వస్తువులపై అధిక డిస్కౌంట్ పొందవచ్చు. స్మార్ట్ ఫోన్, ల్యాప్ ట్యాప్ వంటి వాటిని కొనేందుకు ఈ సేల్ ఉపయోగకరంగా ఉంటుంది. అయితే ఈ సేల్ లో చౌకగా లభించే ఉత్పత్తులేవో తెలుసుకుందాం. 

ఫ్లిప్‌కార్ట్ బిగ్ బచత్ ధమాల్ సేల్‌లో మీరు 12pm, 8am, 4pm గంటలకు బ్యాంగ్ డీల్‌ల ప్రయోజనాన్ని పొందుతారు. అలాగే ప్రతిరోజూ మధ్యాహ్నం 12 గంటల నుంచి రాత్రి 10 గంటల వరకు అతి తక్కువ ధరలకు వస్తువులను కొనుగోలు చేసే అవకాశం ఉంది. కాంబో డీల్స్ ఉదయం 8, సాయంత్రం 4, మధ్యాహ్నం 12 గంటలకు కూడా అందుబాటులో ఉంటాయి.  ఈ సేల్ లో అనేక ఆఫర్స్ తో పాటు మరికొన్ని ప్రయోజనాలను పొందేందుకు అవకాశం ఉంది.  

అయితే ఈ సేల్ కు సంబంధించిన ఆఫర్స్ గురించి ఫ్లిప్‌కార్ట్ ఇంకా పూర్తి స్పష్టత ఇవ్వలేదు. ఎలక్ట్రానిక్ వస్తువులతో పాటు ఉపకరణాలు కొనుగోలు చేయాలని ప్లాన్ ఉన్న వినియోగదారులు ఈ సేల్ లో అందుబాటులోకి రానున్న భారీ డిస్కౌంట్స్ ను సద్వినియోగం చేసుకోవచ్చు. 

ఈ సేల్ లో మొబైల్ కేబుల్స్ తో పాటు ఇతర వస్తువులు ఫ్లిప్ కార్ట్ సేల్ లో రూ. 99 కంటే తక్కువ ధరకే అందుబాటులోకి రానున్నాయి. అలాగే స్మార్ట్ ఫోన్స్ కవర్స్ ప్రారంభ ధర రూ. 199.. ల్యాప్ ట్యాప్ అప్లయెన్సెస్ రూ. 99 నుంచి అందుబాటులో ఉంటాయి. దీంతో పాటు స్మార్ట్ టీవీలపై అత్యధికంగా 70 శాతం.. రిఫ్రిజిరేటర్లపై 55 శాతం తగ్గింపును పొందవచ్చు.  

Also Read: SBI New Rules: ఎస్బీలో మారిన ఏటీఎం క్యాష్ విత్‌డ్రా నిబంధనలు, క్యాష్ ఎలా విత్‌డ్రా చేయాలంటే

Also Read: Lenovo Tab M8 Amazon: రూ.449 ధరకే Lenovo M8 ట్యాబ్ కొనేయండి!

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.

Android Link - https://bit.ly/3hDyh4G

Apple Link - https://apple.co/3loQYe 

మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి TwitterFacebook 

Trending News