Vivo 5G Software Updates: వివో 5G స్మార్ట్‌ఫోన్స్‌కి సాప్ట్‌వేర్ అప్‌డేట్స్‌పై గుడ్ న్యూస్

Vivo 5G Software Updates: ఇండియన్ స్మార్ట్ ఫోన్ మార్కెట్‌లో లార్జెస్ట్ ప్లేయర్ అయిన వివో కంపెనీ తమ 5G స్మార్ట్ ఫోన్స్ వినియోగదారులకు తీపి కబురు చెప్పింది. వివో కంపెనీ తయారు చేసిన 5G ఫోన్స్ ఉపయోగిస్తున్న వారి కోసం  త్వరలోనే సాఫ్ట్‌వేర్ అప్‌డేట్స్ రిలీజ్ చేయనున్నట్టు వివో స్పష్టంచేసింది. 

Written by - Pavan | Last Updated : Oct 20, 2022, 04:43 AM IST
  • సాప్ట్‌వేర్ అప్‌డేట్స్‌ రిలీజ్ చేయనున్న వివో
  • స్టాండ్ఎలోన్, నాన్-స్టాండ్ఎలోన్ 5G నెట్‌వర్క్స్ ఉపయోగించుకోవడానికి వీలుగా అప్‌డేట్స్
  • ఇంతకీ స్టాండ్ఎలోన్, నాన్-స్టాండ్ఎలోన్ 5G నెట్‌వర్క్స్ అంటే ఏంటి ?
Vivo 5G Software Updates: వివో 5G స్మార్ట్‌ఫోన్స్‌కి సాప్ట్‌వేర్ అప్‌డేట్స్‌పై గుడ్ న్యూస్

Vivo 5G Software Updates: స్మార్ట్ ఫోన్ దిగ్గజం వివో తమ 5G స్మార్ట్ ఫోన్స్ యూజర్స్‌కి గుడ్ న్యూస్ చెప్పింది. వివో 5G స్మార్ట్ ఫోన్స్‌లో 5G సేవలు వినియోగించుకునేలా ఈ నెలాఖరులోగా సాఫ్ట్‌వేర్ అప్‌డేట్స్ విడుదల చేయనున్నట్టు వివో ప్రకటించింది. స్టాండ్ఎలోన్, నాన్-స్టాండ్ఎలోన్ 5G నెట్‌వర్క్స్ ఉపయోగించుకోవడానికి వీలుగా 5G స్మార్ట్‌ఫోన్స్‌కి అప్‌డే‌ట్స్ విడుదల చేయనున్నట్టు వివో స్పష్టంచేసింది. 

ఇంతకీ స్టాండ్ఎలోన్, నాన్-స్టాండ్ఎలోన్ 5G నెట్‌వర్క్స్ అంటే ఏంటి ?
5G నెట్‌వర్క్ అందుబాటులోకి రావడంతో కొన్ని కొత్త పదాలు వాడుకలోకి వస్తుండటం కొంతమందిని కన్‌ఫ్యూజన్‌కి గురిచేస్తోంది. అందులో స్టాండ్ఎలోన్, నాన్-స్టాండ్ఎలోన్ 5G నెట్‌వర్క్స్ టాపిక్ కూడా ఒకటి. స్టాండ్ఎలోన్ 5G నెట్‌వర్క్ అంటే అది 5జి సిగ్నల్‌ని మాత్రమే ట్రాన్స్‌మిట్ చేస్తుంది. నాన్-స్టాండఎలోన్ 5G నెట్‌వర్క్ అంటే 4G నెట్‌వర్క్, 5G నెట్‌వర్క్ సిగ్నల్స్ కలిపి ట్రాన్స్‌మిట్ చేస్తుందన్నమాట.

ఇంకా వివరంగా చెప్పాలంటే.. ప్రస్తుతం టెలికాం మార్కెట్‌లో 5G నెట్‌వర్క్ అందిస్తున్న సర్వీస్ ప్రొవైడర్లలో రిలయన్స్ జియో స్టాండ్ఎలోన్ 5G నెట్‌వర్క్ అందిస్తుండగా.. భారతి ఎయిర్‌టెల్ నాన్-స్టాండ్ఎలోన్ 5G నెట్‌వర్క్ సేవలు అందిస్తోంది. 

ఇప్పటి వరకు వివో కంపెనీ ఇండియన్ స్మార్ట్‌ఫోన్ మార్కెట్‌లోకి 30 వరకు 5G స్మార్ట్‌ఫోన్లు లాంచ్ చేసింది. అందులో అధిక శాతం స్మార్ట్‌ఫోన్లు నాన్ - స్టాండ్ఎలోన్ 5G నెట్‌వర్క్ సేవలు ఉపయోగించుకునేందుకు అనువుగా తయారు చేసినవే. ఇదే విషయమై వివో కంపెనీ స్పందిస్తూ.. తాము తయారు చేసిన 5G స్మార్ట్ ఫోన్లలో 6కి పైగా స్మార్ట్ ఫోన్లు స్టాండ్ఎలోన్ 5G నెట్‌వర్క్‌కి ఉపయోగపడేవి కాగా.. మిగతావి నాన్ -  స్టాండ్ఎలోన్ 5G నెట్‌వర్క్ సేవలు ఉపయోగించుకోవచ్చని వివో స్పష్టంచేసింది.

ఇండియాలో లార్జెస్ట్ స్మార్ట్ ఫోన్ సెల్లర్‌గా ఎదిగిన వివో కంపెనీ ఈ ఏడాది ఏప్రిల్ - జూన్ క్వార్టర్ నాటికి నమోదైన గణాంకాల ప్రకారం దేశంలోని స్మార్ట్ ఫోన్ మార్కెట్‌లో 17 శాతం వాటా సొంతం చేసుకుందని ప్రముఖ మార్కెట్ రిసెర్చ్ సంస్థ ఐడిసి స్పష్టంచేసింది. ఇదిలావుంటే 5G సేవలు మరింత అందుబాటులోకి తీసుకొచ్చే లక్ష్యంతో పనిచేస్తోన్న కేంద్ర ప్రభుత్వం ఇటీవల 5G నెట్‌వర్క్ అందిస్తున్న టెలికాం కంపెనీలను, 5G స్మార్ట్ ఫోన్స్ తయారు చేస్తోన్న కంపెనీలను ఒక్కచోటుకు తీసుకొచ్చి ఒక సమావేశం ఏర్పాటు చేసింది. రానున్న కాలంలో 5G సేవలు విస్కృతం చేసేందుకు వీలుగా 5G స్మార్ట్ ఫోన్లు ( 5G Smartphones ) తయారు చేయాల్సిన అవసరాన్ని సూచిస్తూ ప్రభుత్వం ఈ సమావేశం ఏర్పాటు చేసింది.

Also Read : Flipkart Sale Samsung Galaxy F23 : ఫ్లిప్‌కార్ట్ సేల్.. రూ. 24 వేల ఫోన్.. కేవలం రూ. 549లకే.. ఎలా అంటే?

Also Read : Flipkart Sale: యాపిల్ ప్రేమికులకు గుడ్‌న్యూస్, ఐఫోన్ 11 ధర ఇప్పుడు 19 వేలే

Also Read : Instagram Reels: ఇన్‌స్టాగ్రామ్ కొత్త ఆఫర్, భారతీయ యూజర్లకు ఇక నుంచి రీల్స్‌పై బోనస్

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

Android Link https://bit.ly/3P3R74U

Apple Link - https://apple.co/3loQYe 

Twitter , Facebookమా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి

Trending News