Indigestion Remedies: తిన్న ఆహారం జీర్ణ‌మ‌వ్వ‌ట్లేదా.. అయితే ఇవి ట్రై చేయండి!

Indigestion Food Remedies: మనలో చాలా మందిని బాధపట్టే సమస్యలలో అజీర్తి  ఒకటి. అజీర్తీ కారణంగా కడుపు నొప్పి, తలనొప్పి వంటి సమస్యల బారిన పడుతుంటారు. అయితే ఈ చిట్కాలను  పాటించడం వల్ల సమస్య నుంచి బయటపడవచ్చు. 

Written by - ZH Telugu Desk | Last Updated : Mar 9, 2024, 10:53 AM IST
Indigestion Remedies: తిన్న ఆహారం జీర్ణ‌మ‌వ్వ‌ట్లేదా.. అయితే ఇవి ట్రై చేయండి!

Indigestion Food Remedies: ఆధునిక జీవశైలిలో మారిన ఆహార అలవాట్ల కారణంగా అనారోగ్య సమస్యల బారిన పడాల్సి వస్తుంది. దీనికి ముఖ్య కారణం మన తీసుకొనే జంక్‌ ఫూడ్స్‌, అనారోగ్యకరమైన ఆహారం. ఈ ఆహార పదార్థాలు తీసుకోవడం వల్ల తీవ్రమైన సమస్యలు తలెత్తుతున్నాయి. అయితే ప్రస్తుతం చాలా మందిని ఇబ్బంది పెట్టే సమస్యలో అజీర్తి ఒకటి. దీని వల్ల ఎన్నో ఇబ్బందులు కలుగుతాయి. ఈ సమస్య నుంచి బయటపడడానికి మందులు, ప్రొడెక్ట్స వంటివి ఉపయోగిస్తున్నారు. కానీ దీని వల్ల సమస్య నుంచి కొంత ఉపశమనం కలుగుతుంది కానీ  పూర్తిగా సమస్య తగ్గదు. అయితే ఇక్కడ చెప్పిన కొన్ని చిట్కాలను పాటించడం వల్ల సమస్య నుంచి బయట పడవచ్చు.  

అజీర్ణానికి  సహజమైన గృహ చిట్కాలు ఉన్నాయి. వాటిలో కొన్ని:

జీలకర్ర వాటర్‌:  

గ్యాస్‌, వాంతులు, అజీర్తి సమస్యలకు జీలకర్ర వాటర్‌ ఎంతో ఉపయోగపడుతుంది. దీనిని ఒక గ్లాస్‌ నీటిలో తీసుకొని, వేడి చేసి తీసుకోవడం వల్ల ఈ సమస్యలు అన్ని మాయం అవుతాయి. అయితే జీలకర్ర వాటర్‌ శ్వాస సంబంధిత సమస్యలను కూడా తగ్గిస్తుంది. 

యాలక్కాయ  పొడి:

యాలక్కాయ  కూడా అజీర్ణానికి  చాలా  ఉపయోగకరంగా  ఉంటుంది. ఒక గ్లాస్‌లో యాలక్కాయ పొడిచ, పెరుగులో కలిపి తీసుకోవడం వల్ల జీర్ణ ఎంజైమ్‌లు మెరుగుపడుతాయి. అంతేకాకుండా తిన్న ఆహారం తర్వాగా జీర్ణం అవుతుంది. 

శొంఠితో టీ:  

శొంఠి టీ ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తుంది. దీని ఆయుర్వేదలో కూడా ఔషధంగా ఉపయోగిస్తారు. అయితే గ్యాస్‌, అజీర్తి సమస్యలతో బాధపడుతున్నప్పుడు తీసుకోవడం వల్ల సమస్యల నుంచి ఉపశమనం కలిగిస్తుంది. 

మజ్జిగ:

మజ్జిగలోని  ప్రోబయోటిక్స్ గుణాలు కలిగి ఉంటుంది. దీని తీసుకోవడం వల్ల  జీర్ణవ్యవస్థ  మెరుగుపడుతుంది. అంతేకాకుండా ఇది మంచి  బాక్టీరియాని అభివృద్ధి చేస్తుంది. దీని కారణంగా తిన్న ఆహారం జీర్ణం అవుతుంది. 

యాపిల్ పండు:  

పండ్లు తీసుకోవడం వల్ల శరీరానికి ఎంతో మేలు కలుగుతుంది. యాపిల్‌ పండు తీసుకోవడం వల్ల ఎన్నో ప్రయోజనాలు కలుగుతాయి. ఇందులో ఉండే పెక్టిన్ అనే సాల్యుబుల్ ఫైబ‌ర్ జీర్ణ స‌మ‌స్య‌లు రాకుండా చూస్తుంది. 

సోంపు:

సోంపు తీసుకోవడం వల్ల తిన్న ఆహారం సులువుగా జీర్ణం అవుతుంది. అంతేకాకుండా ఇందులో ఉండే ఫైబర్‌ ఆహారానికి జీర్ణం చేస్తుంది. అలాగే క‌డుపు నొప్పి, అజీర్ణం, గ్యాస్ రాకుండా చేస్తుంది. 

బొప్పాయి పండు:

బొప్పాయి పండు జీర్ణసమస్యలకు చక్కటి పరిష్కరం అని ఆరోగ్యనిపుణులు చెబుతున్నారు. దీని తిన్న తరువాత తీసుకోవడం వల్ల పేగులో మ‌లం క‌ద‌లిక‌ను స‌రి చేస్తుంది.  దీంతో మ‌ల‌బ‌ద్ద‌కం సమస్యకు చెక్‌ పెట్టవచ్చు. 

Also Read Free Fire MAX Free Download: ఫ్రీ డైమాండ్స్‌, కరెన్సీతో Garena Free Fire MAXని ఫ్రీగా డౌన్‌లోడ్ చేసుకోండి!

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U

ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 

TwitterFacebookసోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి

Trending News