నిజామాబాద్‌లో ఉద్రిక్తత నెలకొంది. 'కరోనా వైరస్' ఉద్ధృతి నేపథ్యంలో పోలీసులు లాక్ డౌన్ ను పకడ్బందీగా అమలు చేస్తున్నారు. మరోవైపు ఢిల్లీ సహా ఇతర ప్రాంతాల్లో తబ్లీగీ జమాత్ మత ప్రార్థనలకు హాజరైన వారు స్వచ్ఛందంగా వైద్యులకు సహకరించాలని చెప్పినా పట్టించుకోవడం లేదు.
దీంతో వారి కోసం పోలీసులు వేట కొనసాగిస్తున్నారు. ఎవరెవరు మత ప్రార్థనలకు హాజరయ్యారో జాడ తెలుసుకుని వారి ఇళ్లకు వెళ్లి వారిని బలవంతంగా ఆస్పత్రులకు తరలిస్తున్నారు. ఈ క్రమంలో పోలీసులకు స్థానికులు అడ్డుపడుతున్న ఘటనలు జరుగుతున్నాయి.
ఈ రోజు ఉదయం అలాంటి ఘటనే జరిగింది. రెడ్ జోన్ గా గుర్తించిన ఆటోనగర్ ప్రాంతంలో ఓ కుటుంబ సభ్యులను క్వారంటైన్ కు తరలించేందుకు పోలీసులు అక్కడికి వెళ్లారు. వారిని తీసుకుని ఆస్పత్రికి తరలిస్తుండగా.. నిజామాబాద్ డిప్యూటీ మేయర్ మహ్మద్ ఇంద్రిస్ ఖాన్, ఆయన అనుచరులు .. పోలీసులను అడ్డుకున్నారు.
ముస్లిం కుటుంబ సభ్యులను క్వారంటైన్ కు తీసుకువెళ్లవద్దని కోరారు. అంతే కాదు పోలీసులతో వాగ్వాదానికి దిగారు. దీంతో పోలీసులు డిప్యూటీ మేయర్ మహ్మద్ ఇంద్రిస్ ఖాన్ తోపాటు ఆయన అనుచరులు 10 మందిపై కేసులు నమోదు చేశారు. రెడ్ జోన్ ప్రాంతంలోకి రావడం, అధికారుల విధులకు ఆటంకం కలిగించడం కారణంగా కేసులు నమోదు చేసినట్లు పోలీసులు తెలిపారు. జీ హిందుస్తాన్ తెలుగు టీవీ లైవ్ లింక్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి. Watch Zee Hindustan Telugu live here..
నిజామాబాద్‌లో ఉద్రిక్తత