Child Marriage News: 13 ఏళ్ల బాలికతో 45 ఏళ్ల వ్యక్తికి పెళ్లి.. అర్ధరాత్రి అరాచకం

Child Marriage News: నిజామాబాద్ జిల్లా నవీపేట మండలం అబ్బాపూర్ తండాలో శుక్రవారం అర్ధరాత్రి దారుణం చోటుచేసుకుంది. గుట్టుచప్పుడు కాకుండా అర్థరాత్రి వేళ 13 ఏళ్ల మైనర్ బాలికను 45 ఏళ్ల సాయబ్ రావ్ అనే వ్యక్తికి ఇచ్చి బాల్య వివాహాం జరిపించారు అక్కడి పెద్దలు.

Written by - Pavan | Last Updated : Jul 9, 2023, 11:19 PM IST
Child Marriage News: 13 ఏళ్ల బాలికతో 45 ఏళ్ల వ్యక్తికి పెళ్లి.. అర్ధరాత్రి అరాచకం

Child Marriage News: నిజామాబాద్ జిల్లా నవీపేట మండలం అబ్బాపూర్ తండాలో శుక్రవారం అర్ధరాత్రి దారుణం చోటుచేసుకుంది. గుట్టుచప్పుడు కాకుండా అర్థరాత్రి వేళ 13 ఏళ్ల మైనర్ బాలికను 45 ఏళ్ల సాయబ్ రావ్ అనే వ్యక్తికి ఇచ్చి బాల్య వివాహాం జరిపించారు అక్కడి పెద్దలు. ఈ పెళ్లికి స్థానిక ఎంపీటీసీ భర్త శంకర్ పెద్దరికం చేసినట్టు ఈ బాల్య వివాహం జరిపించిన పంతులు తెలిపారు. ఈ బాల్య వివాహంను ఐద్వా మహిళ సంఘాలు, తండా వాసులు అడ్డుకున్నప్పటికీ.. పెళ్లి పెద్దలు వారిని ఎదిరించి ఆ 13 ఏళ్ల చిన్నారి బాలికను 45 ఏళ్ల సాయబ్ రావ్ వెంట పంపించడం స్థానికంగా తీవ్ర కలకలం సృష్టించింది. 

ఈ ఘటనపై అర్థరాత్రి వరకు దగ్గరుండి పెళ్లి జరిపించిన స్థానిక మహిళా ఎంపీటీసీ భర్త అయిన శంకర్ తో పాటు 60 వేలు ఎదురు కట్నం తీసుకుని స్వయంగా తన కూతురు జీవితాన్నే ఫణంగా పెట్టి ఈ పెళ్లి చేయడంతో ఆమె గొంతు కోసిన తండ్రి, అలాగే ఈ పెళ్లి జరిపించిన పంతులుపై ఐద్వా సంగం నేతలు పోలీసులకు ఫిర్యాదు చేశారు. 45 ఏళ్ల సాయాబ్ రావ్ అనే వ్యక్తికి 13 ఏళ్ల బాలికను ఇచ్చి బాల్య వివాహం చేశారని.. ఈ వివాహానికి సహకరించిన ఎంపీటీసీ భర్తతో పాటు పెళ్లి జరిపించిన పంతులును కూడా అరెస్ట్ చేసి రిమాండ్ కి తరలించాలని ఐద్వా నేతలు డిమాండ్ చేశారు. 

ఇది కూడా చదవండి : Suicide By Cutting off His Penis: షాకింగ్ న్యూస్.. పురుషాంగం కోసుకుని ఎంబీబీఎస్ స్టూడెంట్ సూసైడ్

ఈ బాల్య వివాహానికి కారణమైన ఎంపీటీసీ భర్తను, పంతులును అరెస్ట్ చేయకుండా వదిలేస్తే .. వారి కారణంగా ఇంకొంత మంది చిన్నారులు బాల్య వివాహాలు బారిన పడి జీవితాలు నాశనం అవుతాయని ఐద్వా నేతలు ఆందోళన వ్యక్తంచేశారు. అర్థరాత్రి పెళ్లి చేసుకొని వెళుతున్న పెళ్ళికొడుకు వాహనాన్ని స్థానికులు అడ్డుకోగా... ప్రస్తుతం ఆ దృశ్యాలు వాట్సాప్ సహా అన్ని సామాజిక మాధ్యమాల్లో వైరల్ అవుతున్నాయి. అబ్బాపూర్ తండాలో జరిగిన ఈ బాల్య వివాహం ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.

ఇది కూడా చదవండి : Teacher Eloped With Student: విద్యార్థినితో టీచరమ్మ లైంగిక సంబంధం, అదృశ్యం.. అరెస్ట్

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

ఆండ్రాయిడ్ లింక్ -  https://bit.ly/3P3R74U 

ఆపిల్ లింక్ -  https://apple.co/3loQYe 

మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండిTwitter , FacebooK

Trending News