SBI Share Updates: ఆల్ టైమ్ హైకు చేరుకున్న ఎస్బీఐ షేర్, షేర్ ఎంత పెరిగిందంటే

SBI Share Updates: స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ధమాకా నడుస్తోంది. బ్యాంక్ షేర్ ఆల్ టైమ్ హైకు చేరుకుంది. షేర్ మార్కెట్‌లో ఎస్బీఐ షేర్ లాభాలు ఇలా ఉన్నాయి.  

Written by - Md. Abdul Rehaman | Last Updated : Nov 7, 2022, 08:27 PM IST
SBI Share Updates: ఆల్ టైమ్ హైకు చేరుకున్న ఎస్బీఐ షేర్, షేర్ ఎంత పెరిగిందంటే

షేర్ మార్కెట్‌లో వివిధ బ్యాంకుల షేర్లు ఇటీవలి కాలంలో మంచి లాభాలు ఆర్జిస్తున్నాయి. ముఖ్యంగా స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా అద్భుతమైన త్రైమాసిక ఫలితాలతో బ్యాంక్ షేర్ అత్యధిక ధరకు చేరుకుంది. 

భారతీయ బ్యాంకులు పెద్దసంఖ్యలో మంచి రిటర్న్స్ సాధిస్తున్నాయి. షేర్ మార్కెట్ పరంగా బ్యాంకింగ్ వ్యవస్థకు ఇది మంచి పరిణామంగా మార్కెట్ విశ్లేషకులు అంచనా వేస్తున్నారు. షేర్ మార్కెట్‌లో ఇవాళ ఎస్బీఐ షేర్ చాలా వేగంగా పెరిగింది. త్రైమాసికంలో అద్భుత ఫలితాలు సాధించడంలో షేర్ ధర అమాంతం పెరిగింది. నవంబర్ 4వ తేదీన 593.95 రూపాయలకు క్లోజ్ అయిన ఎస్బీఐ షేర్..నవంబర్ 7వ తేదీన అంటే రెండ్రోజుల్లో 622.70 రూపాయలకు చేరుకుంది. ఎన్ఎస్ఈలో ఈ షేర్ 52 వారాల గరిష్ట ధర 622.70 రూపాయలుగా ఉంది. ఇదే బ్యాంకుకు సంబంధించిన ఆల్ టైమ్ హై కూడా. 

అద్భుతమైన రిటర్న్స్

గ్రీన్ పోర్ట్ ఫోలియో స్మాల్ కేస్ కో ఫౌండర్ చెప్పిందాని ప్రకారం భారతీయ బ్యాంకులకు ఇది మంచి సమయం. ఈ రంగంలో అత్యధికశాతం బ్యాంకులు రెండవ త్రైమాసికంలో పెద్దమొత్తంలో మంచి రిటర్న్స్ అందించాయి. రానున్న త్రైమాసికంలో కూడా ఎస్బీఐ మంచి ఫలితాల్ని అందించవచ్చు.

పట్టు బిగిస్తున్న ఎస్బీఐ

అధిక వడ్డీల కారణంగా బ్యాంకు మంచి లాభాలు ఆర్జిస్తుందని మార్కెట్ నిపుణులు అంచనా వేస్తున్నారు. కార్పొరేట్ రుణాల్లో కూడా వృద్ధి వస్తుందని అంచనా. ఎస్బీఐ, బ్యాంక్ ఆఫ్ బరోడా వంటి బ్యాంకులు ప్రైవేట్ బ్యాంకులతో పోటీ పడుతూ పట్టుబిగిస్తున్నాయి.

అద్భుత లాభాలు

కానున్న 6-12 నెలల్లో ఎస్బీఐ ఇన్వెస్టర్లు 20 శాతం కంటే ఎక్కువ లాభాలు ఆర్జించేందుకు షేర్లను నిలుపుకోవచ్చని మార్కెట్ నిపుణులు సూచిస్తున్నారు. ఇటీవలే స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా అద్భుతమైన లాభాల్ని అందించింది. ఎస్బీఐ సెప్టెంబర్ త్రైమాసికంలో వృద్ది భారీగా నమోదైంది. బ్యాంకు లాభాలు కూడా అధికంగా ఉన్నాయి.

ఎంత పెరిగింది

దేశంలోని అతిపెద్ద బ్యాంకింగ్ వ్యవస్థ స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ప్రస్తుత ఆర్ధిక సంవత్సరం జూలై-సెప్టెంబర్ త్రైమాసికంలో 13, 265 కోట్ల లాభాల్ని ఆర్జించింది. గత ఏడాది ఇదే సమయంతో పోలిస్తే..74 శాతం ఎక్కువే. షేర్ మార్కెట్లకు ఎస్బీఐ ఇచ్చిన సూచనల ప్రకారం వడ్డీ ధరలు పెరగడం వంటి కారణాలతో లాభాలు పెరిగాయి. ఏడాది క్రితం లాభాలతో పోలిస్తే..7,627 కోట్ల రూపాయలు పెరిగింది.

Also read: IPO Updates: వచ్చే వారం నాలుగు ఐపీవోలు, 14వేల పెట్టుబడితో లాభాలు ఆర్జించే అవకాశం

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.     

Android Link - https://play.google.com/store/apps/details?id=com.indiadotcom.zeetelugu      

Apple Link - https://apps.apple.com/in/app/zee-telugu-news/id1633190712

మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook

Trending News