PPF Benefits: రోజుకు 416 రూపాయల పెట్టుబడితో 1 కోటి రూపాయలు పొందవచ్చు

PPF Benefits: భవిష్యత్ సంరక్షణకు ఉపయోగపడమే అద్భుతమైన ఇన్వెస్ట్‌మెంట్ ప్లాన్లలో ఒకటి పబ్లిక్ ప్రోవిడెంట్ ఫండ్. రోజుకు 416 రూపాయలు ఇన్వెస్ట్ చేస్తూ పోతే..ఏకంగా 1 కోటి రూపాయలు అందుకునే అద్బుతమైన అవకాశముంది. ఆ వివరాలు మీ కోసం..

Written by - Md. Abdul Rehaman | Last Updated : Mar 16, 2024, 07:21 PM IST
PPF Benefits: రోజుకు 416 రూపాయల పెట్టుబడితో 1 కోటి రూపాయలు పొందవచ్చు

PPF Benefits: పీపీఎఫ్ అనేది చాలా బెస్ట్ ఇన్వెస్ట్‌మెంట్ ప్లాన్. ఎందుకంటే ప్రభుత్వపరంగా గ్యారంటీ ఉండటంతో రిస్క్ ఏ మాత్రం ఉండదు. రిటర్న్స్ మాత్రం ఆశించిన స్థాయిలో ఉంటాయి. రోజుకు 416 రూపాయలు ఇన్వెస్ట్ చేస్తుంటే ఏకంగా 15 ఏళ్లకు 40 లక్షలు అందుకోవచ్చు. ఇదే పధకాన్ని పొడిగిస్తే ఒకేసారి 1 కోటి రూపాయలు లభిస్తాయి. 

పబ్లిక్ ప్రోవిడెంట్ ఫండ్ అనేది దేశంలోని బ్యాంకులు, పోస్టాఫీసుల్లో అందుబాటులో ఉన్న పధకం. ఈ పధకంపై కేంద్ర ప్రభుత్వం 7.1 శాతం వడ్డీ ఇస్తోంది. రోజుకు 416 రూపాయలు ఇన్వెస్ట్ చేస్తే నెలకు 12,500 రూపాయలు జమ అవుతాయి. పీపీఎఫ్ కాలవ్యవధి 15 ఏళ్లు ఉంటుంది. ఇలా అయితే 15 ఏళ్లకు 40.68 లక్షల రూపాయలవుతాయి. వాస్తవానికి 15 ఏళ్లకు 22.50 లక్షలౌతాయి. దీనిపై లభించే వడ్డీ 18.18 లక్షల రూపాయలౌతాయి. వడ్డీ రేటు 7.1 శాతం ఉంటుంది. 

నెలకు 12,500 రూపాయల చొప్పున 15 ఏళ్లకు 40 లక్షలవుతాయి. ఈ పథకాన్ని మరో ఐదేళ్లకోసారి రెండుసార్లు పొడిగిస్తే 1.03 కోట్లు జమ అవుతాయి. 25 ఏళ్లకు మీరు జమ చేసే నగదు 37.50 లక్షలు కాగా వడ్డీ మాత్రం 65.58 లక్షలు వస్తాయి. పీపీఎఫ్ పథకంలో మరో ప్రయోజనం ఏంటంటే ట్యాక్స్ మినహాయింపు ఉంటుంది. ఇన్‌కంటాక్స్ చట్టంలోని సెక్షన్ సి ప్రకారం ట్యాక్స్ డిడక్షన్ అవకాశముంటుంది. ఏడాదికి 1.5 లక్,ల వరకూ పీపీఎఫ్ ఇన్వెస్ట్‌మెంట్‌పై ట్యాక్స్ మినహాయింపు పొందవచ్చు. పీపీఎఫ్‌పై అందుకునే వడ్డీపై ట్యాక్స్ ఉండదు. 

Also read: Income tax Saving Options: సెక్షన్ 80 సి కాకుండా ట్యాక్స్ మినహాయింపు లభించే మార్గాలేమున్నాయి

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.     

Android Link - https://play.google.com/store/apps/details?id=com.indiadotcom.zeetelugu     

Apple Link - https://apps.apple.com/in/app/zee-telugu-news/id1633190712

మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook

Trending News