LPG Price Today: కొత్త సంవత్సరం తొలిరోజే పెద్ద షాక్ తగిలింది. నేటి నుంచి గ్యాస్ సిలిండర్ల ధరలు మళ్లీ పెరిగాయి. ఈ ఏడాది మొదటి రోజే ఎల్పీజీ సిలిండర్ ధరలను ఆయిల్ కంపెనీలు పెంచాయి. ఢిల్లీ 19 కేజీల వాణిజ్య సిలిండర్ ధర 25 రూపాయలు పెరగ్గా.. ఈ పెంపు ముంబై, హైదరాబాద్, బెంగుళూరు సహా అన్ని నగరాల్లో ఉండనుంది.
జనవరి 1, 2023 నుంచి వాణిజ్య సిలిండర్ల ధరలు పెరిగాయి. అయితే గృహ గ్యాస్ సిలిండర్ల ధరలు అలాగే ఉంచడం సామాన్యులకు ఊరటగా చెప్పవచ్చు. ఇక నుంచి కమర్షియల్ సిలిండర్ల కోసం రూ.25 అదనంగా ఖర్చు చేయనున్నారు.
వాణిజ్య సిలిండర్ ధరలు ఇలా..
>> ఢిల్లీ- 1769
>> ముంబై- 1721
>> కోల్‌కతా- 1870
>> చెన్నై- 1917
>> హైదరాబాద్- 1973
డొమెస్టిక్ సిలిండర్ ధరలు
>> ఢిల్లీ - 1053
>> ముంబై - 1052.5
>> కోల్‌కతా - 1079
>> చెన్నై - 1068.5
>> హైదరాబాద్- 1105
డొమెస్టిక్ సిలిండర్ ధరలు ధరలు స్థిరంగా కొనసాగుతున్నాయి. చివరగా జులై 6న 50 రూపాయలు పెంచగా.. అప్పటి నుంచి ధరల్లో ఎలాంటి మార్పు లేదు. మొత్తంగా గతేడాది కాలంలో గృహావసర గ్యాస్ సిలిండర్ల ధరలు రూ.153.5 పెరిగాయి.
వాణిజ్య సిలిండర్ల ధరల పెంపు నేరుగా సామాన్యులపై పడకపోయినా.. అంతిమంగా జేబులకు మాత్రం చిల్లు పడనుంది. హోటళ్లు, రెస్టారెంట్లు, టిఫిన్ సెంటర్లు, బేకరీలు వంటి వాటిల్లో వాణిజ్య సిలిండర్లను ఉపయోగిస్తారు. తాజాగా ధరలు పెరగడంతో తమ ఉత్పత్తుల ధరలు పెంచే అవకాశం ఉంది. దీంతో పెంచిన ధలర భారం సామాన్యులపై పడనుంది.
Also Read: IND Vs SL: కొత్త ఏడాదిలో లంకేయులతో తొలి సమరం.. టీమిండియా తుది జట్టు ఇదే..
Also Read: 7th Pay Commission: కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు న్యూ ఇయర్ గిఫ్ట్.. డీఏ పెంపుపై క్లారిటీ..!
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
Twitter, Facebookమా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి