Online Shopping: ఆన్‌లైన్ షాపింగ్ చేస్తున్నారా... అయితే ఈ ఐదు జాగ్రత్తలు తప్పనిసరి..

Best tips for safe online shopping: స్మార్ట్‌ఫోన్ వినియోగం, ఇంటర్నెట్ విస్తృతి పెరిగిపోవడంతో చాలామంది ఇంట్లో నుంచి కాలు బయటపెట్టకుండా కావాల్సిన వస్తువులను ఆన్‌లైన్‌లోనే ఆర్డర్ చేసి తెప్పించుకుంటున్నారు. అయితే ఆన్‌లైన్ షాపింగ్ విషయంలో కొన్ని జాగ్రత్తలు అవసరం. లేనిపక్షంలో మీ ఖాతాలో సొమ్ము మీకు తెలియకుండానే ఖాళీ అయిపోవచ్చు. 

Written by - ZH Telugu Desk | Last Updated : Dec 19, 2021, 05:26 PM IST
  • ఆన్‌లైన్ షాపింగ్ చేసేవారికి ఐదు బెస్ట్ టిప్స్
  • ఈ జాగ్రత్తలతో ఆన్‌లైన్‌లో సేఫ్ షాపింగ్
  • ఎట్టి పరిస్థితుల్లోనూ వీటిని నిర్లక్ష్యం చేయవద్దు
 Online Shopping: ఆన్‌లైన్ షాపింగ్ చేస్తున్నారా... అయితే ఈ ఐదు జాగ్రత్తలు తప్పనిసరి..

Best tips for safe online shopping: గత కొన్నేళ్లుగా ఆన్‌లైన్ షాపింగ్‌కు విపరీతమైన డిమాండ్ ఏర్పడింది. ముఖ్యంగా కరోనా (Covid 19) కారణంగా చాలామంది ఆన్‌లైన్ షాపింగ్ వైపు మళ్లారు. టూత్ బ్రష్ మొదలు లగ్జరీ వస్తువుల వరకు ఆన్‌లైన్ ద్వారానే కొనుగోలు చేస్తున్నారు. స్మార్ట్‌ఫోన్ వినియోగం, ఇంటర్నెట్ విస్తృతి పెరిగిపోవడంతో ఇంట్లో నుంచి కాలు బయటపెట్టకుండా కావాల్సిన వస్తువులను ఆన్‌లైన్‌లోనే ఆర్డర్ చేసి తెప్పించుకుంటున్నారు. అయితే ఆన్‌లైన్ షాపింగ్ (Online Shopping) విషయంలో కొన్ని జాగ్రత్తలు అవసరం. లేనిపక్షంలో మీ ఖాతాలో సొమ్ము మీకు తెలియకుండానే ఖాళీ అయిపోవచ్చు. 

సెక్యూర్ ఇంటర్నెట్ కనెక్షన్ మాత్రమే వాడండి:

ఆన్‌లైన్ షాపింగ్‌ చేసేందుకు సైబర్ కేఫ్‌లు, పబ్లిక్ వైఫై కనెక్షన్లను ఉపయోగించడం అంత సురక్షితం కాదు. అలా చేయడం ద్వారా మీ బ్యాంకు కార్డ్ నంబర్, పాస్‌వర్డ్ తదితర వివరాలు సైబర్ నేరగాళ్ల చేతికి చిక్కవచ్చు. అదే జరిగితే మీ ఖాతాలో సొమ్ము మీ ప్రమేయం లేకుండానే ఖాళీ అవుతుంది. అలా జరగకుండా ఉండాలంటే సెక్యూర్ ఇంటర్నెట్ కనెక్షన్‌ను మాత్రమే వాడండి. అలాగే మీ స్మార్ట్‌ఫోన్, కంప్యూటర్‌లో యాంటీ వైరస్‌ను ఇన్‌స్టాల్ చేసుకోండి.  

మాల్వేర్‌తో జాగ్రత్త

సైబర్ నేరస్తులు ఎస్ఎంఎస్, సోషల్ మీడియా, ఈమెయిల్స్ ద్వారా నకిలీ ప్రకటనలకు సంబంధించిన లింక్స్‌ను పంపిస్తుంటారు. అందులో ఆకర్షణీయమైన ఆఫర్స్ మిమ్మల్ని ఇట్టే ఆకట్టుకుంటాయి. అయితే ఇలాంటి లింక్స్‌ను క్లిక్ చేశారో అంతే సంగతి. మీ డేటా సైబర్ నేరస్తుల చేతికి చిక్కడం లేదా కంప్యూటర్ హ్యాక్ అవడం జరగవచ్చు. కాబట్టి ఇలాంటి ఫేక్ లింక్స్ పట్ల జాగ్రత్తగా ఉండాలి. కొన్నిసార్లు ప్రముఖ సంస్థలు కూడా ఇలాంటి మాల్వేర్ బారినపడుతుంటాయి. ఇటీవలి కాలంలో గూగుల్ తమ వెబ్, మొబైల్ బ్రౌజర్‌లను మరింత సెక్యూర్‌గా ఉంచేందుకు ప్రయత్నిస్తోంది. మీ కంప్యూటర్ లేదా మొబైల్‌లో యాడ్ బ్లాకర్ యాప్‌ను ఉపయోగించడం ద్వారా ఇలాంటి మాల్వేర్‌ను నివారించవచ్చు.

ఈమెయిల్ లేదా ఎస్ఎంఎస్ ద్వారా జరిగే మోసాలు

సైబర్ నేరస్తులు బాగా తెలివిమీరిపోయారు. ఎప్పటికప్పుడు కొత్త తరహా మోసాలతో వినియోగదారులను బోల్తా కొట్టిస్తున్నారు. ప్రముఖ వెబ్‌సైట్స్ పేరిట ఈమెయిల్ లేదా ఎస్ఎంఎస్‌లు పంపిస్తారు. అందులో ఆకర్షణీయమైన ఆఫర్స్ ఉన్నట్లు ప్రకటనలిస్తారు. అది నమ్మి లింకుపై క్లిక్ చేశారంటే... అది మిమ్మల్ని మరో ఫేక్ వెబ్‌సైట్‌కు ఇండైరెక్ట్ చేస్తుంది. అక్కడ కనిపించిన వస్తువులు కొనేందుకు మీరు ఆర్డర్ చేసినట్లయితే... మీ బ్యాంకు ఖాతా, సీవీవీ నంబర్, ఇతరత్రా వివరాలు నేరుగా సైబర్ నేరగాళ్ల చేతుల్లోకి వెళ్తాయి. కాబట్టి ఇలాంటి ఫేక్ వెబ్‌సైట్స్ పట్ల అప్రమత్తంగా ఉండాలి.

డెబిట్, క్రెడిట్ కార్డ్ లావాదేవీలను గమనించండి

చాలామంది కస్టమర్లు డెబిట్, క్రెడిట్ కార్డు ఖాతాలపై అంతగా దృష్టి పెట్టరు. ఫలితంగా కొన్నిసార్లు ఖాతాల నుంచి డబ్బు విత్‌డ్రా అయిన సంగతి కూడా వారికి తెలియదు. ఆ తర్వాత ఎప్పటికో మెయిల్ లేదా ఎస్ఎంఎస్ చూసుకుని ఆలస్యంగా ఆ విషయాన్ని గుర్తిస్తారు. ఇలా నిర్లక్ష్య ధోరణితో వ్యవహరించడం సరికాదు. ఎప్పటికప్పుడు మీ బ్యాంకు ఖాతా స్టేట్‌మెంట్‌ను చెక్ చేసుకోండి. ట్రాన్సాక్షన్స్‌లో ఏమాత్రం తేడా కనిపించినా వెంటనే బ్యాంకు అధికారులను సంప్రదించండి.

సురక్షిత వెబ్‌సైట్స్, యాప్‌ల ద్వారానే షాపింగ్ చేయండి

ఆన్‌లైన్‌లో షాపింగ్ చేస్తున్నప్పుడు మనం ఉపయోగించే ఈ-కామర్స్ వెబ్‌సైట్, దాని వెబ్ చిరునామాలో 'https'తో ప్రారంభమవుతోందో లేదో తనిఖీ చేయాలి. వెబ్‌సైట్ యూఆర్ఎల్ 'https'తో ప్రారంభమైనట్లయితే గనుక... ఆ వెబ్‌సైట్ సురక్షితమైనదని గుర్తించాలి. ఎందుకంటే ఈ వెబ్‌సైట్‌లు TLS/SSLని కలిగి ఉంటాయి. తద్వారా మీ సమాచారం ఎన్‌క్రిప్షన్ చేయబడుతుంది. అలాగే, షాపింగ్‌కి అధికారిక వెబ్‌సైట్స్‌లో (E-Commece) మాత్రమే లాగిన్ అవండి. ఆ ప్లాట్‌ఫామ్స్ నుంచే వస్తువులను కొనుగోలు చేయండి. నకిలీ యాప్స్, ఫేక్ వెబ్‌సైట్స్ బారినపడకుండా చూసుకోండి. గూగుల్ ప్లే స్టోర్, ఐఓఎస్ స్టోర్‌లోనూ నకిలీ యాప్స్ అందుబాటులో ఉంటాయి. కొన్నిసార్లు అవి మనకు తెలియకుండానే డౌన్‌లోడ్ అవుతుంటాయి. అలాంటి యాప్స్ ఫోన్‌లో లేకుండా చూసుకోండి.

Also Read: అమృత్‌సర్ గోల్డెన్‌ టెంపుల్‌లో అనూహ్య ఘటన.. ఆ వ్యక్తిని కొట్టిన చంపిన భక్తులు

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు..  క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.

Android Link - https://bit.ly/3hDyh4G

Apple Link - https://apple.co/3loQYe 

మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook

Trending News