Gold Silver Price Today: పెరిగిన బంగారం, వెండి ధరలు.. హైదరాబాద్‌లో తాజా రేట్ల వివరాలు ఇవే!

June 10th 2022 Gold and Silver Prices in India and Hyderabad: హైదరాబాద్‌లో 22 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.47,950 ఉండగా.. 24 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.52,310గా ఉంది.   

Written by - ZH Telugu Desk | Last Updated : Jun 10, 2022, 07:58 AM IST
  • మహిళలకు షాక్
  • నేటి బంగారం-వెండి రేట్లు ఇవే
  • హైదరాబాద్‌లో 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ఎంతంటే
Gold Silver Price Today: పెరిగిన బంగారం, వెండి ధరలు.. హైదరాబాద్‌లో తాజా రేట్ల వివరాలు ఇవే!

Gold and Silver Price increased today 10th June 2022: దేశంలో బంగారం ధరలు ప్రతిరోజూ మారుతుంటాయి. ప్రపంచవ్యాప్తంగా బంగారం డిమాండ్, కేంద్ర రిజర్వ్ బ్యాంకుల్లో గోల్డ్ నిల్వ, వడ్డీ రేట్లు, డాలర్ విలువ, వివిధ దేశాల మధ్య భౌతిక పరిస్థితులు.. ఇలా ఎన్నో కారణాలు బంగారం ధరలపై ప్రభావం చూపుతాయి. అయితే బంగారానికి మహిళలు అధిక ప్రాధాన్యతనిస్తుండడంతో.. ధరలు ఎంత పెరిగినా వ్యాపారాలు జోరుగానే కొనసాగుతూ ఉంటాయి. ఉక్రెయిన్‌, రష్యా దాడుల నేపథ్యంలో పెరుగుతూ.. తగ్గుతూ వచ్చిన బంగారం, వెండి ధరలు.. తాజాగా ఎగబాకుతున్నాయి. దేశంలోని వివిధ నగరాల్లో ఇవాళ్టి బంగారం ధరలు ఎలా ఉన్నాయో ఓసారి చూద్దాం.

దేశంలో గత 10 రోజుల నుంచి బంగారం ధరలు పెరుగుతూ తగ్గుతూ కొనసాగుతున్నాయి. శుక్రవారం (జూన్ 10) 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర దేశీయ మార్కెట్లో రూ.47,950లు ఉండగా.. 24 క్యారెట్ల బంగారం ధర రూ.52,310లుగా ఉంది. నిన్నటితో పోల్చుకుంటే 22 క్యారెట్ల తులం బంగారంపై రూ. 250.. 24 క్యారెట్ల ధరపై రూ. 270 పెరిగింది. మరోవైపు వెండి ధర స్వల్పంగా పెరిగింది. ప్రస్తుతం దేశీయంగా కిలో వెండి ధర రూ. 62,200గా ఉంది. నిన్నటితో పోల్చుకుంటే రూ. 100 పెరిగింది.

దేశ రాజధాని ఢిల్లీలో 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ. 47,950 ఉండగా.. 24 క్యారెట్ల ధర రూ. 52,310గా ఉంది. ముంబైలో 22 క్యారెట్ల 10 గ్రాముల పసిడి ధర రూ. 47,950 ఉండగా.. 24 క్యారెట్ల ధర రూ. 52,310గా నమోదైంది. చెన్నైలో 22 క్యారెట్ల బంగారం ధర రూ. 48,060గా ఉండగా.. 24 క్యారెట్ల ధర రూ. 52,430 వద్ద కొనసాగుతోంది. బెంగళూరులో 22 క్యారెట్ల బంగారం ధర రూ. 47,950.. 24 క్యారెట్ల ధర రూ. 52,310గా నమోదైంది. కేరళలో 22 క్యారెట్ల ధర రూ. 47,950 ఉండగా.. 24 క్యారెట్ల ధర రూ. 52,310గా ఉంది.

హైదరాబాద్‌లో 22 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ. 47,950 ఉండగా.. 24 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ. 52,310గా ఉంది. విజయవాడలో 22 క్యారెట్ల ధర రూ. 47,950.. 24 క్యారెట్ల ధర రూ. 52,310గా నమోదైంది. ఇక విశాఖపట్నంలో 22 క్యారెట్ల ధర రూ.47,950 ఉండగా.. 24 క్యారెట్ల ధర రూ.52,310 వద్ద కొనసాగుతోంది. మరోవైపు హైదరాబాద్‌లో కిలో వెండి ధర రూ.68,000లుగా ఉంది. విజయవాడ, విశాఖపట్నంలో కూడా రూ.68,000లుగా కొనసాగుతోంది. 

Also Read: Horoscope Today June 10 2022: ఈరోజు రాశి ఫలాలు.. ఆ రాశుల వారికి అనుకోని ధనలాభం!

Also Read: Pooja Jhaveri Pics: విజయ్ దేవరకొండ హీరోయిన్ అందాల జాతర.. చూపు తిప్పుకోవడం కష్టమే సుమీ!

 

 

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.

Android Link - https://bit.ly/3hDyh4G

Apple Link - https://apple.co/3loQYe 

మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి TwitterFacebook

Trending News