YS Sharmila: కల్లబొల్లి మాటలు చెప్పడం.. జనాన్ని ముంచడమే పిట్టల దొర పాలన: వైఎస్ షర్మిల

YS Sharmila Slams CM KCR: వర్షాలు, వరదలతో రాష్ట్రంలో ప్రజలు ఇబ్బందులు పడుతున్నా.. సీఎం కేసీఆర్ పట్టించుకోవట్లేదని వైఎస్ షర్మిల అన్నారు. వర్షాలు తగ్గిపోయిన తరువాత వచ్చి హెలికాఫ్టర్‌లో చక్కర్లు కొట్టి.. ఇంటికి పది వేలు, పంటకు పదివేలు అనే ప్రకటనలు ఇస్తాడని జోస్యం చెప్పారు.  

Written by - ZH Telugu Desk | Last Updated : Jul 28, 2023, 05:08 PM IST
YS Sharmila: కల్లబొల్లి మాటలు చెప్పడం.. జనాన్ని ముంచడమే పిట్టల దొర పాలన: వైఎస్ షర్మిల

YS Sharmila Slams CM KCR: సీఎం కేసీఆర్‌పై తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు వైఎస్సార్టీపీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల. ఊర్లు మునిగినా.. ఇండ్లు కూలినా.. జనం వరదల్లో పడి కొట్టుకుపోతున్నా.. దొర గడీ దాటి బయటకు రాడు.. జనాన్ని ఆదుకోడని విమర్శించారు. వానలు వెలిశాక చుట్టం చూపుగా గాలి మోటార్లో చక్కర్లు కొడతాడని ఎద్దేవా చేశారు. ఆదుకుంటామని గప్పాలు కొడతాడని.. ఇంటికి పది వేలు, పంటకు పదివేలు అనే ప్రకటనలు ఇస్తాడని అన్నారు. ఆ తరువాత వెంటనే ఫామ్ హౌజ్ కొచ్చి మొద్దు నిద్ర పోతాడని సెటైర్లు వేశారు. తొమ్మిదేళ్లుగా భారీ వర్షాలకు, అకాల వర్షాలకు, వేల కోట్ల పరిహారం అంటూ చెప్పుడే తప్పా రూపాయి ఇచ్చింది లేదంటూ ఆరోపణలు గుప్పించారు.

కనీసం వరదల్లో కొట్టుకుపోయిన వారి కుటుంబాలను ఆదుకున్నదీ లేదని ఫైర్ అయ్యారు. ఓట్ల కోసం డల్లాస్, ఇస్తాంబుల్, లండన్ అంటూ కల్లబొల్లి మాటలు చెప్పడం.. వరదల్లో జనాన్ని నిండా ముంచడం.. ఇదే పిట్టల దొర పాలన అంటూ విమర్శించారు. వరదల్లో వరంగల్ మునగకుండా 3 ఏళ్ల కింద మాస్టర్ ప్లాన్ అని చెప్పినా ఫైల్ కదల్లేదన్నారు. రూ.250 కోట్లు తక్షణం ఇవ్వండని అడిగినా పైసా ఇవ్వలేదన్నారు. 

వెయ్యి కోట్లతో భద్రాచలం కరకట్ట అని చెప్పి.. ఆ హామీని సైతం గోదాట్లోనే కలిపాడని షర్మిల అన్నారు. ఏడాదిగా గేట్లు మొరాయించినా కడెం ప్రాజెక్టును పట్టించుకున్నది లేదని.. ప్రమాదపుటంచులో ఉందని చెప్పినా బాగుచేసిందీ లేదన్నారు. పర్యటనకు వెళ్లిన మంత్రులు దేవుడే దిక్కని చెప్తున్న మాటలు.. మీ విజనరీ పాలనకు నిదర్శనమని విమర్శించారు. ప్రశ్నించే ప్రతిపక్షాలది చిల్లర రాజకీయం అయితే.. జనాలను వరదల్లో పెట్టి బురదలో నెట్టి మీరు చేసేదాన్ని ఏమనాలి దొర..? అని ప్రశ్నించారు. కనీసం ఎన్నికల ముందైనా వర్షాలతో సర్వం కోల్పోయిన వారిని ఆదుకోవాలన్నారు. చనిపోయిన కుటుంబాలకు పరిహారం ఇవ్వాలని.. కూలిన ఇండ్ల స్థానంలో పక్కా ఇండ్లు కట్టించాలని ఆమె డిమాండ్ చేశారు.

Also Read: BRO Twitter Review: బ్రో ట్విట్టర్ రివ్యూ.. పబ్లిక్ టాక్ ఇదే.. పవన్ స్టామినాకు తగ్గట్లే..!  

Also Read: Kishan Reddy: ట్యాంక్‌బండ్‌ను కొబ్బరినీళ్లతో నింపుతామన్నారుగా.. ఏమైంది కేసీఆర్..?: కిషన్ రెడ్డి   

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U

ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 

TwitterFacebookసోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి

Trending News