Horoscope Today June 10 2022: ఈరోజు రాశి ఫలాలు.. ఆ రాశుల వారికి అనుకోని ధనలాభం!

Daily Astrological prediction for June 10 2022. వృషభం, సింహం, కన్య రాశుల వారికి శుభకాలం నడుస్తోంది. ఈ మూడు రాశుల వారికి అనుకోని ధనలాభం ఉంది.   

Written by - ZH Telugu Desk | Last Updated : Jun 10, 2022, 08:12 AM IST
  • June 10 2022 రాశి ఫలాలు
  • ఈ రోజు రాశి ఫలం ఎలా ఉందంటే?
  • ఆ రాశుల వారికి అక‌స్మిక ధ‌న‌ లాభం
Horoscope Today June 10 2022: ఈరోజు రాశి ఫలాలు.. ఆ రాశుల వారికి అనుకోని ధనలాభం!

Daily Astrological Predictions for June 10 2022: మేషం ( Aries): ఆర్థిక పరంగా లాభదాయకంగా ఉంటుంది. పనిలో అదనపు భారం తప్పదు. భవిష్యత్ ప్రణాళికలో స్పష్టత వస్తుంది.  శుభకార్యాలలో పాల్గొంటారు. కుటుంబం మరియు స్నేహితులతో ప్రయాణాలు చేస్తారు. విద్యార్ధులకు కలిసివచ్చే కాలం. శివ నామస్మరణ ఉత్తమం.

వృషభం (Taurus):శ్రమ పెరుగుతుంది. ఆర్థిక భద్రత కోసం చూస్తున్న వారికి మంచి సమయం. వ్యాపారం బాగుంటుంది. అనుకోని ధనలాభం ఉంది. కష్టాన్ని నమ్ముకొని ముందుకు సాగండి. అవగాహనా లోపం లేకుండా చూసుకోవాలి. ప్రయాణాల్లో జాగ్రత్త. అలర్జీతో బాధపడేవారు మరింత జాగ్రత్తగా ఉండాలి. శని ధ్యానం శుభప్రదం.

మిథునం (Gemini): భవిష్యత్ ప్రణాళికలు చేస్తారు. ఆర్థిక ఇబ్బందులు కొందరికి తప్పకపోవచ్చు. కృషికి తగ్గ ఫలితాలు ఉన్నాయి. కీలక వ్యవహారాల్లో కుటుంబ సహకారం అందుతుంది. విహార యాత్రకు వెళతారు. విదేశాలకు వెళ్లాలనుకునే వారికి మంచి సమయం. ఈశ్వర సందర్శనం శుభప్రదం.

కర్కాటకం (Cancer): సకాలంలో తీసుకున్న నిర్ణయం డబ్బు ఆదా చేయడంలో సహాయం చేస్తుంది. బిల్డర్లు మరియు రియల్ ఎస్టేట్ ఏజెంట్లకు శుభకాలం. కీలక విషయాల్లో పురోగతి ఉంటుంది. కుటుంబంతో కాలాన్ని గడుపుతారు. విద్యార్థులు పాఠ్యేతర కార్యక్రమాల్లో మంచి ప్రదర్శన కనబరుస్తూ తమ తల్లిదండ్రులను గర్వపడేలా చేస్తారు. ప్రయాణాల్లో జాగ్రత్తలు అవసరం. ఆంజనేయ ఆరాధన శుభప్రదం.

సింహం (Leo): ఆర్థిక సంక్షోభం త్వరలో సమసిపోతుంది. అనుకోని ధనలాభం ఉంది. ఒక ముఖ్యమైన విషయమై పెద్దలను కలుస్తారు. ఆస్తుల విషయంలో జాగ్రత్తగా ఉండండి. అనవసర ప్రసంగాలతో సమయం వృథా చేయకండి. ప్రయాణాల్లో జాగ్రత్త. ఈశ్వర సందర్శనం మంచిని ఇస్తుంది.

కన్య (Virgo): ధనలాభం ఉంది. మానసిక ప్రశాంతత ఉంటుంది. తలపెట్టిన పనిలో అందరి సహకారం అందుతుంది. జీవిత భాగస్వామితో ఒక విషయం గురించి మాట్లాడటంలో మీరు అయిష్టంగా ఉండవచ్చు. కొత్త వ్యక్తులను కలిసే అవకాశం ఉంది. మీకు ఆందోళన కలిగించే విషయాలు పరిష్కరించబడతాయి. చంద్రశేఖరాష్టకం శుభప్రదం.

తుల (Libra): పెట్టుబడి ఆశించినంత రాబడిని ఇవ్వకపోవచ్చు. ఉద్యోగంలో ఉన్నతాధికారులతో జాగ్రత్తగా ఉండాలి. కుటుంబ సభ్యులు మధ్య విభేదాలు రాకుండా చూసుకోవాలి. స్నేహితులు మరియు శ్రేయోభిలాషులతో ఆనందంగా గడుపుతారు. శివనామాన్ని జపించాలి.

వృశ్చికం (Scorpio): మొదలుపెట్టిన కార్యాలను పూర్తి చేస్తారు. బెట్టింగ్‌ పెట్టేవారికి శుభకాలం. తోటి వారి సహకారాలు అందుతాయి. బంధుమిత్రులతో సంతోషంగా గడుపుతారు. విద్యార్థులు అందరి మన్ననలను పొందుతారు. ఆరోగ్యం విషయంలో ఎలాంటి సమస్యలు లేవు. గణపతి ఆరాధన చేస్తే మంచిది.

ధనస్సు (Sagittarius): ఆర్థిక ఇబ్బందులు తప్పకపోవచ్చు. మీమీ రంగాలలో విజయం సాధించే దిశగా ముందుకు సాగుతారు. వ్యాపార పర్యటన మీకు చాలా లాభదాయకమైన అవకాశాలను తెచ్చే అవకాశం ఉంది. కుటుంబ సభ్యులతో కలిసి మధుర క్షణాలను గడుపుతారు. ప్రయాణాలు చేస్తారు. శ్రీరామనామాన్ని జపించడం ఉత్తమం.

మకరం (Capricorn): మీ శ్రమకు తగ్గ గుర్తింపు వస్తుంది. లాభదాయకమైన వెంచర్ల ద్వారా మీరు మీ బ్యాంక్ బ్యాలెన్స్‌ను పెంచుకోగలరు. ఆర్ధికంగా మంచి ఫలితాలు ఉన్నాయి. మీరు తీసుకునే నిర్ణయాలు ఫలిస్తాయి. ఈ రోజు ఆనందంగా గడుస్తుంది. చిన్నచిన్న ఆరోగ్య సమస్యలను సులభంగా ఎదుర్కొంటారు. ఇష్టదైవారాధన శుభం చేకూరుస్తుంది. 

కుంభం  (Aquarius): ఉత్సాహం తగ్గకుండా పనిచేయాలి. శారీరక శ్రమ తప్పకపోవచ్చు. దగ్గరివారితో జాగ్రత్త. చిన్న చిన్న అంశాలను పెద్దవి చేసుకోవడం సరికాదు. ప్రయాణాలు చేస్తారు. విదేశాలకు వెళ్లాలనుకునే వారికి మంచి సమయం. దుర్గారాధన శుభప్రదం.

మీనం (Pisces): మొదలెట్టిన పనులు విజయవంతంగా పూర్తవుతాయి. గృహ ఖర్చుల పెరుగుదల మిమ్మల్ని ఆందోళనకు గురి చేస్తుంది. బంధుమిత్రుల సహకారం ఉంటుంది. ప్రశాంతతను కోల్పోరాదు. వ్యాపార పర్యటన కొందరికి ఫలిస్తుంది. ప్రయాణాల్లో జాగ్రత్త. నవగ్రహ ఆలయ సందర్శనం శుభప్రదం.

Also Read: JOB News: యవతకు గుడ్‌న్యూస్, టీసీఎస్, ఇన్ఫోసిస్‌లో త్వరలో 90 వేల ఉద్యోగాల భర్తీ

Also Read: Pooja Jhaveri Pics: విజయ్ దేవరకొండ హీరోయిన్ అందాల జాతర.. చూపు తిప్పుకోవడం కష్టమే సుమీ!

 

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.

Android Link - https://bit.ly/3hDyh4G

Apple Link - https://apple.co/3loQYe 

మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి TwitterFacebook

 

Trending News