Multibagger stocks: పదేళ్లలో 1 లక్ష రూపాయలు 35 కోట్లుగా మారడం ఎప్పుడైనా విన్నారా

Multibagger stocks: స్టాక్ మార్కెట్‌లో పెట్టుబడి పెట్టేందుకు ఆలోచిస్తుంటే ముందు ఈ కంపెనీ గురించి తెలుసుకోవల్సిందే. ఎందుకంటే పదేళ్ల కాలంలో 1 లక్ష రూపాయల్ని 35 కోట్లుగా మార్చేసింది.  

Written by - Md. Abdul Rehaman | Last Updated : Jan 1, 2023, 05:16 PM IST
Multibagger stocks: పదేళ్లలో 1 లక్ష రూపాయలు 35 కోట్లుగా మారడం ఎప్పుడైనా విన్నారా

షేర్ మార్కెట్‌లో ఎప్పుడు ఏం జరుగుతుందో తెలియదు. కొన్ని దీర్ఘకాలంలో లాభాలు ఆర్జిస్తే..మరికొన్ని షార్ట్ టైమ్‌లోనే రిటర్న్స్ ఇస్తుంటాయి. అలాంటిదే ఓ కంపెనీ షేర్ పదేళ్లలో విపరీతమైన లాభాల్ని ఇచ్చింది. ఆ వివరాలు మీ కోసం.

హెక్సాట్రానిక్ గ్రూప్ ఏబి షేర్ మార్కెట్‌లో సంచలనం రేపేసింది. ఈ కంపెనీ కేవలం 10 ఏళ్లలో ఇన్వెస్టర్లకు 35 వేల శాతం రిటర్న్స్ అందించింది. సులభంగా అర్ధం కావాలంటే ఓ లెక్క ఉంది. 2012లో ఈ కంపెనీలో 1 లక్ష రూపాయలు పెట్టుబడి పెట్టి ఇవాళ్టి వరకూ ఆ షేర్ కొనసాగిస్తుంటే..ఇప్పుడు మీరు 35 కోట్లకు అధిపతి అయినట్టే. బ్లూమ్‌బర్గ్ నివేదిక ప్రకారం హెక్సాట్రానిక్స్ ఇప్పుడు అత్యంత విలువైన కంపెనీల్లో ఒకటిగా ఉంది. 

యూరోప్ మార్కెట్‌లో రాణించేందుకు ఇన్వెస్టర్లు చాలా కష్టపడాల్సి వచ్చింది. ఎందుకంటే అక్కడ నెట్‌ఫ్లిక్స్, తెస్లా, మైక్రోసాఫ్ట్ వంటి దిగ్గజ కంపెనీలున్నాయి. ఈ కంపెనీల మార్కెట్ కేవలం పదేళ్లలో 10 రెట్లు పెరిగింది. ఈ విషయంలో యూరోప్, అమెరికా కంటే వెనుక లేదు. అక్కడ 71 కంపెనీలు గత 10 ఏళ్లలో ఆ ఘనత సాధించాయి. అంటే యూరోప్ మార్కెట్‌లో లాభాలు ఆర్జించేందుకు అవకాశాలు ఎక్కువే ఉన్నాయి. అయితే ఎందులో ఎప్పుడు పెట్టుబడి పెట్టాలనేది తెలిసుండాలి. 

సెమీకండక్టర్ ఇండస్ట్రీలకు లిథీగ్రోఫీ టెక్నాలజీ అందించే ఏఎస్ఎమ్ఎల్ హోల్డింగ్ ఎన్‌వి ఇటీవల రికార్డ్ సృష్టించింది. ఈ కంపెనీ విలువ 10 రెట్లు పెరిగి 100 బిలియన్లకు చేరుకుంది. బర్న్‌స్టైన్ రీసెర్చ్ ఎలాలసిస్ ప్రకారం ఇంత తక్కువ సమయంలో 10 రెట్లు పెరిగిన ఈ కంపెనీ రెవిన్యూ, లాభం ఇంకా వేగంగా పెరుగుతూనే ఉంది. 

Also read:  Gas Cylinder Price: న్యూ ఇయర్ తొలి రోజే షాక్.. మళ్లీ పెరిగిన గ్యాస్ ధరలు

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.     

Android Link - https://play.google.com/store/apps/details?id=com.indiadotcom.zeetelugu     

Apple Link - https://apps.apple.com/in/app/zee-telugu-news/id1633190712

మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook

Trending News