SBI Interest Rates: ఫిక్స్డ్ డిపాజిట్లపై వడ్డీ భారీగా పెంచిన ఎస్బీఐ, కొత్త వడ్డీ రేట్లు ఇలా

SBI Interest Rates: ఎస్బీఐలో ఫిక్స్డ్ డిపాజిటర్లకు గుడ్‌న్యూస్. బ్యాంక్ ఇప్పుడు వడ్డీ రేట్లను పెంచుతూ నిర్ణయం తీసుకుంది. 2 కోట్ల కంటే తక్కువున్న డిపాజిట్లపై కొత్త వడ్డీరేట్లు ఇలా ఉండనున్నాయి..

Written by - Md. Abdul Rehaman | Last Updated : Oct 15, 2022, 08:44 PM IST
SBI Interest Rates: ఫిక్స్డ్ డిపాజిట్లపై వడ్డీ భారీగా పెంచిన ఎస్బీఐ, కొత్త వడ్డీ రేట్లు ఇలా

ఎస్బీఐ కస్టమర్లకు శుభవార్త అందించింది. ఫిక్స్డ్ డిపాజిట్లపై వడ్డీ రేట్లను స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా పెంచింది. ఎస్బీఐ కస్టమర్లు ఇక పెరిగిన వడ్డీ రేట్ల ప్రయోజనం పొందనున్నారు. సాధారణ వడ్డీకు అదనంగా సీనియర్లు వడ్డీ పొందనున్నారు. 

దేశంలో అతిపెద్ద బ్యాంకింగ్ సంస్థ స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఫిక్స్డ్ డిపాజిట్లపై వడ్డీరేటును పెంచుతున్నట్టు ప్రకటించింది. 2 కోట్ల కంటే తక్కువ ఉన్న డిపాజిట్లపై వడ్డీను 20 బేసిస్ పాయింట్లు పెంచింది. కొత్త వడ్డీరేట్లు అక్టోబర్ 15, 2022 నుంచి అందుబాటులో రానున్నాయి. అన్ని రకాల ఫిక్స్డ్ డిపాజిట్లపై వడ్డీ పెంచడంతో కస్టమర్లకు 3 శాతం నుంచి 5.85 శాతం వరకూ ప్రయోజనం కలగనుంది. మరోవైపు సీనియర్ సిటిజన్లు సాధారణ వడ్డీకు అదనంగా మరికొంత వడ్డీ పొందనున్నారు. 

2 కోట్ల కంటే తక్కువ డిపాజిట్లపై ఎస్బీఐ వడ్డీరేట్లు ఇలా

ఫిక్స్డ్ డిపాజిట్ కాల పరిమితి 7 రోజుల్నించి 45 రోజుల వరకూ ఉన్నవాటిపై ఎస్బీఐ 3శాతం వడ్డీరేటు, సీనియర్ సిటిజన్లకు 3.5 శాతం వడ్డీని అందించనుంది. 46 రోజుల్నించి 179 రోజులవరకూ ఉన్న డిపాజిట్లపై వడ్డీను 4 శాతం సాధారణ కస్టమర్లకు, 4.5 శాతం సీనియర్ సిటిజన్లకు అందిస్తోంది. ఇక 180 రోజుల్నించి 210 రోజుల వరకూ ఉంటే..సాధారణ పౌరులకు 4.65 సాతం కాగా సీనియర్ సిటిజన్లకు 5.15 శాతం వడ్డీ అందించనుంది. 

ఇక మూడేళ్ల నుంచి ఐదేళ్ల కాల పరిమితి ఉన్న ఫిక్స్డ్ డిపాజిట్లపై సాధారణ పౌరులకు 5.60 శాతం వడ్డీని, సీనియర్ సిటిజన్లకు 5.80 శాతం వడ్డీని అందిస్తూ వచ్చింది. ఇక కొత్త వడ్డీరేట్ల ప్రకారం సాధారణ పౌరులకు 6.10 శాతం, సీనియర్ సిటిజన్లకు 6.30 శాతం వడ్డీ అందించనుంది. మరోవైపు ఐదేళ్ల పైబడి కాల పరిమితి ఉన్న డిపాజిట్లపై సాధారణ పౌరులకు ఇప్పటి వరకూ 5.85 శాతం వడ్డీ ఇస్తుండగా ఇక నుంచి 6.45 శాతం వడ్డీ అందించనుంది. అటు సీనియర్ సిటిజన్లకు 5.85 శాతం స్థానంలో 6.65 శాతం ఇవ్వనుంది. 

Also read: Flipkart Sale: స్మార్ట్‌ఫోన్లపై భారీ డిస్కౌంట్లు, ఫ్లిప్‌కార్ట్ సేల్ రేపే ఆఖరు, అదనపు డిస్కౌంట్లు

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.    

Android Link - https://play.google.com/store/apps/details?id=com.indiadotcom.zeetelugu  

Apple Link - https://apps.apple.com/in/app/zee-telugu-news/id1633190712

మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook

Trending News