Police Job Fraud: పోలీసు శాఖలో తీవ్ర కలకలం.. యూనిఫామ్ వేసుకుని ప్రేమ జంట పాడుపని.. అసలు ట్విస్ట్ ఏంటంటే?..

Visakhapatnam Fake Police Couple:పోలీసుల శాఖలో ఈ ఘటన ప్రస్తుతం కలకలంగా మారింది. ఇద్దరు పోలీసు యూనిఫామ్ వేసుకుని అమాయకులే టార్గెట్ గా మోసాలకు సిద్దపడ్డారు. ఈ ఘటనపై చివరకు టాస్క్ ఫోర్స్ పోలీసులు రంగంలోకి దిగారు.

Written by - Inamdar Paresh | Last Updated : Mar 9, 2024, 01:39 PM IST
  • జాబ్ లు ఇప్పిస్తామని ఖాకీ దుస్తులు వేసుకుని మోసాలు..
  • కోట్లాది రూపాలు దండుకున్న కిలాడీ జంట
Police Job Fraud: పోలీసు శాఖలో తీవ్ర కలకలం.. యూనిఫామ్ వేసుకుని ప్రేమ జంట పాడుపని.. అసలు ట్విస్ట్ ఏంటంటే?..

Fake SIS Cheated Unemployed Youth In Visakhapatnam: ఇరు తెలుగు రాష్ట్రాలలో కూడా ప్రభుత్వాలు వందల కొద్ది ఉద్యోగాలకు నోటిఫికేషన్ లు ఇచ్చాయి. ఈ క్రమంలో.. నిరుద్యోగులు సర్కారు కొలువు కోసం పగలనక రాత్రనక కష్టపడి మరీ చదువుతున్నారు. కొందరు తమ ఉద్యోగాలు, కుటుంబాలు సైతం వదిలేసి భవిష్యత్ కోసం ఎన్నో ఆశలతో చదువుకుంటున్నారు. ఇదిలా ఉండగా.. పోలీసు శాఖలో ఉద్యోగాలకు ఉన్న డిమాండ్ ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. కొందరు దీనికోసం ఎంత కష్టపడిచదువుతారో.. మరికొందరు అంతే మోసపూరితంగా జాబ్ సంపాదించలని ఆశలు పడుతుంటారు. ఇలాంటి వారిని కొందరు కేటుగాళ్లు టార్గెట్ గా చేసుకుని మోసాలకు పాల్పడుతుంటారు.

Read More:Indigestion Remedies: తిన్న ఆహారం జీర్ణ‌మ‌వ్వ‌ట్లేదా.. అయితే ఇవి ట్రై చేయండి!

ఈ మధ్య కాలంలో కొందరు నకిలీగాళ్లు, ఫెక్ ఐడీ, లగ్జరీగా కార్లతో తిరుగుతూ అచ్చం అధికారులలగా ఫోజులు కొడుతు అమాయకులను మోసగిస్తున్నారు. వీరి మాటలను నిజమని నమ్మిన నిరుద్యోగులు డబ్బులు ఇచ్చి మోసపోతున్నారు. ఇలాంటి కోవకు చెందిన ఘటన ప్రస్తుతం ఏపీలో చోటు  చేసుకుంది.

ఆంధ్ర ప్రదేశ్ లో జరిగిన ఈ ఘటన ప్రస్తుతం పోలీసు శాఖలో తీవ్ర చర్చనీయాంశంగా మారింది. విశాఖపట్నంలో హనుమంత్ రమేష్ అనే వ్యక్తి తాను పోలీసునని అవతారం ఎత్తాడు. ఇతను మాత్రమే కాకుండా.. ఇతనితో పాటు మరో మహిళ కూడా లేడీ ఎస్సైలా కలరింగ్ ఇచ్చింది. ఇద్దరు కూడా పోలీసు అధికారుల మాదిరిగా దుస్తులు వేసుకుని, కొందరిని తమ బుట్టలో వేసుకున్నారు. అంతేకాకుండా.. పోలీసుశాఖలో తమకు ఉన్నతాధికారులతో మంచి పరిచయాలున్నాయని, ఉద్యోగాలు ఇప్పిస్తామని అనేక మంది నుంచి కోట్లలో వసూలు చేసినట్లు పోలీసులకు ఫిర్యాదులు వచ్చాయి.

ఇటీవల కొందరికి ఆఫర్ లెటర్ లు ఇస్తామని , పలుమార్లు మోసానికి పాల్పడ్డారు. దీంతో యువకులు విశాఖ పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఈ క్రమంలో .. కేసు నమోదు చేసుకున్న పోలీసులు వీరిపై విచారణ ప్రారంభించారు. పోలీసులు విచారణలో హనుమంత్ రమేష్, మరో యువతితో కలిసి పోలీసు యూనిఫామ్ ధరించి, అమాయకులను మోసం చేస్తున్నారు. అంతే కాకుండా.. వారి దగ్గర నుంచి డబ్బులు కూడా దండుకున్నారు.

Read More: Actress Kajal Agarwal: హీరోయిన్ కాజల్ అగర్వాల్ నడుముపై చెయివేసిన అభిమాని.. సోషల్ మీడియాలో రచ్చగా మారిన వీడియో ఇదే..

హనుమంత్ రమేష్ కు ఇదివరకు ఇద్దరు భార్యలున్నట్లు సమాచారం. ఇప్పుడు మరో మహిళతో కలిసి, ఇలా లివింగ్ రిలేషన్ లో ఉంటూ మోసాలకు పాల్పడుతున్నట్లు పోలీసులు గుర్తించారు. వెంటనే వీరికోసం గాలింపు చేపట్టారు. హైదరాబాద్ లో నిందితులు ఉన్నట్లు పోలీసులు కనుగొన్నారు. వెంటనే టాస్క్ ఫోర్స్ పోలీసులు వీరిని అరెస్టు చేసినట్లు తెలుస్తోంది. ప్రస్తుతం ఈ ఘటన మాత్రం పోలీసు శాఖలో తీవ్ర కలకలంగా మారింది.

 

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి. 

Android Link: https://play.google.com/store/apps/details?id=com.indiadotcom.zeetelugu 

Apple Link: https://apps.apple.com/in/app/zee-telugu-news/id1633190712

మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook

Trending News