Gold Price Today 16 November: మహిళలకు శుభవార్త.. భారీగా తగ్గిన బంగారం ధర! పెరిగిన వెండి

Gold Price Today 16 November 2022, Today Gold and Silver Prices In Hyderabad: హైదరాబాద్‌లో 22 క్యారెట్ల పసిడి ధర రూ. 47,800 ఉండగా.. 24 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ. 52,150గా ఉంది.   

Written by - P Sampath Kumar | Last Updated : Nov 16, 2022, 07:02 AM IST
  • భారీగా తగ్గిన బంగారం ధర
  • నేటి బంగారం, వెండి రేట్లు ఇవే
  • హైదరాబాద్‌లో 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ఎంతంటే
Gold Price Today 16 November: మహిళలకు శుభవార్త.. భారీగా తగ్గిన బంగారం ధర! పెరిగిన వెండి

Gold and Silver Price Today 16 November 2022: గత 5-6 రోజులుగా పెరుగుతూ వస్తున్న బంగారం ధరలకు బ్రేకులు పడ్డాయి. బుధవారం (నవంబర్ 16) 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర దేశీయ మార్కెట్లో రూ. 47,800లు ఉండగా.. 24 క్యారెట్ల బంగారం ధర రూ. 52,150లుగా ఉంది. నిన్నటితో పోల్చుకుంటే 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధరపై రూ. 460.. 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధరపై రూ. 490 తగ్గింది. ఈ ధరలు దేశీయ మార్కెట్లో ఈరోజు ఉదయం 6 గంటలకు నమోదైనవి. 

నవంబర్ 8న 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ. 46,800లుగా ఉంది. నవంబర్ 9న రూ. 560 పెరిగి రూ. 47,360లకు చేరింది. నవంబర్ 11, 12న వరుసగా రూ. 440, రూ. 400 పెరిగింది. నవంబర్ 13న 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ. 40 పెరగ్గా.. మరుసటి రోజు స్థిరంగా ఉంది. ఇక నవంబర్ 16న 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధరపై రూ. 460 తగ్గింది. నవంబర్ 8తో పోల్చుకుంటే.. ప్రస్తుతం రూ. 1000 ఎక్కువగా ఉంది. 

# ఢిల్లీలో 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ. 47,950 ఉండగా.. 24 క్యారెట్ల ధర రూ. 52,300గా ఉంది. 
# ముంబైలో 22 క్యారెట్ల 10 గ్రాముల పసిడి ధర రూ. 46,800 ఉండగా.. 24 క్యారెట్ల ధర రూ. 51,150గా నమోదైంది. 
# చెన్నైలో 22 క్యారెట్ల బంగారం ధర రూ. 49,400గా ఉండగా.. 24 క్యారెట్ల ధర రూ. 53,890 వద్ద కొనసాగుతోంది. 
# బెంగళూరులో 22 క్యారెట్ల పసిడి ధర రూ. 47,850గా నమోదవగా.. 24 క్యారెట్ల ధర రూ. 52,200గా ఉంది. 
# కేరళలో 22 క్యారెట్ల బంగారం ధర రూ. 47,800 ఉండగా.. 24 క్యారెట్ల ధర రూ. 52,150గా ఉంది.
# హైదరాబాద్‌లో 22 క్యారెట్ల పసిడి ధర రూ. 47,800 ఉండగా.. 24 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ. 52,150గా ఉంది. 
# విజయవాడలో 22 క్యారెట్ల బంగారం ధర రూ. 47,800.. 24 క్యారెట్ల ధర రూ. 52,150గా నమోదైంది. 
# విశాఖపట్నంలో 22 క్యారెట్ల ధర రూ. 47,800 ఉండగా.. 24 క్యారెట్ల ధర రూ. 52,150 వద్ద కొనసాగుతోంది. 

మరోవైపు బంగారం ధర తగ్గితే.. వెండి ధర మాత్రం పెరిగింది. బుధవారం (నవంబర్ 16) దేశీయంగా కిలో వెండి ధర రూ. 62,700లుగా కొనసాగుతోంది. నిన్నటితో పోల్చుకుంటే కిలో వెండి ధరపై రూ. 1000 పెరిగింది. ఈ ధరలు ఉదయం 6 గంటలకు నమోదైనవి మాత్రమే. ముంబైలో కిలో వెండి ధర రూ. 62,700లుగా ఉండగా.. చెన్నైలో రూ. 68,500లుగా ఉంది. బెంగళూరులో రూ. 68,500గా ఉండగా.. హైదరాబాద్‌లో కిలో వెండి ధర రూ. 68,500లుగా నమోదైంది. విజయవాడ, విశాఖపట్నంలో కూడా కిలో వెండి ధర రూ. 68,500ల వద్ద కొనసాగుతోంది. 

Also Read: MI Retained Players List: ప్రక్షాళనకు శ్రీకారం.. 13 మంది ఆటగాళ్లను వదిలేసిన ముంబై ఇండియన్స్! రిటెన్షన్ జాబితా ఇదే  

Also Read: RCB Retained Players List: ఆర్‌సీబీ రిటెన్షన్ జాబితా ఇదే.. హైదరాబాద్ కమీషనర్ కుమారుడు ఔట్!  

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

ఆండ్రాయిడ్ లింక్ -  https://bit.ly/3P3R74U 

ఆపిల్ లింక్ -  https://apple.co/3loQYe 

మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండిTwitter , Facebook

Trending News