Flipkart Sale Samsung Galaxy F23 : ఫ్లిప్‌కార్ట్ సేల్.. రూ. 24 వేల ఫోన్.. కేవలం రూ. 549లకే.. ఎలా అంటే?

Flipkart Sale Diwali Offers పండుగల వస్తున్నాయంటే సేల్స్ అదిరిపోతాయి. ఇక ఫ్లిప్ కార్ట్, అమెజాన్ వంటి సంస్థలైతే ఆకర్షణీయమైన ఆఫర్లతో వినియోగదారుల్ని, కొనుగోలుదారుల్ని ఆకట్టుకుంటుంది.

Written by - ZH Telugu Desk | Last Updated : Oct 19, 2022, 12:45 PM IST
  • అదిరిపోయిన ఫ్లిప్ కార్ట్ సేల్
  • దివాళి స్పెషల్ ఆఫర్స్
  • సామ్‌సంగ్ ఎఫ్23పై భారీ తగ్గింపు
Flipkart Sale Samsung Galaxy F23 : ఫ్లిప్‌కార్ట్ సేల్.. రూ. 24 వేల ఫోన్.. కేవలం రూ. 549లకే.. ఎలా అంటే?

Flipkart Sale Samsung Galaxy F23 : దసరా, దీపావళి, సంక్రాంతి, న్యూఇయర్ ఇలాంటి స్పెషల్ ఈవెంట్లు, పండుగ ఉన్న సమయంలో ఆన్ లైన్ మార్కెట్ ఎలా జోరందుకుంటుందో అందరికీ తెలిసిందే. భారీ తగ్గింపులో అందరినీ ఊరిస్తుంటారు. ఇందులో మరీ ముఖ్యంగా ఎలక్ట్రానిక్ వస్తువుల మీదే భారీ స్థాయిలో తగ్గింపు ఉంటుంది. ఇక ఇలాంటి సేల్స్‌లో ముఖ్యంగా అందరూ ఫోన్‌ల మీద దృష్టి పెడుతుంటారు.

ఫోన్‌లను అందరూ ఈజీగా మార్చేస్తుంటారు. కొత్త కొత్త మోడళ్లు వస్తుంటాయి. పాత మోడళ్లను ఎక్స్‌చేంజ్‌ ఆఫర్లో పెట్టేస్తారు. కొత్త మొబైల్స్ కొనేస్తుంటారు. అయితే ఇప్పుడు ఫ్లిప్ కార్ట్ సేల్‌లో భాగంగా సామ్‌సంగ్ ఎఫ్ 23 ఫోన్ మీద భారీ తగ్గింపు ఉంది. దగ్గరదగ్గరగా రూ. 24 వేలు ఉన్న ఈ ఫోన్ ఆఫర్ మీద భారీ తగ్గింపుతో వస్తోంది. మామూలుగా ఈ ఫోన్ మీద ఇప్పుడు ఫ్లిప్ కార్ట్‌లో 41 శాతం తగ్గింపు ఉంది.

అంటే ఈ ఫోన్ ఇప్పుడు రూ. 13999కి వస్తుంది. అయితే ఇంకా భారీ తగ్గింపు వచ్చే అవకాశం కూడా ఉందట. ఎక్స్‌ఛేంజ్ ఆఫర్లో ఈ ఫోన్ చివరకు రూ. 549 వస్తుందట. రూ. 13450 ఎక్స్‌ఛేంజ్ బోనస్ కూడా ఇవ్వబడుతోండటంతో.. ఫైనల్‌గా రూ. 549 పడుతుంది. దీంతో 24 వేలున్న ఫోన్.. రూ. 549కు వస్తుందన్న మాట. మరి త్వరపడండి. మంచి ఫీచర్లున్న ఈ ఫోన్‌ను తక్కువ ధరకే సొంతం చేసుకోండి.

Also Read : Electricity Bill fraud: ఆన్‌లైన్ కరెంటు బిల్లు చెల్లిస్తున్నారా..జాగ్రత్త, ఒక్క క్లిక్‌తో ఎక్కౌంట్ ఖాళీ కావచ్చు

Also Read : Free OTT Platforms: నెట్‌ఫ్లిక్స్, అమెజాన్, డిస్నీ ప్లస్ హాట్‌స్టార్ ఏడాది ఉచితంగా కావాలా

 

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

Android Link https://bit.ly/3P3R74U

Apple Link - https://apple.co/3loQYe 

మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook

Trending News

By accepting cookies, you agree to the storing of cookies on your device to enhance site navigation, analyze site usage, and assist in our marketing efforts.

x