LPG, Petrol Prices Today: వామ్మో.. ఎల్పీజీ, పెట్రోల్ ధరల్లో ప్రపంచ దేశాల్లో మనమే టాప్

LPG, Petrol Prices Today: ఉత్పత్తిలో కాదు గానీ...కొనుగోళ్లలో మాత్రం ఇండియాదే అత్యధిక ధర. ఇంధన ధరలు ప్రపంచంలోనే అత్యధికంగా ఉన్నది ఇండియాలో కావడం గమనార్హం. ఎల్పీజీ అయితే ఇక్కడి ధర మరెక్కడా లేదు..ఆ వివరాలు చూద్దాం..

Written by - Md. Abdul Rehaman | Last Updated : Apr 9, 2022, 11:00 AM IST
LPG, Petrol Prices Today: వామ్మో.. ఎల్పీజీ, పెట్రోల్ ధరల్లో ప్రపంచ దేశాల్లో మనమే టాప్

LPG, Petrol Prices Today: ఉత్పత్తిలో కాదు గానీ...కొనుగోళ్లలో మాత్రం ఇండియాదే అత్యధిక ధర. ఇంధన ధరలు ప్రపంచంలోనే అత్యధికంగా ఉన్నది ఇండియాలో కావడం గమనార్హం. ఎల్పీజీ అయితే ఇక్కడి ధర మరెక్కడా లేదు..ఆ వివరాలు చూద్దాం..

ఇండియాలో లీటర్ ఎల్పీజీ గ్యాస్ ధర ప్రపంచంలోనే అత్యధికం. పెట్రోల్ విషయంలో ఇండియాలో ధర ప్రపంచంలో మూడవ స్థానం కాగా..డీజిల్ విషయంలో ప్రపంచంలో 8వ స్థానంలో ఇండియా ఉంది. వివిధ దేశాల్లో ధరలు, వివిధ దేశాల మధ్య భౌతిక పరిస్థితులు ఇంధన ధరల పెరగుదలకు కారణమనే వాదన విన్పిస్తున్నా..మనదేశంలో ఇంకా ఎక్కువగా ఎందుకున్నాయి. ఆయా దేశాల్లో వివిద దేశాల కరెన్సీకు ఉండే కొనుగోలు శక్తిని బట్టి ఇది ఆధారపడి ఉంటోంది. మరోవైపు ఆదాయం కూడా ప్రభావం చూపిస్తుంటుంది. కొన్ని దేశాల్లో ముఖ్యంగా పాశ్చాత్త దేశాల వారికి లీటర్ పెట్రోల్ ధర వారి దినసరి ఆదాయంలో ఓ మూలకు వస్తుంది. అదే ఇండియాలో అయితే చాలామందికి దినసరి ఆదాయంలో పావుభాగం లీటర్ పెట్రోల్‌కే ఖర్చవుతుంది. కొన్ని ప్రాంతాల్లో సరాసరి రోజు ఆదాయం కంటే ఎక్కువే. 

ఈ సంఖ్యల్ని మనం ఎలా నిర్ణయిస్తాం..లీటర్ పెట్రోల్ ధర 120 రూపాయలుంటే..సాధారణ ఎక్స్చేంజ్ ధర ప్రతి డాలర్‌కు 75.84 రూపాయలుగా ఉంటుంది. ఒక డాలర్‌తో అమెరికాలో కంటే ఇండియాలో ఎక్కువగా కొనుగోలు చేయవచ్చు. ఉదాహరణకు కిలో పొటాట అమెరికాలో 1.94 డాలర్లు కాగా ఆ విలువ ఇండియన్ ఎకానమీలో 147 రూపాయలవుతుంది. అంటే ఇక్కడ ఆ డబ్బులతో 7 కిలోల బంగాళదుంపలు కొనవచ్చు. అంతర్జాతీయంగా సరాసరి డాలర్ ధర 22.6 రూపాయలుంది. ఇండియాలో మాత్రం 75.84 రూపాయలుగా ఉంది. అంటే ఐఎంఎఫ్ అంచనాల ప్రకారం ఇండియాలో లీటర్ పెట్రోల్ ధర 5.2 ఇంటర్నేషనల్ డాలర్ పెర్ లీటర్‌తో సమానంగా ఉంది. ఇది ప్రపంచంలో మూడవ స్థానం. తొలిస్థానం 8 ఇంటర్నేషనల్ డాలర్లతో సూడాన్ ఉంటే..5.6 ఇంటర్నేషనల్ డాలర్లతో లావోస్ ఉంది. 

ఇక ఎల్పీజీ గ్యాస్ విషయంలో 54 దేశాల్లో ఇండియా ప్రపంచంలోనే టాప్‌లో ఉంది. ఇక్కడి ఎల్పీజీ లీటర్ ధర 3.5 ఇంటర్నేషనల్ డాలర్ ధరతో సమానంగా ఉంది. ఇండియా తరువాత టర్నీ, ఫిజీ, మోల్దోవా, ఉక్రెయిన్ దేశాలున్నాయి. అదే స్విట్జర్లాండ్, కెనడా, ఫ్రాన్స్, యూకేల్లో ఎల్పీజీ లీటర్ ధర 1 ఇంటర్నేషనల్ డాలర్‌తో సమానంగా ఉంది. 

ఇకే డీజిల్ విషయంలో156 దేశాల సమాచారం అందుబాటులో ఉంది. ఇండియాలో లీటర్ డీజిల్ ధర 4.6 ఇంటర్నేషనల్ డాలర్ కలిగి ప్రపంచంలో 8వ స్థానంలో ఉంది. సూడాన్‌లో 7.7 ఇంటర్నేషనల్ డాలర్లతో అత్యధికంగా ఉంది. ఆ తరువాతి స్థానాల్లో టర్కీ, అల్బేనియా, మయన్మార్, జార్జియా భూటాన్, లావోస్ దేశాలున్నాయి. 

Also read: EPFO New Rules: మారిన ఈపీఎఫ్​ఓ రూల్స్​.. చందాదారులకు తెలుసుకోవాల్సిన విషయాలివే..

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి. 

Android Link - https://bit.ly/3hDyh4G

Apple Link - https://apple.co/3loQYe 

మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook

Trending News