Samsung Galaxy F12: రెండు రకాల బడ్జెట్ స్మార్ట్‌ఫోన్లు లాంచ్ చేసిన శాంసంగ్

Samsung Galaxy F12 Price In India: బడ్జెట్ ధరలలో ఓ మొబైల్‌ను రెండు వేరియంట్లలో భారత మార్కెట్‌లో లాంచ్ చేసింది. ఈ కామర్స్ సంస్థ ఫ్లిప్‌కార్ట్‌లో భారత్ మార్కెట్‌లోకి శాంసంగ్ F02s అందుబాటులోకి వచ్చింది. ఈ మేరకు శాంసంగ్ కంపెనీ సైతం ప్రకటన విడుదల చేసింది. 

Written by - Shankar Dukanam | Last Updated : Apr 11, 2021, 01:48 PM IST
  • కరోనా సమయంలోనూ శాంసంగ్ కంపెనీ బడ్జెట్ ధరలకు స్మార్ట్‌ఫోన్లు
  • శాంసంగ్ గెలాక్సీ ఎఫ్02ఎస్, శాంసంగ్ గెలాక్సీ ఎఫ్12 స్మార్ట్‌ఫోన్లు లాంఛ్
  • ఆకర్షణీయమైన ధరలతో మూడు రకాల రంగుల్లో ఫోన్లు విక్రమయాలు
Samsung Galaxy F12: రెండు రకాల బడ్జెట్ స్మార్ట్‌ఫోన్లు లాంచ్ చేసిన శాంసంగ్

Samsung Galaxy F02s Price In India: దక్షిణ కొరియా స్మార్ట్‌ఫోన్ తయారీ దిగ్గజం శాంసంగ్ కంపెనీ భారత్‌లోని వినియోగదారులకు శుభవార్త అందించింది. బడ్జెట్ ధరలలో ఓ మొబైల్‌ను రెండు వేరియంట్లలో భారత మార్కెట్‌లో లాంచ్ చేసింది. ఈ కామర్స్ సంస్థ ఫ్లిప్‌కార్ట్‌లో భారత్ మార్కెట్‌లోకి శాంసంగ్ F02s అందుబాటులోకి వచ్చింది. ఈ మేరకు శాంసంగ్ కంపెనీ సైతం ప్రకటన విడుదల చేసింది. 

కరోనా సమయంలోనూ శాంసంగ్ కంపెనీ బడ్జెట్ ధరలకు స్మార్ట్‌ఫోన్లు అందుబాటులోకి తెచ్చింది. ప్రస్తుతం లాంచ్ అయిన శాంసంగ్ F02s 5000ఎంఏహెచ్ భారీ బ్యాటరీతో రూపొందించారు. 6.5 అంగుళాల హెచ్‌డీ+ డిస్‌ప్లే, శక్తివంతమైన క్వాల్కమ్ ప్రాసెసర్‌తో రెండు వేరియంట్లలో లభ్యం కానుంది. 4జీబీ ర్యామ్ 64 జీబీ ఇంటర్నల్ మెమరీ, మరో వేరియంట్ 3 జీబీ ర్యామ్ 32 జీబీ ఇంటర్నల్ స్టోరేజీతో భారత మార్కెట్‌లో శాంసంగ్(Samsung) సరికొత్త మొబైల్ లాంచ్ అయింది.

Also Read: Samsung Galaxy F02s: శాంసంగ్ గెలాక్సీ F02s తక్కువ ధరలో ఆకట్టుకునే ఫీచర్స్

శాంసంగ్ గెలాక్సీ F02s ఫీచర్లు, ప్రత్యేకలు 
- 6.5 అంగుళాల హెచ్‌డీ+ డిస్‌ప్లే
- 5000ఎంఏహెచ్ భారీ బ్యాటరీ
- 4జీబీ ర్యామ్ 64 జీబీ ఇంటర్నల్ స్టోరేజీ
- 3 జీబీ ర్యామ్ 32 జీబీ ఇంటర్నల్ స్టోరేజీ
- శక్తివంతమైన క్వాల్కమ్ 450 ప్రాసెసర్‌
- 12MP రియర్ కెమెరా, క్లోజప్ షాట్స్‌ కోసం 2MP మ్యాక్రో కెమెరా, సెల్ఫీ కోసం 5MP ఫ్రంట్ కెమెరా
- 15 వాట్స్ అడాప్టివ్ ఫాస్ట్ ఛార్జర్

శాంసంగ్ గెలాక్సీ ఎఫ్02ఎస్ ధర..
శాంసంగ్ గెలాక్సీ ఎఫ్02ఎస్ 4జీబీ ర్యామ్ 64 జీబీ ఇంటర్నల్ స్టోరేజీ వేరియంట్ ధర రూ.9,999కు లభ్యం కానుంది. 3 జీబీ ర్యామ్ 32 జీబీ ఇంటర్నల్ స్టోరేజీ రూ.8,999కు భారత మార్కెట్‌లో అందుబాటులో ఉంది. డైమండ్ బ్లూ, డైమండ్ వైట్, డైమండ్ బ్లాక్ మూడు రంగులలో శాంసంగ్ ఈ స్మార్ట్‌ఫోన్ లేటెస్ట్ వేరియంట్స్‌ను ప్రవేశపెట్టింది.

Also Read: 7th Pay Commission Latest News: ప్రభుత్వ ఉద్యోగులకు ఊరట కలిగించిన కేంద్ర ప్రభుత్వ నిర్ణయం

శాంసంగ్ గెలాక్సీ ఎఫ్02ఎస్‌తో పాటు గెక్సీ ఎఫ్12 స్మార్ట్‌ఫోన్‌ను కూడా భారత్‌లో లాంచ్ చేసింది. 4జీబీ ర్యామ్ 64 జీబీ ఇంటర్నల్ స్టోరేజీ, 4జీబీ ర్యామ్ 128 జీబీ ఇంటర్నల్ స్టోరేజీ వేరియంట్లలో శాంసంగ్ గెలాక్సీ ఎఫ్12ను తీసుకొచ్చింది. వీటి ధరలు వరుసగా రూ.10,999, రూ. 11,999గా నిర్ణయించారు. సీ గ్రీన్, స్కై బ్లూ, సెలెస్టియల్ బ్లాక్, మూడు రంగులలో గెలాక్సీ ఎఫ్12 లభ్యం కానుంది. ఫ్లిప్‌కార్ట్‌లో ఏప్రిల్ 12 నుంచి విక్రయాలు ప్రారంభం కానున్నాయి.

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు..  క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee Hindustan App డౌన్‌లోడ్ చేసుకోండి.

Android Link - https://bit.ly/3hDyh4G

Apple Link - https://apple.co/3loQYe

మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook

Trending News