Anand Mahindra Unknown Facts: ఆనంద్ మహీంద్రా అంచలంచెలుగా ఎలా ఎదిగారో తెలుసా?

Anand Mahindra Birthday: ఈ రోజు మహీంద్రా గ్రూప్ చైర్మన్ ఆనంద్ మహీంద్రా పుట్టిన రోజు.. ఆయన ఈ స్థాయికి ఎదగడానికి గల కారణాలు, మహీంద్రా గ్రూప్ ఎండీగా బాధ్యతలు చేపట్టడానికి గల కారణాలేంటో మనం ఇప్పుడు తెలుసుకుందాం.   

Written by - Dharmaraju Dhurishetty | Last Updated : May 1, 2023, 02:23 PM IST
Anand Mahindra Unknown Facts: ఆనంద్ మహీంద్రా అంచలంచెలుగా ఎలా ఎదిగారో తెలుసా?

Anand Mahindra Birthday: ఆనంద్ మహీంద్రా అనగానే మనందరికీ మహీంద్రా గ్రూప్ గుర్తుకు వస్తుంది. ఈ రోజు ఆనంద్‌ మహీంద్రా పుట్టిన రోజు. ఆయన 1955 సంవత్సరం 1 మే తేదిన ముంబైలో జన్మించారు. చిన్న వయసులోనే ఆనంద్‌కి బిజినెస్‌ అంటే ఆసక్తి ఉండడం వల్ల చిన్న తనంలోనే పెద్ద పెద్ద బాధ్యతలు చేపట్టారు. ప్రస్తుతం ఆనంద్ మహీంద్రా గ్రూప్ చైర్మన్ కొనసాగుతున్నారు. ఆనంద్ మహీంద్రా 1997లో మహీంద్రా గ్రూప్ ఎండీగా బాధ్యతలు చేపట్టారు. 

ప్రస్తుతం ఈ కంపెనీ  ఆటో, వ్యవసాయ పరికరాలు, ఆర్థిక సేవలు, ఐటీ, మౌలిక సదుపాయాల అభివృద్ధి సేవలు, ఉక్కు ట్రేడింగ్, హాస్పిటాలిటీ రంగాలలో విస్తరించింది. ప్రస్తుతం ఈ కంపెనీ టార్న్‌ ఓవర్‌ సుమారు $ 19 బిలియన్లు దాటీ పోయింది. అంతేకాకుండా 2 లక్షలకుపై ఉద్యోగులు మహీంద్రా గ్రూప్ పని చేస్తున్నారు. అంతేకాకుండా విదేశాల్లో పెట్టుబడుతు పెట్టి అనేక కంపెనీలను కొనుగోలు చేశారు. చివరికి కోటక్ మహీంద్రా బ్యాంక్‌ను కూడా స్థాపించారు. 

Also Read:  Mallemala Remunerations : ఢీ షోలో చాలీచాలని రెమ్యూనరేషన్‌లు!.. కొరియోగ్రఫర్ మృతితో మల్లెమాలపై మరో మరక

ప్రస్తుతం కోటక్ మహీంద్రా బ్యాంక్ దేశంలోని అతిపెద్ద బ్యాంకులలో ఒకటి. దీనిని 1985 సంవత్సరంలో కోటక్ క్యాపిటల్ మేనేజ్‌మెంట్ ఫైనాన్స్ లిమిటెడ్‌  స్థాపించింది. 1986లో ఆనంద్ మహీంద్రా ఇందులో భారీ పెట్టుబడులు పెట్టారు. మార్కెట్‌లో మంచి పేరు పొందడం వల్ల  కోటక్ మహీంద్రా ఫైనాన్స్ లిమిటెడ్ అని పేరు పెట్టారు. ఇందులో పెట్టుబడులు పెట్టడం వల్ల కంపెనీ నాలుగు రెట్లు పురోగమిస్తూ నేటికి అదే లాభాల్లో కొనసాగుతుంది. ప్రస్తుతం ఈ  కోటక్ మహీంద్రా గ్రూప్ దేశంలోని ప్రముఖ ఫైనాన్షియల్ సర్వీసెస్ గ్రూప్‌లలో ఒకటి. ఈ గ్రూప్‌కు దేశవ్యాప్తంగా అనేక శాఖలు ఉన్నాయి. 

ప్రస్తుతం ఉదయ్ కోటక్ దేశంలో అత్యంత సంపన్న బ్యాంకర్‌గా పేరు పొందారు. బ్లూమ్‌బెర్గ్ బిలియనీర్ ఇండెక్స్ ప్రకారం.. $ 14.7 బిలియన్ నికర విలువతో భారతదేశ ధనవంతుల జాబితాలో ఉదయ్ 11వ స్థానంలో ఉన్నారు. ఎంతో కష్టపడితే ఈ స్థానానికి చేరడాని ఆనంద్ మహీంద్రా ఎప్పుడు చెబుతూ వచ్చేవారు. అయినప్పటికీ మహీంద్రా గ్రూప్‌కి కోటక్ మహీంద్రా బ్యాంక్‌లో వాటా లేకపోవడం విశేషం. అయితే చివరకు ఆనంద్‌ మహీంద్రా 2003 సంవత్సరంలో కోటక్ మహీంద్రా ఫైనాన్స్ లిమిటెడ్ వాణిజ్య బ్యాంకు లైసెన్స్‌ను సొంతం చేసుకున్నారు. దేశంలోనే ఈ ఘనత సాధించిన తొలి నాన్ బ్యాంకింగ్ ఫైనాన్షియల్ కంపెనీ ఇదే. 2015లో ఐఎన్‌జి వైశ్యా బ్యాంక్‌ కోటక్‌ మహీంద్రాతో విలీనమైంది. దీంతో దేశంలో అతిపెద్ద బ్యాంక్‌గా కోటక్ మహీంద్రా బ్యాంక్ మారింది. 

ఆనంద్ మహీంద్రా అభిరుచులు:
అతనికి చదవడం, టెన్నిస్ ఆడటం చాలా ఇష్టం. ఆనంద్ మహీంద్రా సినిమాలు చాలా చూసేవారట..దీంతో ఫోటోగ్రాఫర్‌పై ఎక్కువ ఇష్టాన్ని పెంచుకున్నారని సమాచారం. ఆయన ఫ్రీ టైమ్‌లో ఉన్నప్పుడు ఎక్కువగా సినిమాలు చూడడమే కాకుండా టెన్నిస్ ఆడేవారు. 

Also Read:  Mallemala Remunerations : ఢీ షోలో చాలీచాలని రెమ్యూనరేషన్‌లు!.. కొరియోగ్రఫర్ మృతితో మల్లెమాలపై మరో మరక

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.

ఆండ్రాయిడ్ లింక్ -  https://bit.ly/3P3R74U

ఆపిల్ లింక్ -  https://apple.co/3loQYe

మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి TwitterFacebook

 

Trending News

By accepting cookies, you agree to the storing of cookies on your device to enhance site navigation, analyze site usage, and assist in our marketing efforts.

x