Royal Challengers Bangalore Retained and Released Players List for IPL 2023: ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్) 2023 రిటెన్షన్ ప్రక్రియకు బీసీసీఐ విధించిన గడువు ముగియడంతో.. అన్ని ఫ్రాంచైజీలు అంటిపెట్టుకున్న, రిలీజ్ చేసిన ప్లేయర్ల వివరాలను వెల్లడించాయి. ఈ క్రమంలోనే ఐపీఎల్ 2023 సీజన్ కోసం రాయల్ చాలెంజర్స్ బెంగళూరు (ఆర్‌సీబీ) తమ రిటెన్షన్, రిలీజ్ జాబితాను సోషల్ మీడియా వేదికగా వెల్లడించింది. హైదరాబాద్ కమీషనర్ సీవీ ఆనందర్ కుమారుడు చామ మిలింద్‌ను ఆర్‌సీబీ రిలీజ్ చేసింది.
రాయల్ చాలెంజర్స్ బెంగళూరు ప్రధాన జట్టులో పెద్దగా మార్పులు ఏం చేయలేదు. చాలా మంది ఎక్స్‌ట్రా ప్లేయర్లను మాత్రమే వదిలేసింది. గతేడాది ముంబై ఇండియన్స్ నుంచి ట్రేడింగ్ ద్వారా సొతంచేసుకున్న జాసన్ బెహ్రెండార్ఫ్‌ను మళ్లీ ఎంఐకే ఇచ్చేసింది. విండీస్ ప్లేయర్ షెర్ఫానే రుదర్ ఫోర్డ్‌ను ఆర్‌సీబీ వదిలేసింది. వీరితో పాటుగా హైదరాబాద్ క్రికెటర్ చామ మిలింద్‌ను రిలీజ్ చేసింది. ఐపీఎల్ 2022 సీజన్‌లో ఆర్‌సీబీ మిలింద్‌ను రూ.20 లక్షల కనీస ధరకు కొనుగోలు చేసింది. అయితే అతడు ఒక్క మ్యాచ్‌లో కూడా ఆడలేదు.
దేశవాళీ క్రికెటర్లు అనీశ్వర్ గౌతమ్, లువ్‌నిత్ సిసోడియాలను ఆర్‌సీబీ రిలీజ్ చేసింది. డేవిడ్ విల్లేను బెంగళూరు వదిలేస్తుందని ప్రచారం జరిగినా.. అతనిపై ఫ్రాంచైజీ నమ్మకం ఉంచింది. విరాట్ కోహ్లీ, ఫాఫ్ డుప్లెసిస్, దినేశ్ కార్తీక్, గ్లేన్ మ్యాక్స్‌వెల్, మహమ్మద్ సిరాజ్ లాంటి స్టార్ ఆటగాళ్లను అంటిపెట్టుకుంది. వానిందు హసరంగా, షెహ్‌బాజ్ అహ్మద్, హర్షల్ పటేల్, రజత్ పటీదార్, ఫిన్ అలెన్లపై నమ్మకం ఉంచింది. రిటెన్షన్ ప్రక్రియ ముగిసిన తర్వాత ఆర్‌సీబీ వద్ద రూ.8.75 కోట్లు మిగిలాయి.
ఆర్‌సీబీ రిటైన్ ప్లేయర్స్ లిస్ట్:
ఫాఫ్ డుప్లెసిస్
విరాట్ కోహ్లీ
సుయాష్ ప్రభుదేశాయ్
రజత్ పటీదార్
దినేశ్ కార్తీక్
అనుజ్ రావత్
ఫిన్ అలెన్
గ్లేన్ మ్యాక్స్‌వెల్
వానిందు హసరంగా
షెహ్‌బాజ్ అహ్మద్
హర్షల్ పటేల్
డేవిడ్ విల్లే
కరన్ శర్మ
మహిపాల్ లోమ్రోర్
మహమ్మద్ సిరాజ్
జోష్ హజెల్ వుడ్
సిద్దార్థ్ కౌల్
ఆకాశ్ దీప్
ఆర్‌సీబీ రిలీజ్ ప్లేయర్స్ లిస్ట్:
జాసన్ బెహ్రెన్‌డార్ఫ్
అనీశ్వర్ గౌతమ్
చామ మిలింద్
లువినిత్ సిసోడియా
షెఫ్రానే రూదర్‌ఫోర్డ్
Also Read: Dog Viral Video: తల వంచి మరీ బొజ్జ గణపతిని మొక్కిన శునకం.. వీడియో చూసి వావ్ అనకుండా ఉండలేరు!
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండిTwitter , Facebook