Flipkart Big Bachat Dhamaal Sale: రూ. 7 వేలకే టీవీ, 16 వేలకే ల్యాప్‌టాప్స్, 58 వేల నుండే బైక్స్

Flipkart Big Bachat Dhamaal Sale: రూ. 16 వేలకే ల్యాప్‌టాప్స్, రూ. 7 వేలకే టాప్ సెల్లింగ్ టీవీలు, రూ. 58 వేల నుండే పెట్రోల్ అండే ఎలక్ట్రిక్ వేరియంట్ బైక్స్ విక్రయిస్తున్నట్టు ఫ్లిప్‌కార్ట్ ప్రకటించింది. ఇవన్నీ కూడా జస్ట్ శాంపిల్ మాత్రమే.. ఇంతకు మించిన ఆఫర్స్ ఇంకెన్నో ఉన్నాయంటోంది ఫ్లిప్‌కార్ట్.

Written by - Pavan | Last Updated : Aug 11, 2023, 09:33 PM IST
Flipkart Big Bachat Dhamaal Sale: రూ. 7 వేలకే టీవీ, 16 వేలకే ల్యాప్‌టాప్స్, 58 వేల నుండే బైక్స్

Flipkart Big Bachat Dhamaal Sale: తక్కువ ధరలో ఎక్కువ ఫీచర్స్ ఉన్న కొత్త స్మార్ట్ ఫోన్ కొనాలనుకుంటున్నారా ? లేదా కెరీర్ కోసం ఉపయోగపడేలా కొత్త హై కాన్ఫిగరేషన్ ఉన్న ల్యాప్‌టాప్ తీసుకోవాలనుకుంటున్నారా ? సినిమాలు , మ్యూజిక్ ఎంజాయ్ చేసేందుకు అవరసమైన సౌండ్ క్వాలిటీ ఉన్న ఈయర్ బడ్స్ కొంటే బాగుంటుంది అని అనుకుంటున్నారా ? ఇంట్లో ఉన్న పాత టీవీని పక్కనపెట్టి కొత్త లేటెస్ట్ టెక్నాలజీతో, బిగ్ స్క్రీన్‌తో వచ్చే స్మార్ట్ టీవీ లేదా హోమ్ థియేటర్ కొనాలనుకుంటున్నారా ? 

రాబోయేది అంతా ఫెస్టివల్ సీజన్ కనుక మనసుకు నచ్చిన సంప్రదాయబద్దమైన దుస్తులు తక్కువ ధరలో ఎక్కడ లభిస్తాయి అని ఆలోచిస్తున్నారా ? ఇవన్నీ కాదు కానీ ఇంట్లో అవసరాల కోసం కొత్త వాషింగ్ మెషిన్ నుండి మొదలుకుని కిచెన్ లో గృహోపకరణాలు వరకు తక్కువ ధరలో వచ్చేవి ఏవైనా కొనాలి అని ప్లాన్ చేస్తున్నారా ? ఇది అసలే మాన్‌సూన్ సీజన్ కదా.. మంచి రెయిన్ కోట్స్ తీసుకుంటే బాగుంటుంది అనుకుంటున్నారా ? ఈ అవసరాలు, ఆఫర్లతో సంబంధం లేకుండా మీకు ఆన్‌లైన్ షాపింగ్ అంటే ఇష్టమా ? ఈ ప్రశ్నల్లో ఏ ఒక్క ప్రశ్నకు మీ నుండి ఔను అనే సమాధానం వచ్చినా.. ఇదిగో ఈ డీటేల్స్ మీ కోసమే. 

పై ప్రశ్నలన్నింటికీ సింగిల్ ఆన్సర్ ఫ్లిప్‌కార్ట్ బచత్ ఢమాల్ సేల్. ఔను.. ఫ్లిప్‌కార్ట్ వాళ్లు ప్రతీ సంవత్సరం స్వాతంత్య్ర దినోత్సవం సందర్భంగా అందించే ఆఫర్స్, డిస్కౌంట్ మేళా ఈ ఏడాది కూడా వచ్చేసింది. పంద్రాగస్టు వేడుకలను పురస్కరించుకుని ఈ ఏడాది కూడా ఆగస్టు 11వ తేదీ నుంచి 13వ తేదీ మిడ్నైట్ వరకు ఫ్లిప్‌కార్ట్ బచత్ ఢమాల్ సేల్ అందుబాటులో ఉండనుంది. ఫ్లిప్‌కార్టులో షాపింగ్ చేసే కస్టమర్స్ తమకి అవసరమైంది కొనుక్కునేందుకు ఇదే టైమ్. 

ఇదే రైట్ టైమ్ అని ఎందుకు చెప్పుకోవచ్చంటే.. ఫ్లిప్‌కార్ట్ బచత్ ఢమాల్ సేల్ సందర్భంగా 1000 కి పైగా బ్రాండ్స్ నుండి ఒక లక్షకుపైగా ఉత్పత్తులపై 80 శాతం వరకు డిస్కౌంట్ అందిస్తున్నట్టు ఫ్లిప్‌కార్ట్ ప్రకటించింది. అంతేకాదు.. తక్కువ ధరలో ప్రోడక్ట్స్, ఫ్రీగా డెలివరీ అందించడంతో పాటు ఏదైనా కారణాలతో ఆ ప్రోడక్ట్ నచ్చకపోతే ఈజీగా రిటర్న్స్ చేసే అవకాశం సైతం అందిస్తోంది. ఆన్‌లైన్ షాపింగ్ లవర్స్‌కి ఇంతకంటే ఎక్కువ ఛాన్స్ ఇంకేం కావాలో చెప్పండి.  
ఇది కూడా చదవండి : 
Fuel Credit Cards Benefits: అసలు ఫ్యూయెల్ క్రెడిట్ కార్డులతో లాభం ఉంటుందా ?   
ఫ్లిప్‌కార్ట్ బచత్ ఢమాల్ సేల్ సందర్భంగా ఎగ్జిబిట్ చేసిన ఉత్పత్తుల్లో టెంప్టింగ్ అనిపిస్తోన్న కొన్ని ప్రోడక్ట్స్ గురించి ఫోకస్ చేస్తే.. రూ. 199 కే స్పోర్ట్స్ షూస్, రూ. 149 క్యాజ్వల్ షూస్, రూ. 199 కే సంప్రదాయమైన దుస్తులు, రూ. 129 కే అందమైన, ఆకర్షణీయమైన బెడ్ షీట్స్, రూ. 599 నుండే ఇయర్ బడ్స్, రూ. 16 వేలకే ల్యాప్‌టాప్స్, రూ. 7 వేలకే టాప్ సెల్లింగ్ స్మార్ట్ టీవీలు, రూ. 58 వేల నుండే పెట్రోల్ అండే ఎలక్ట్రిక్ వేరియంట్ బైక్స్ విక్రయిస్తున్నట్టు ఫ్లిప్‌కార్ట్ ప్రకటించింది. ఇవన్నీ కూడా జస్ట్ శాంపిల్ మాత్రమే.. ఇంతకు మించిన ఆఫర్స్ ఇంకెన్నో ఉన్నాయంటోంది ఫ్లిప్‌కార్ట్. ఫ్లిప్‌కార్ట్ బచత్ ఢమాల్ సేల్ పై కన్నేయడమే ఆలస్యం.. మిమ్మల్ని టెంప్ట్ చేసే ఆఫర్స్ ఎన్నో దర్శనం ఇవ్వనున్నాయి.

ఇది కూడా చదవండి :  Peon To Richest Man Success Story: ఒకప్పుడు ప్యూన్.. ఇప్పుడు 88 వేల కోట్లకు అధిపతి

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

Android Link https://bit.ly/3P3R74U

Apple Link - https://apple.co/3loQYe 

Twitter , Facebookమా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి

Trending News