Mutual Fund Tips: మ్యూచువల్‌ ఫండ్స్‌లో ఇన్వెస్ట్ చేశారా..? ఈ తప్పులు అస్సలు చేయకండి

Mutual Fund Investment Mistakes: మ్యూచువల్ ఫండ్స్‌లో పెట్టుబడి పెడుతున్న వారు తప్పక ఒన్ని విషయాలను గుర్తు పెట్టుకోవాలి. అందరూ కామన్‌గా చేసే కొన్ని తప్పులను మీరూ చేయకండి. ఈ తప్పులను చేయకుండా.. మంచి ఆదాయాన్ని పొందండి.  

Written by - ZH Telugu Desk | Last Updated : Jul 28, 2023, 08:54 PM IST
Mutual Fund Tips: మ్యూచువల్‌ ఫండ్స్‌లో ఇన్వెస్ట్ చేశారా..? ఈ తప్పులు అస్సలు చేయకండి

Mutual Fund Investment Mistakes: ప్రస్తుతం ఎక్కువ మంది మ్యూచువల్ ఫండ్స్‌లో ఇన్వెస్ట్ చేసేందుకు ఆసక్తి చూపుతున్నారు. దీర్ఘకాలికంగా పెట్టుబడి పెట్టి.. డబ్బు సంపాదించడానికి మ్యూచువల్ ఫండ్స్‌ మంచి ఆప్షన్‌. అయితే ఇందులో ఇన్వెస్ట్ చేసే వారు తరుచుగా కొన్ని సాధారణ తప్పులు చేస్తారు. ఈ తప్పుల గురించి మీరు తప్పకుండా తెలుసుకోండి. సరైన నిర్ణయాలు తీసుకోని.. దీర్ఘకాలంలో మీ పెట్టుబడిపై అధిక డబ్బును సంపాదించుకోండి. ఈ సాధారణ తప్పులను సరిదిద్దకుని.. మీరు విజయవంతమైన మ్యూచువల్ ఫండ్ పెట్టుబడిదారుగా మారవచ్చు. పూర్తి వివరాలు ఇలా..

ఫండ్ లక్ష్యాన్ని మర్చిపోవడం..

మ్యూచువల్ ఫండ్స్‌లో ముందుగా ఒక లక్ష్యం అనుకుని ఇన్వెస్ట్ చేయాలి. కానీ కొందరు ఇన్వెస్టర్లు ఏ లక్ష్యం లేకుండా పెట్టుబడి పెడతారు. ప్రతి ఫండ్‌కు మూలధన ప్రశంసలు, ఆదాయ సృష్టి లేదా సమతుల్య దృక్పథం వంటి నిర్దిష్ట లక్ష్యాలు ఉంటాయి. ఎందుకు ఇన్వెస్ట్ చేస్తున్నామో తెలుసుకోకుండా.. మీ ఆర్థిక లక్ష్యాలు, రిస్క్ ఎపిటీట్‌తో సరిపడని తప్పుడు పెట్టుబడికి దారి తీసే అవకాశం ఉంటుందని నిపుణులు హెచ్చరిస్తున్నారు. 

ట్రాక్‌ రికార్డు మాత్రమే కాకుండా..

గతంలో మంచి ఆదాయం పొందిన మ్యూచువల్ ఫండ్స్‌ వైపు చాలా మంది ఆకర్షితులవుతుంటారు. ఫండ్స్‌ ట్రాక్ రికార్డ్‌ బట్టి మ్యూచువల్ ఫండ్స్ ఎంచుకోవడం సహజం. అయితే కేవలం ట్రాక్‌ రికార్డు మాత్రమే కాకుండా.. మార్కెట్ పరిస్థితులను కూడా గమనించాలి. అదేవిధంగా ఫండ్ స్థిరత్వం, ఇన్వెస్ట్‌మెంట్ లక్ష్యానికి కట్టుబడి ఉండటంపై దృష్టి పెట్టండి. మ్యూచువల్ ఫండ్స్ దీర్ఘకాలిక పెట్టుబడి కోసం నిర్దేశించినవి. తరచుగా అమ్మడం.. కొనడం వలన అధిక లావాదేవీ ఖర్చులు, ట్యాక్స్‌లు చెల్లించాల్సి ఉంటుంది. ఇది మీ నికర రాబడిని తగ్గిస్తుంది. అలాగే స్వల్పకాలిక మార్పులను కచ్చితంగా అంచనా వేయడం కొంచెం ఛాలెంజింగ్‌గా ఉంటుంది. 

ఛార్జీలు, ఖర్చులను విస్మరించడం

మ్యూచువల్ ఫండ్స్‌లో ఇన్వెస్ట్ చేసే వారు నిర్వహణ ఛార్జీలు, అడ్మినిస్ట్రేటివ్ ఖర్చులను గుర్తు పెట్టుకోవాలి. దీర్ఘకాలిక పెట్టుబడులపై ఈ ఛార్జీలు ప్రభావం చూపుతాయి. వీటిని విస్మరింకండి. చాలా తక్కువ కదా నిర్లక్ష్యం చేస్తే.. ఎక్కువ మొత్తంలోనే కట్ అవుతాయి. అదేవిధంగా ఒక రంగంలో పెట్టుబడి పెట్టడం కూడా రిస్క్‌గానే చెప్పవచ్చు. విభిన్న రంగాల్లో ఇన్వెస్ట్ చేస్తే.. రిస్క్ కాస్త తక్కువగా ఉంటుంది. 

మ్యూచువల్ ఫండ్స్‌లో ఇన్వెస్ట్ చేసిన వారు పోర్ట్‌ఫోలియోను క్రమం తప్పకుండా సమీక్షించాలి. మారుతున్న ఆర్థిక పరిస్థితులు, రిస్క్ టాలరెన్స్‌కు అనుగుణంగా ఉన్నాయో లేదో నిర్ధారించుకోవాలి. అదేవిధంగా రీబ్యాలెన్స్ చేయడంలో నిర్లక్ష్యాన్ని నివారించవచ్చు. పెట్టుబడిదారులకు ఓవర్ కాన్ఫిడెన్స్‌తో కూడా ఉండకూడదు. ఒక్కోసారి ఎక్కువ రిస్క్ భారీ నష్టాన్ని మిగులుస్తుంది. మ్యూచువల్ ఫండ్స్‌లో అధిక లాభాలు రావాలంటే.. సహనం, దీర్ఘకాలింగా దృష్టి ఉండాలి. ఫండ్స్‌లో తరచుగా ఇన్‌ అవుట్ చేయడం వల్ల కాంపౌండ్ రిటర్న్‌ల నుంచి ప్రయోజనం కలగకపోవచ్చని నిపుణులు చెబుతున్నారు.

Also Read: YS Sharmila: కల్లబొల్లి మాటలు చెప్పడం.. జనాన్ని ముంచడమే పిట్టల దొర పాలన: వైఎస్ షర్మిల   

Also Read: CM Jagan: ప్రతి కుటుంబానికి రూ.2 వేలు అందజేయండి.. సీఎం జగన్ ఆదేశం  

 

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U

ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 

TwitterFacebook సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి

Trending News