Street Dogs: మధ్యప్రదేశ్ లో దారుణం.. 55 ఏళ్ల మహిళను పీక్క తిన్న వీధి కుక్కలు..

హైదరాబాద్ లో కుక్కల దాడిలో బాలుడు చనిపోయిన విషయం దేశవ్యాప్తంగా సంచలనం రేపిన సంగతి తెలిసందే! ఆ ఘటన మరవక ముందే మధ్యప్రదేశ్ లో వీధికుక్కలు ఒక మహిళను చంపి తిన్న ఘటన అందరిని షాక్ కి గురి చేస్తుంది.   

Written by - ZH Telugu Desk | Last Updated : May 1, 2023, 02:55 PM IST
Street Dogs: మధ్యప్రదేశ్ లో దారుణం.. 55 ఏళ్ల మహిళను పీక్క తిన్న వీధి కుక్కలు..

Street Dogs Killed a Women: వీధి కుక్కల దాడిలో ఇటీవల ఒక చిన్నారి మృతి చెందిన వార్త హైదరాబాద్‌ వాసులతో పాటు తెలుగు రాష్ట్రాల్లో సంచలనం సృష్టించిన విషయం తెల్సిందే. ఆ సంఘటనతో హైదరాబాద్ లో వీధి కుక్కలను సగానికి పైగా ఖాళీ చేయించారు. మళ్లీ యథావిధిగానే పరిస్తితి ఉందని కొందరు ఆరోపిస్తున్నారు. ఆ సంఘటన మరచి పోకుండానే మధ్య ప్రదేశ్‌ లో దారుణం చోటు చేసుకుంది. 

వీధి కుక్కలు చేసిన పని ప్రస్తుతం దేశ వ్యాప్తంగా చర్చనీయాంశం అవుతోంది. అడవిలో ఉండే జంతుల మాదిరిగా రోడ్ల మీద కుక్కలు కూడా తయారు అవుతున్నాయి అంటూ ప్రతి ఒక్కరు కూడా ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. తాజా సంఘటన కుక్కలపై ప్రేమ ఉన్న వారికి కూడా ఒణుకు పుట్టిస్తుంది అనడంలో సందేహం లేదు. 

పూర్తి వివరాల్లోకి వెళ్తే... మధ్య ప్రదేశ్‌ లోని సియోని జిల్లాలో ముండ్రాయి గ్రామంలో 55 ఏళ్ల మహిళ రోడ్డు పై నడుకుంటూ వెళ్తున్న సమయంలో కుక్కల గుంపు ఆమె మీద దాడి చేశాయి. సియోని కి 20 కిలో మీటర్ల దూరంలో ఈ సంఘటన జరిగింది. మహిళ పై ఒకే సారి లెక్కకు మించిన కుక్కలు పడి కరిచాయి. దాంతో మహిళ అక్కడే మృతి చెందినట్లుగా పేర్కొన్నారు. 

శరీరంపై కుక్కల వల్ల లోతైన గాయాలు ఏర్పాడ్డాయి అని ఈ సంఘటతో ప్రస్తుతం స్థానికంగా హై టెన్షన్ వాతావరణం నెలకొంది. శరీరం మొత్తం కూడా కుక్క కాట్లు ఉన్నట్లుగా వైద్యులు గుర్తించారు. కేసు నమోదు చేసినట్లుగా పోలీసులు పేర్కొన్నారు. 

Also Read: Divorce vs Supreme Court: ఇక విడాకులు వెంటనే ఇచ్చేయవచ్చు, నో వెయిటింగ్

శనివారం ఉదయం 7 గంటల సమయంలో మహిళ పొలానికి వెళ్తున్న సమయంలో వీధి కుక్కల గుంపు ఆమెను చుట్టు ముట్టి కరుస్తుండగా అటుగా వెళ్తున్న వారు కుక్కలు ఏదో శవంను పీక్కతింటున్నాయని అనుకుని గ్రామస్తులు అటుగా వెళ్లి చూడగా మహిళను కుక్కలు కరుస్తున్నాయి. కుక్కలను వారు చెదరగొట్టగా అప్పటికే ఆమె చనిపోయినట్లుగా గుర్తించారు. 

అవి అడవి కుక్కలు అని.. అడవిలో జంతువులను కుక్కలు తిన్న అలవాటుకు మహిళను పీక్క తినేందుకు ప్రయత్నించాయి అంటూ స్థానికులు పేర్కొన్నారు. సంఘటన జరిగిన స్థలంకు అయిదు కిలో మీటర్ల దూరంలో అడివి ఉండటం వల్ల అక్కడ నుండి వచ్చి ఉంటాయి అంటున్నారు. ఫోరెన్సిక్‌ రిపోర్ట్‌ వచ్చిన తర్వాత పూర్తి వివరాలు తెలియజేస్తాం అంటూ పోలీసులు పేర్కొన్నారు.

Also Read: Anand Mahindra Unknown Facts: ఆనంద్ మహీంద్రా అంచలంచెలుగా ఎలా ఎదిగారో తెలుసా? 

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.

ఆండ్రాయిడ్ లింక్ -  https://bit.ly/3P3R74U

ఆపిల్ లింక్ -  https://apple.co/3loQYe

మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి TwitterFacebook

Trending News