DA Hike News: రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులకు గుడ్ న్యూస్ చెప్పిన సర్కారు.. 4 శాతం డిఏ పెంపు.. బకాయిలతో సహా చెల్లింపు

DA Hike News: ప్రస్తుతం అనేక రాష్ట్ర ప్రభుత్వాలు తమ రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులకు డియర్ నెస్ అలవెన్స్ పెంచుతూ వారికి గుడ్ న్యూస్ వినిపిస్తున్నాయి. దీంతో ఇతర రాష్ట్రాలకు చెందిన ప్రభుత్వ ఉద్యోగుల చూపు కూడా తమ ప్రభుత్వం ఎప్పుడు తమ డిఏ పెంపుపై ప్రకటన చేస్తుందా అని ఆశగా ఎదురుచూస్తున్నారు. 

Written by - Pavan | Last Updated : Jul 15, 2023, 08:29 AM IST
DA Hike News: రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులకు గుడ్ న్యూస్ చెప్పిన సర్కారు.. 4 శాతం డిఏ పెంపు.. బకాయిలతో సహా చెల్లింపు

DA Hike News, 7Th Pay Commission News: ప్రస్తుతం అనేక రాష్ట్ర ప్రభుత్వాలు తమ రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులకు డియర్ నెస్ అలవెన్స్ పెంచుతూ వారికి గుడ్ న్యూస్ వినిపిస్తున్నాయి. దీంతో ఇతర రాష్ట్రాలకు చెందిన ప్రభుత్వ ఉద్యోగుల చూపు కూడా తమ ప్రభుత్వం ఎప్పుడు తమ డిఏ పెంపుపై ప్రకటన చేస్తుందా అని ఆశగా ఎదురుచూస్తున్నారు. ప్రభుత్వ ఉద్యోగులు అలా వేచిచూస్తున్న రాష్ట్రాల్లో మధ్యప్రదేశ్‌ కూడా ఒకటి. పైగా త్వరలోనే ఆ రాష్ట్రంలో కూడా ఎన్నికలు జరగనున్న నేపథ్యంలో తమకు గుడ్ న్యూస్ వస్తుందని మధ్యప్రదేశ్ రాష్ర్ట ప్రభుత్వ ఉద్యోగులు భావిస్తున్నారు.

మొత్తానికి ఉద్యోగులు ఆశిస్తున్నట్టుగానే మధ్యప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం తాజాగా అక్కడి ఉద్యోగులకు గుడ్ న్యూస్ చెప్పింది. కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు అనుగుణంగానే మధ్యప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం కూడా 4 శాతం డియర్‌నెస్ అలవెన్స్ పెంచుతుందని శుక్రవారం మధ్యప్రదేశ్ ముఖ్యమంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్ ప్రకటించారు. ఈ డిఏ పెంపుతో వారి డిఏ 42 శాతానికి చేరింది. డిఎ పెంపు జనవరి 1 నుండే అమలులోకి వస్తుంది అని సీఎం శివరాజ్ సింగ్ చౌహన్ స్పష్టంచేశారు. 

మధ్యప్రదేశ్ సీఎం శివరాజ్ సింగ్ చౌహన్ చేసిన ప్రకటన ప్రకారం ఆ రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులు డియర్‌నెస్ అలవెన్స్ బకాయిలను కూడా అందుకోనున్నారు. మధ్యప్రదేశ్‌లోని 7 లక్షల మంది ప్రభుత్వ ఉద్యోగులకు డిఏ పెంపు లబ్ధి చేకూరుతుంది అని రాష్ట్ర ప్రభుత్వం వెల్లడించింది. ఈ మేరకు సీఎం శివరాజ్ సింగ్ చౌహన్ ఒక ట్వీట్ చేశారు. "ఉద్యోగుల ప్రయోజనాల కోసం తమ ప్రభుత్వం ఎన్నో విప్లవాత్మక చర్యలు తీసుకుందని.. అందులో భాగంగానే తాజాగా ప్రభుత్వ ఉద్యోగులకు డిఏ 4 శాతం పెంచి మొత్తం 42 శాతం డిఎ ఇవ్వాలని నిర్ణయించుకున్నామని తన ట్వీట్ లో పేర్కొన్నారు.

ఇది కూడా చదవండి : Unemployment Allowance: ఆ రాష్ట్రంలో నిరుద్యోగులకు గుడ్‌న్యూస్.. నెలకు రూ.2500

తమ ప్రభుత్వం ఎప్పుడూ ఎంప్లాయీస్ ఫ్రెండ్లీ గవర్నమెంట్ గానే వ్యవహరిస్తోంది అని పేర్కొన్న సీఎం శివరాజ్ సింగ్ చౌహన్.. ప్రభుత్వ ఉద్యోగుల ప్రయోజనాల కోసం ఎన్నో విప్లవాత్మక మార్పులు తీసుకొచ్చాం అని స్పష్టంచేశారు. తాను ఉద్యోగులకు మాట ఇచ్చానని.. ఇచ్చిన ఆ మాట ప్రకారమే తాజాగా ఈ నిర్ణయం తీసుకోవడం జరిగింది అని శివరాజ్ సింగ్ చౌహన్ తెలిపారు.

ఇది కూడా చదవండి : Good news: ఆ రాష్ట్ర మహిళా ఉద్యోగులకు గుడ్ న్యూస్.. సంవత్సరానికి 7 అదనపు సెలవులు..!

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

ఆండ్రాయిడ్ లింక్ -  https://bit.ly/3P3R74U 

ఆపిల్ లింక్ -  https://apple.co/3loQYe 

మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండిTwitter , FacebooK

Trending News