flipkart Big Saving Days: భలే మంచి చౌక భేరం.. కిలో టమాటాల కంటే చీప్ గా స్మార్ట్ ఫోన్స్ అమ్మకం..

flipkart Big Saving Days: అవును.. మీరు విన్నది నిజమే! కిలో టమాటాల కంటే తక్కువ ధరకే  స్మార్ట ఫోన్స్.. ఇప్పుడు ఫ్లిప్ కార్ట్ బిగ్ సేవింగ్ డేస్ సేల్ లో అందుబాటులో ఉన్నాయి. అయితే అంతటి చౌకైన మొబైల్స్ ఏవి? వాటి వివరాలను తెలుసుకోండి.   

Written by - ZH Telugu Desk | Last Updated : Dec 17, 2021, 10:13 PM IST
flipkart Big Saving Days: భలే మంచి చౌక భేరం.. కిలో టమాటాల కంటే చీప్ గా స్మార్ట్ ఫోన్స్ అమ్మకం..

flipkart Big Saving Days: ఈ-కామర్స్ దిగ్గజ సంస్థ ఫ్లిప్ కార్ట్ మరో బిగ్ సేల్ తో కస్టమర్ల ముందుకొచ్చింది. ఫ్లిప్ కార్ట్ బిగ్ సేవింగ్ డేస్ పేరిట డిసెంబరు 16 నుంచి ప్రారంభించిన ఈ సేల్.. డిసెంబరు 21 వరకు కొనసాగనుంది. ఈ సేల్ ద్వారా స్మార్ట్ ఫోన్స్ పై భారీ డిస్కౌంట్ లభించనుంది. కిలో టమాటాల ధర కంటే చౌకగా కొన్ని మొబైల్స్ అందుబాటులో ఉన్నాయి. వాటి వివరాలేంటో తెలుసుకుందాం. 

Realme 64GB వేరియంట్..

రియల్ మీ కంపెనీకి చెందిన స్మార్ట్ ఫోన్స్ లోని 64GB స్టోరేజ్ తో ఓ మొబైల్ అందుబాటులో ఉంది. రూ.10,999 ఒరిజినల్ ధర కలిగిన ఈ స్మార్ట్ ఫోన్ flipkart బిగ్ సేవింగ్ డే సేల్ లో రూ.9,999 లకే అందుబాటులో ఉంది. 

ఈ కొనుగోలుకు ఫ్లిప్ కార్ట్ యాక్సిస్ బ్యాంక్ క్రెడిట్ కార్డు వాడినట్లైతే.. రూ.500 తక్షణ క్యాష్ బ్యాక్ పొందవచ్చు. దీంతో ఎక్సైంజ్ ఆఫర్ ద్వారా రూ.9,450 ఆదా అవుతుంది. ఫలితంగా ఈ స్మార్ట్ ఫోన్ కేవలం రూ.49లకే కొనుగోలు చేయడానికి వీలుంది. 

Infinicus 64GB స్మార్ట్ ఫోన్

Infinicus స్మార్ట్‌ఫోన్ 64GB ఇంటర్నల్ స్టోరేజ్‌తో వస్తుంది. ఫ్లిప్‌కార్ట్‌లో రూ.11,999కి విక్రయించబడుతున్న ఈ ఫోన్ ధర రూ.9,999లకే అందుబాటులో ఉంది. ఫ్లిప్‌కార్ట్ యాక్సిస్ బ్యాంక్ క్రెడిట్ కార్డ్‌ని ఉపయోగించడం వల్ల మరో రూ. 500 క్యాష్‌బ్యాక్ పొందుతారు. దీంతో పాటు ఎక్స్ఛేంజ్ ఆఫర్ ద్వారా మీకు రూ.9,450 ఆదా అవుతుంది. ఈ ఆఫర్ల తర్వాత చివరగా ఈ ఫోన్ రూ.49లకు కొనుగోలు చేయోచ్చు. 

Moto 64GB స్మార్ట్ ఫోన్

మోటో కంపెనీకి చెందిన 64GB ROM వేరియంట్ స్మార్ట్ ఫోన్ రూ.10,999లకు బదులుగా రూ.9,999 అందుబాటులో ఉంది. ఫ్లిప్‌కార్ట్ యాక్సిస్ బ్యాంక్ క్రెడిట్ కార్డ్‌తో చెల్లింపు చేస్తే.. రూ.500 క్యాష్ బ్యాక్ పొందుతారు. ఎక్స్ఛేంజ్ ఆఫర్ ద్వారా రూ.9,450 ఆదా అవుతుంది. ఫలితంగా ఈ ఫోన్ రూ.49లకే కొనుగోలు చేయవచ్చు. 

Realme Narzo స్మార్ట్ ఫోన్..

రూ.7,999 విలువ కలిగిన Realme Narzo స్మార్ట్ ఫోన్ ఫ్లిప్ కార్ట్ సేవింగ్ సేల్ లో కేవలం రూ.7,499లకే కస్టమర్లకు అందుబాటులో ఉంది. ఏ బ్యాంక్ క్రెడిట్ కార్డు లేదా డెబిట్ కార్ఢు ద్వారా రూ.500 క్యాష్ బ్యాక్ పొందవచ్చు. దీంతో పాటు ఎక్సైంజ్ ఆఫర్ ద్వారా రూ.6,950 తగ్గింపు లభిస్తుంది. ఈ విధంగా అన్ని ఆఫర్ల పోగా ఈ స్మార్ట్ ఫోన్.. రూ.49లకు కొనుగోలు చేయవచ్చు. 

Vivo 32GB స్మార్ట్ ఫోన్

ఈ Vivo స్మార్ట్‌ఫోన్ 32GB స్టోరేజ్‌తో వస్తుంది. రూ.11,990 ధర కలిగిన ఈ ఫోన్‌.. ఫ్లిప్‌కార్ట్ సేల్ ద్వారా రూ.9,490కి కొనుగోలు చేయవచ్చు. ఈ కొనుగోలులో ఫ్లిప్‌కార్ట్ యాక్సిస్ బ్యాంక్ క్రెడిట్ కార్డ్ వినియోగంపై రూ.475 క్యాష్‌బ్యాక్ పొందుతారు. దీంతో ఎక్సైంజ్ ఆఫర్ ద్వారా రూ.8,950 తగ్గింపు లభిస్తుంది. ఈ విధంగా వివో స్మార్ట ఫోన్ ను రూ.65 లకే కొనవచ్చు. 

అయితే ఈ వార్త రాసే సమయానికి అటు మార్కెట్ ధరలతో పాటు ఆన్ లైన్ లోనూ కిలో టమాటాల ధర రూ.69లకు మించి ఉంది. దీంతో పోలిస్తే కిలో టమాటాల ధరతో పోలిస్తే.. పైన చెప్పిన స్మార్ట్ ఫోన్స్ చౌకగా లభిస్తున్నట్లే! 

ALso Read: Stock Market today: వారాంతంలో కుప్ప కూలిన స్టాక్ మార్కెట్లు- 17 వేల మార్క్ కోల్పోయిన నిఫ్టీ

Also Read: SBI: ఎస్​బీఐ రుణాలు మరింత భారం- బేస్​ రేటు 10 బేసిస్​ పాయింట్లు పెంపు!

 

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు..  క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3hDyh4G

Apple Link - https://apple.co/3loQYe 

మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook  

Trending News