High Mileage Cars: 5 లక్షల కంటే తక్కువ ధరలోనే 30 కంటే ఎక్కువ మైలేజీని ఇచ్చే కార్లు ఇవే..

 High Mileage Cars In India: ప్రస్తుతం మార్కెట్లో బడ్జెట్ ధరల్లో కార్లనుకునేందుకు వినియోగదారులు ఎక్కువగా ఇష్టపడుతున్నారు. ఎందుకంటే బడ్జెట్ ధరల్లో లభించే కార్లన్నీ మైలేజీని అధికంగా ఇస్తాయి. కాబట్టి మైలేజీ అధికంగా ఇచ్చే కార్లనుకునేందుకే ప్రస్తుత వినియోగదారులు మొగ్గు చూపుతున్నారు.

Edited by - ZH Telugu Desk | Last Updated : Dec 29, 2022, 11:26 AM IST
High Mileage Cars: 5 లక్షల కంటే తక్కువ ధరలోనే 30 కంటే ఎక్కువ మైలేజీని ఇచ్చే కార్లు ఇవే..

Dead Cheap High Mileage Cars In India: మార్కెట్లోకి కొత్త కొత్త కార్లు వస్తున్నాయి. ముఖ్యంగా డీజిల్, పెట్రోల్ రేట్స్ విచ్చలవిడిగా పెరుగుతుండడంతో వినియోగదారులంతా అధిక మైలేజ్ ఇచ్చే కార్లనుకునేందుకు ఎక్కువగా మొగ్గు చూపుతున్నారు. వినియోగదారుల అవసరాలను దృష్టిలో పెట్టుకొని దానికి అనుగుణంగా కార్ల కంపెనీలు కార్లను తయారు చేస్తున్నారు. ముఖ్యంగా మిడిల్ క్లాస్ వినియోగదారులను దృష్టిలో పెట్టుకొని వారికి అనుగుణమైన ధరల్లోనే మార్కెట్లో లభించడం విశేషం. బడ్జెట్లో లభించే కార్లన్నీ అధిక మైలేజ్ ని కలిగి ఉంటాయి. అంతేకాకుండా మార్కెట్లో ప్రస్తుతం అధిక మైలేజీ ఉన్న కార్లన్నీ తక్కువ ధరల్లోనే లభిస్తుంది. ఇప్పుడు ఏడు లక్షలు లోపే అధిక మైలేజీని కలిగిన కార్ల గురించి మనం తెలుసుకునే ప్రయత్నం చేద్దాం..

7 లక్షల కంటే తక్కువ ధరలోనే ఎక్కువ మైలేజ్ ఇచ్చే కార్లు:
మారుతి సుజుకి స్విఫ్ట్:

ప్రస్తుతం మార్కెట్లో ఎక్కువగా అమ్ముడుపోతున్న కార్లలో మారుతి సుజుకి స్విఫ్ట్ ఒకటి. ఈ కార్ లో ఎండ్ కార్ ప్రైస్ వచ్చేసి.. 5.91 లక్షలు కాగా, టాప్ ఎండ్ ధర 8.84 లక్షలతో మార్కెట్లో విక్రయిస్తుంది. ఈ కారు 1.2 డ్యూయల్ జెట్ ఇంజన్ సామర్థ్యంతో కలిగి ఉంటుంది. దీంతో మీరు దాదాపు 22 కిలోమీటర్ల నుంచి లీటర్కు 23 కిలోమీటర్ల దాకా మైలేజీ పొందచ్చని నిపుణులు చెబుతున్నారు. అంతేకాకుండా ప్రస్తుతం మార్కెట్లో రిలీజ్ అవుతున్న ఈ కార్లు కొత్త కొత్త సాంకేతిక పరిజ్ఞానంతో అందుబాటులో ఉన్నాయి.

హ్యుండై గ్రాండ్ ఐ10:
ప్రస్తుతం ఈ కారు కూడా మార్కెట్లో తెగ విక్రయిస్తోంది హ్యుండై కంపెనీ. ఇది పాత మోడల్ కంటే పది రెట్ల అప్డేట్ తో ప్రస్తుతం మార్కెట్లో అందుబాటులో ఉంది. కొత్త కొత్త హంగులతో చాలా రంగుల వేరియంట్లతో భారత మార్కెట్లో లభిస్తోంది. ఇక దీని ధర విషయానికొస్తే.. మారుతి సుజుకి స్విఫ్ట్ కంటే చాలా తక్కువకే లభిస్తుంది. దీని లో ఎండ్ ప్రైస్ వచ్చేసి..5.42 లక్షలు కాగా టాప్ ఎండ్ ధర 8.51 లక్షలతో  భారత మార్కెట్లో తెగ అమ్ముడు అవుతోంది. ఫీచర్ల విషయానికొస్తే పాత కార్లలా కాకుండా కొత్త సాంకేతిక పరిజ్ఞానం, ఇంజన్ సామర్థ్యాన్ని పెంచినట్లు తెలుస్తోంది. ఇది కూడా మారుతి సుజికి స్విఫ్ట్ లాగా 1.2 లీటర్ ఇంజన్ ను కలిగి ఉంటుంది. ఇక మైలేజీ విషయానికొస్తే లీటర్కు దాదాపు 20 నుంచి 22 కిలోమీటర్ల దాకా ఇస్తుంది. కాబట్టి దీనిని మిడిల్ క్లాస్ వినియోగదారులు కళ్ళు మూసుకొని కొనుగోలు చేయొచ్చు.

Also Read : Anchor Vindhya Vishaka : ఇన్ని కష్టాలు అనుభవిస్తోందా?.. తండ్రి గురించి తపన.. యాంకర్ వింధ్యా విశాఖ ఎమోషనల్ పోస్ట్

Also Read : Eesha Rebba Saree pics : చిలకపచ్చ కోక పెట్టినాది కేక.. చీరలో ఈషా రెబ్బా అదుర్స్.. పిక్స్ వైరల్

 

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

ఆండ్రాయిడ్ లింక్ -  https://bit.ly/3P3R74U 

ఆపిల్ లింక్ -  https://apple.co/3loQYe 

Twitter , Facebookమా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి

Trending News