Income tax Saving Options: ఇన్‌కంటాక్స్ చట్టం సెక్షన్ 80 సి ప్రకారం ఉద్యోగులు ట్యాక్స్ ఆదా చేస్తుంటారు. సెక్షన్ 80 సి ప్రకారం ఏడాదికి 1.5 లక్షల వరకూ ట్యాక్స్ ఆదా చేయవచ్చు. అయితే జీతం ఎక్కువ ఉండి 1.5 లక్షల తరువాత కూడా ట్యాక్స్ కట్ అవుతుంటే మరి కొన్ని పధకాల్లో ఇన్వెస్ట్ చేయడం ద్వారా ట్యాక్స్ సేవ్ చేయవచ్చు. అంటే సెక్షన్ 80 సి కాకుండా మరికొన్ని ఆప్షన్లు ఉన్నాయి.
ఇన్‌కంటాక్స్ చట్టంలోని సెక్షన్ 80 సి ప్రకారం ట్యాక్స్ మినహాయింపు పూర్తయిపోయి ఇంకా ట్యాక్స్ మినహాయింపు అవసరమైతే నేషనల్ పెన్షన్ స్కీమ్ ద్వారా ఆదా చేయవచ్చు. ఈ పధకం ద్వారా 50 వేల వరకూ ట్యాక్స్ మినహాయింపు పొందవచ్చు. సెక్షన్ 80సి ప్రకారం లభించే 1.5 లక్షల మినహాయింపుకు ఇది అదనం. అంటే మొత్తం మీద 2 లక్షల వరకూ ట్యాక్స్ ఆదా చేయవచ్చు.
హెల్త్ ఇన్సూరెన్స్‌పై కూడా ట్యాక్స్ మినహాయింపు లభిస్తుంది. సెక్షన్ 80 డి ప్రకారం 25 వేల వరకూ ప్రీమియంను మీకు, మీ భార్య, పిల్లలకు చెల్లిస్తూ ట్యాక్స్ మినహాయింపు తీసుకోవచ్చు. మీ తల్లిదండ్రుల వయస్సు 60 ఏళ్లలోపుంటే వారిపై చెల్లించే 25 వేల ప్రీమియం హెల్త్ ఇన్సూరెన్స్‌పై కూడా ట్యాక్స్ మినహాయింపు లభిస్తుంది. అదే మీ తల్లిదండ్రులు సీనియర్ సిటిజన్లు అయితే 50 వేల వరకూ ట్యాక్స్ మినహాయింపు ఉంటుంది.
హెల్త్ చెకప్‌పై పెట్టే ఖర్చుపై కూడా ట్యాక్స్ మినహాయింపు పొందవచ్చు. సెక్షన్ 80 డి ప్రకారం పరీక్షలకై ఖర్చుపై ట్యాక్స్ డిడక్షన్ కోరవచ్చు. ప్రతియేటా 5 వేల వరకూ మినహాయింపుకు అవకాశముంటుంది. ఇక సెక్షన్ 80 టీటీఏ ప్రకారం వ్యక్తిగత ట్యాక్స్ పేయర్లు గరిష్టంగా ఒక ఏడాదిలో 10 వేల వరకూ సేవింగ్ పధకంపై వచ్చే వడ్డీపై ట్యాక్స్ మినహాయింపు పొందవచ్చు.
ఇక చివరి ఆప్షన్ మరొకటి ఉంది. అది విరాళాలపై ట్యాక్స్ మినహాయింపు. సెక్షన్ 80జి ఇందుకు వర్తిస్తుంది. మీరు ఇచ్చే విరాళంపై ట్యాక్స్ మినహాయింపు క్లెయిమ్ చేసుకోవచ్చు. అయితే మీరు ఇచ్చే విరాళం ఏడాది ఆదాయంపై 10 శాత దాటకూడదు. మసీదులు, ఆలయాలు, చర్చీల ఆధునీకరణకు ఇచ్చే డొనేషన్లపై కూడా ఇన్‌కంటాక్స్ డిడక్షన్ ఉంటుంది.
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://play.google.com/store/apps/details?id=com.indiadotcom.zeetelugu
Apple Link - https://apps.apple.com/in/app/zee-telugu-news/id1633190712
మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook