Multibagger Stocks: దీపావళికి బంపర్ ఆఫర్, నెలరోజుల్లో రెట్టింపైన షేర్ ధర

Multibagger Stocks: షేర్ మార్కెట్‌లో మరోసారి ఊహించని పరిణామం ఎదురైంది. గత కొద్దిరోజుల్లోనే ఆ కంపెనీ షేర్ రెట్టింపు ధర పలికింది. మల్టీబ్యాగర్ స్టాక్స్ మరోసారి ఇన్వెస్టర్లకు అద్భుత లాభాలు తెచ్చిపెట్టింది. 

Written by - Md. Abdul Rehaman | Last Updated : Oct 15, 2022, 11:58 PM IST
Multibagger Stocks: దీపావళికి బంపర్ ఆఫర్, నెలరోజుల్లో రెట్టింపైన షేర్ ధర

షేర్ మార్కెట్‌లో ఎప్పుడు ఏమౌతుందనేది తెలుసుకునేందుకు పరిశీలన చాలా అవసరం. కొన్ని కిటుకులు తెలుసుకుంటే అద్భుతమైన రిటర్న్స్ సంపాదించవచ్చు. ఓ కంపెనీ షేర్ మాత్రం అనూహ్యంగా లాభాలు తెచ్చిపెడుతోంది. ఆ కంపెనీ షేర్ వివరాలు మీ కోసం..

షేర్ మార్కెట్‌లో కొన్ని కంపెనీల షేర్లు అమాంతం పెరుగుతుంటాయి. తక్కువ కాలంలోనే ఎక్కువ లాభాలు తెచ్చిపెడుతుంటాయి. ఇన్వెస్టర్లను లక్షాదికారులుగా, కోటీశ్వరులుగా చేసే ఈ షేర్లను మల్టీబ్యాగర్ స్టాక్స్ అంటారు. దీపావళికి ముందే కొన్ని షేర్లు ఇన్వెస్టర్లకు భారీ లాభాలు ఆర్జింపజేస్తోంది. కేవలం ఒక నెల వ్యవధిలోనే ఆ కంపెనీ షేర్ రెట్టింపు అయింది. 

Poojawestern Metaliks Ltd కంపెనీ షేర్ ఇది. ఈ షేర్ ఇటీవల వేగంగా పెరిగింది. కేవలం నెల రోజుల వ్యవధిలో రెట్టింపు అయింది. ఇప్పుడు కూడా ఈ షేర్ వేగంగా పెరుగుతోంది. కేవలం నెల రోజుల వ్యవధిలోనే అద్భుతమైన వృద్ధి కన్పిస్తోంది. ఈ కంపెనీ షేర్ 2022 సెప్టెంబర్ 16న 28.35 రూపాయలకు క్లోజ్ అయింది. ఆ తరువాత వరుసగా పెరుగుతోంది. అక్టోబర్ 14 నాటికి ఈ షేర్ విలువ 59.35 రూపాయలైంది. అంటే కేవలం నెలరోజుల్లోనే షేర్ ధర డబుల్ అయింది.

Poojawestern Metaliks Ltd షేర్ 52 వారాల గరిష్ట ధర 86.70 రూపాయలుంది. ఇదే ఆల్ టైమ్ గరిష్ట ధర కూడా. ఈ షేర్ 52 వారాల కనిష్ట ధర 22.30 రూపాయలు. ఈ కంపెనీ ఇత్తడి, రాగి మిశ్రమ లోహం, క్రోమ్ పైప్ ఫిటింగ్, ఇత్తడి వస్తువులు, ఇత్తడి ఫిటింగ్ వంటివి ఉత్పత్తి చేస్తుంది. 

Also read: Free OTT Platforms: నెట్‌ఫ్లిక్స్, అమెజాన్, డిస్నీ ప్లస్ హాట్‌స్టార్ ఏడాది ఉచితంగా కావాలా

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.    

Android Link - https://play.google.com/store/apps/details?id=com.indiadotcom.zeetelugu  

Apple Link - https://apps.apple.com/in/app/zee-telugu-news/id1633190712

మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook

Trending News