Fuel Credit Cards Benefits: అసలు ఫ్యూయెల్ క్రెడిట్ కార్డులతో లాభం ఉంటుందా ?

Fuel Credit Cards Benefits: అసలు ఫ్యూయెల్ క్రెడిట్ కార్డులతో లాభం ఉంటుందా ? నష్టమా ? లాభం ఉంటే ఎలాంటి ఎలాంటి ప్రయోజనాలు ఉంటాయి ? బెస్ట్ ఫ్యూయెల్ క్రెడిట్ కార్డుని ఎలా సెలెక్ట్ చేసుకోవాలి ? ఇలాంటి డౌట్స్ చాలామందికి వస్తుంటాయి కదా.. అయితే సమాధానం ఇదిగో.  

Written by - Pavan | Last Updated : Aug 11, 2023, 06:32 PM IST
Fuel Credit Cards Benefits: అసలు ఫ్యూయెల్ క్రెడిట్ కార్డులతో లాభం ఉంటుందా ?

Fuel Credit Cards Benefits: క్రెడిట్ కార్డ్స్ పలు రకాలు.. అందులో ఈ ఫ్యూయెల్ క్రెడిట్ కార్డ్స్ కూడా ఒక రకం. తమ బిజినెస్‌తో పాటు కస్టమర్‌బేస్ పెంచుకోవడం కోసం బ్యాంకులు జారీ చేసే ఈ క్రెడిట్ కార్డులు భారత్ పెట్రోలియం కార్పొరేషన్ లిమిటెడ్ ( బీపీసీఎల్ ), లేదా ఇండియన్ ఆయిల్ కార్పోరేషన్ లిమిటెడ్ ( ఐఓసీఎల్ ) వంటి ఏదో ఒక ఆయిల్ మార్కెటింగ్ కంపెనీతో టయప్ అయ్యి ఉంటాయి. ఉదాహరణకు భారత్ పెట్రోలియం కార్పోరేషన్ లిమిటెడ్ తో టయప్ అయిన బ్యాంక్ అందించిన ఫ్యూయెల్ క్రెడిట్ కార్డులతో ఆయా పెట్రోల్ బంకుల్లో పలు ఫ్యూయేల్ పోయించుకుంటే పలు ఆర్థిక ప్రయోజనాలు ఉంటాయి. 

అసలు ఫ్యూయెల్ క్రెడిట్ కార్డులతో లాభం ఉందా ?
కొన్ని బ్యాంకులు ఫ్యూయెల్ క్రెడిట్ కార్డులపై కనీసం 50 రోజుల వరకు గ్రేస్ పీరియడ్ ఇస్తున్నాయి. అంటే మీకు ఆ క్రెడిట్ కార్డ్ బిల్లు చెల్లించేందుకు అన్ని రోజుల గడువు లభించినట్టే. అంతేకాకుండా ఫ్యూయెల్ సర్‌చార్జ్ వెనక్కి ఇవ్వడం, లేదా ఫ్యూయెల్ పోయించుకున్న మొత్తంపై 1 శాతం నుంచి 2 శాతం వరకు క్యాష్‌బ్యాక్ ఆఫర్స్ ఇవ్వడం లాంటివి వర్తిస్తాయి. ఇవేకాకుండా రివార్డ్స్ పాయింట్స్ రూపంలోనూ ఆర్థిక ప్రయోజనాలు ముడిపడి ఉంటాయి. ఈ రివార్డ్స్ పాయింట్స్ క్లెయిమ్ చేసుకుని మళ్లీ ఫ్యూయెల్ పొందడం లేదా గిఫ్ట్ ఓచర్స్, ట్రావెల్ ఓచర్స్, లేదా క్యాష్ బ్యాక్ బెనిఫిట్స్ పొందవచ్చు. ఇలా చూసుకుంటే ఫ్యూయెల్ క్రెడిట్ కార్డులతో ప్రయోజనం ఉందనే చెప్పుకోవచ్చు. 

లాంగ్ రోడ్ ట్రిప్స్ :
ఏదైనా లాంగ్ రూట్లో రోడ్ ట్రిప్ కి వెళ్లినప్పుడు సహజంగానే ఫ్యూయెల్ ఎక్కువ అవసరం అవుతుంది. లేదంటే నిత్యం సొంత వాహనంలో ప్రయాణాలు చేసే రంగాల్లో ఉద్యోగాలు చేసే వారికి, వ్యాపారాలు చేసుకునే వారికి కూడా ఈ ఫ్యూయెల్ క్రెడిట్ కార్డులు లాభదాయకం అనే చెప్పుకోవచ్చు. ఎందుకంటే ఎంత ఎక్కువ వారికి ఫ్యూయెల్ అవసరం అవుతుందో.. అదే విధంగా వారికి క్యాష్ బ్యాక్ ఆఫర్స్ కానీ లేదా రివార్డ్స్ పాయింట్స్ రూపంలో కానీ మానిటరీ బెనిఫిట్స్ ఉంటాయి. అంతేకాకుండా ఎక్కువ మొత్తంలో ఫ్యూయెల్ క్రెడిట్ కార్డుపై లావాదేవీలు చేసే వారికి బ్యాంకులు ఆ తరువాతి సంవత్సరంలో యాన్వల్ ఫీజు కూడా రద్దు చేస్తున్నాయి. అంటే ఆ కార్డు ఉపయోగించుకున్నందుకు బ్యాంకు వారికి ఏమీ చెల్లించాల్సిన పని కూడా ఉండదు.

ఇతర ప్రయోజనాలు : 
ఫ్యూయెల్ క్రెడిట్ కార్డులు అందించే బ్యాంకులు అదే కార్డులపై హోటల్ స్టేలో డిస్కౌంట్స్, ట్రావెల్ ఇన్సూరెన్స్, ప్రయాణంలో వాహనానికి ఏదైనా ఇబ్బంది సాంకేతిక సమస్య ఎదురైతే రోడ్ సైడ్ అసిస్టెన్స్, డైనింగ్ ఆఫర్స్ కూడా అందిస్తున్నాయి. దూర ప్రయాణాలు చేసే వారికి ఎలాగూ ఇవన్నీ అవసరమే కనుక ఆ రూపంలోనూ ప్రయోజనాలు పొందే అవకాశం ఉంటుంది. ఇలాంటివన్నీ కలిపి ఒకేచోట వేరే క్రెడిట్ కార్డులపై లభించవు.

ఇది కూడా చదవండి : Peon To Richest Man Success Story: ఒకప్పుడు ప్యూన్.. ఇప్పుడు 88 వేల కోట్లకు అధిపతి

ఇంతకీ బెస్ట్ ఫ్యూయెల్ క్రెడిట్ కార్డులను ఎలా ఎంపిక చేసుకోవాలి ?
ఫూయెల్ వినియోగంపై ఏ బ్యాంకులు ఎక్కువ క్యాష్ బ్యాక్ ఆఫర్ చేస్తున్నాయి, ఏయే బ్యాంకులు ఎక్కువ సర్ చార్జ్ వేవర్ బెనిఫిట్స్ అందిస్తున్నాయి, ఫ్యూయెల్ క్రెడిట్ కార్డు బిల్లు చెల్లించేందుకు ఏ బ్యాంకు ఎక్కువ గ్రేస్ పీరియడ్ ఇస్తోంది, ఏ బ్యాంకు ఎక్కువ రివార్డ్స్ పాయింట్స్ ఇచ్చి తక్కువ యాన్వల్ ఫీజు వసూలు చేస్తోంది అనేటువంటి అంశాలను బేరీజు వేసుకోవాలి. ఈ అంశాలను అన్నింటిని పరిగణనలోకి తీసుకున్నప్పుడు ఏ బ్యాంక్ ఇచ్చే ఫ్యూయెల్ క్రెడిట్ కార్డు బెస్ట్ అనిపిస్తుందో అదే ఎంపిక చేసుకోవాలి.

ఇది కూడా చదవండి : Interesting Facts About CIBIL: ఏయే సందర్భాల్లో సిబిల్ స్కోర్ పడిపోతుందో తెలుసా ?

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

Android Link https://bit.ly/3P3R74U

Apple Link - https://apple.co/3loQYe 

Twitter , Facebookమా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి

Trending News

By accepting cookies, you agree to the storing of cookies on your device to enhance site navigation, analyze site usage, and assist in our marketing efforts.

x