LIC policy holders కి గుడ్ న్యూస్.. LIC IPO లో పాలసీ హోల్డర్స్‌కి 10 % reservation

LIC IPO Date 2021, Good news for LIC policy holders: ఎల్ఐసి పాలసీదారులకు గుడ్ న్యూస్. లైఫ్ ఇన్సూరెన్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియాలో 2022 నాటికి ఇనిషియల్ పబ్లిక్ ఆఫరింగ్ ప్రారంభించనున్నట్టు కేంద్రం ఇటీవల ప్రకటించిన Budget 2021 లో వెల్లడించిన సంగతి తెలిసిందే. ఎల్‌ఐసి ఐపిఓను 2022 ఆర్థిక సంవత్సరంలో ప్రారంభించనున్నట్లు FM Nirmala Sitharaman తన బడ్జెట్ 2021 ప్రసంగంలో ప్రకటించారు.

Last Updated : Feb 4, 2021, 05:59 PM IST
  • ఎల్ఐసి పాలసీదారులకు, LIC agents కి గుడ్ న్యూస్
  • ఎల్‌ఐసి ఐపిఓను 2022 ఆర్థిక సంవత్సరంలో ప్రారంభించనున్నట్లు ప్రకటించిన కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్.
  • LIC policy holders కు ఐపీఓలో 10 శాతం రిజర్వేషన్
  • ప్రస్తుతం దేశంలో 4.5 కోట్లకు పైగా Demat account holders.
LIC policy holders కి గుడ్ న్యూస్.. LIC IPO లో పాలసీ హోల్డర్స్‌కి 10 % reservation

LIC IPO Date 2021, Good news for LIC policy holders: ఎల్ఐసి పాలసీదారులకు గుడ్ న్యూస్. లైఫ్ ఇన్సూరెన్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియాలో 2022 నాటికి ఇనిషియల్ పబ్లిక్ ఆఫరింగ్ ప్రారంభించనున్నట్టు కేంద్రం ఇటీవల ప్రకటించిన బడ్జెట్ 2021లో వెల్లడించిన సంగతి తెలిసిందే. తాజాగా అందుతున్న అప్‌డేట్స్ ప్రకారం పబ్లిక్ ఇష్యూలో ఎల్ఐసి పాలసీదారులకు 10 % వాటాను ప్రభుత్వం కేటాయించే అవకాశం ఉందని తెలుస్తోంది. 

ఎల్‌ఐసి ఐపిఓను 2022 ఆర్థిక సంవత్సరంలో ప్రారంభించనున్నట్లు ఆర్థిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్ తన బడ్జెట్ 2021 ప్రసంగంలో ప్రకటించారు. ఎల్‌ఐసి పాలసీదారులకు ఎల్ఐసి ఐపిఓలో 10 శాతం రిజర్వేషన్ ఉంటుందని డిపార్ట్‌మెంట్ ఆఫ్ ఇన్వెస్ట్‌మెంట్ అండ్ పబ్లిక్ అసెట్ మేనేజ్‌మెంట్ (డిపామ్) సూచించిందని సమాచారం. ప్రస్తుతం ఎల్‌ఐసి 25 కోట్ల మంది పాలసీదారులు ఉన్నారు.

Also read : Smartphones, ACs, TVs, Fridges వంటి హోమ్ అప్లయన్సెస్ ధరలపై Budget 2021 ప్రభావం ఎలా ఉండనుంది ?

ప్రస్తుతం దేశంలో 4.5 కోట్లకు పైగా Demat account holders ఉన్నారు. ఎల్ఐసి పాలసీదారులకు ఐపీఓలో రిజర్వేషన్ కారణంగా ఐపిఓ ప్రారంభించేనాటికి 1 కోటికి పైగా మంది కొత్తగా డిమాట్ ఎకౌంట్స్ తెరుచుకునే అవకాశం ఉందని మార్కెట్ వర్గాలు విశ్లేషిస్తున్నాయి. CDSL కు, దాని హోల్డింగ్ కంపెనీ అయిన BSE కి ఇది బిగ్ న్యూస్ అవుతుందని మార్గెట్ వర్గాలు చెబుతున్నాయి. LIC policy agents కూడా ఇదే విషయాన్ని తమ కస్టమర్స్‌కి వివరించి మరింత Business చేసుకునేందుకు సిద్ధం అవుతున్నారు. LIC తీసుకున్న ఈ నిర్ణయం కారణంగా LIC customers సంఖ్య కూడా పెరిగే అవకాశం ఉంది.

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు..  క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3hDyh4G

Apple Link - https://apple.co/3loQYe 

మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook

Trending News