Gang Rape: వివాహితకు మత్తు ఇచ్చి అయిదుగురు యువకుల అత్యాచారం

వయసుతో సంబంధం లేకుండా మహిళలపై అఘాయిత్యాలు జరుగుతున్నాయి, ఇటీవల ఒక వివాహితపై ఆటో డ్రైవర్లు చేసిన హత్యాచారం చర్చనీయాంశం అయింది.  ఈ ఉదంతం వరంగల్ జిల్లాలో జరిగింది. ఆ వివరాలు..

Written by - ZH Telugu Desk | Last Updated : May 3, 2023, 07:33 PM IST
Gang Rape: వివాహితకు మత్తు ఇచ్చి అయిదుగురు యువకుల అత్యాచారం

Gang Rape: వయసుతో సంబంధం లేకుండా కామాంధులు అఘాయిత్యాలకు పాల్పడుతున్నారు. చిన్న పిల్లల నుండి ముసలి వాళ్ల వరకు కూడా ఆడది అయితే చాలు అన్నట్లుగా కొందరు కామాంధులు అత్యంత రాక్షసంగా ప్రవర్తిస్తున్నారు. గత వారం వరంగల్ జిల్లా పరిధిలో వివాహిత పై జరిగిన అత్యాచారం స్థానికంగా చర్చనీయాంశం అయ్యింది. 

మత్తు మందు ఇచ్చి అయిదుగురు యువకులు వివాహితను అత్యంత దారుణంగా చెరిచారు. మామునూరు ఏసీపీ తాళ్లపల్లి కృపాకర్ ఈ కేసు విచారణ చేపట్టారు. ఆయన చెప్పిన వివరాలు ఆశ్చర్యంను కలిగిస్తున్నారు. ఈ సమయంలోనే పలు అనుమానాలు కూడా వ్యక్తం అవుతున్నాయి. స్థానికులు మరియు బాధితురాలి బంధువులు అత్యాచార సంఘటనపై ఆందోళనకు దిగుతున్నారు. 

ఏసీపీ వెళ్లడించిన వివరాల ప్రకారం.. వరంగల్ లోని పైడిపల్లి లో నివాసం ఉంటున్న వివాహిత హనుమకొండలోని ఒక కర్రీ పాయింట్ లో ఉద్యోగం చేస్తోంది. ఏప్రిల్‌ 20వ తారీకున స్నేహితురాలిని కలిసేందుకు భర్తతో కలిసి ఆరెపల్లికి వెళ్లింది. అక్కడ స్నేహితురాలు కలవడంతో భర్తను వెనక్కి పంపించింది. అక్కడ స్నేహితురాలితో కలిసి బాధిత మహిళ ఒక కారు ఎక్కింది. 

కారులో రవి, నాగరాజు ఉన్నారు. కారును ములుగు జిల్లా వైపు తీసుకు వెళ్లారు. కొద్ది దూరం వెళ్లిన తర్వాత వివాహిత స్నేహితురాలు ఏదో కారణం చెప్పి కారు నుండి దిగి పోయింది. అక్కడే కారులో రమేష్‌.. లక్ష్మణ్‌.. సుధాకర్ అనే ముగ్గురు యువకులు కారు ఎక్కారు. అక్కడ నుండి కొద్ది దూరం వెళ్లిన తర్వాత వివాహిత కి మత్తు మందు ఇచ్చారు.

Also Read: Taraka Ratna Wife : ఈ జన్మకి నువ్వే నా ప్రాణం.. చచ్చే వరకు ప్రేమిస్తూనే ఉంటా.. తారకరత్నపై అలేఖ్య పోస్ట్

మత్తులో ఉన్న వివాహితపై అయిదుగురు ఒకరి తర్వాత ఒకరు అన్నట్లుగా అత్యాచారంకు పాల్పడ్డారు. ఈ విషయాన్ని ఎక్కడ చెప్పినా కూడా చంపేస్తామని బెదిరించి ములుగు లో వరంగల్ బస్సు ఎక్కించారు. ఆరెపల్లి వద్ద బస్సు దిగిన బాధితురాలు భర్తకు ఫోన్‌ చేయగా ఎందుకు ఆలస్యం అయ్యిందని మందలించాడు. దాంతో ఆమె అటు నుంచి అటు తల్లి ఇంటికి వెళ్లింది. 

కరీంనగర్ లోని రామడుగులో ఉండే తల్లి వద్దకు వెళ్లిన బాధిత మహిళ ఇటీవల కుల పెద్దలతో కలిసి భర్త వద్దకు వెళ్లింది. ఈ వివాదం పోలీసుల వద్దకు వెళ్లడం.. ఆ తర్వాత తనను అయిదుగురు యువకులు అత్యాచారం చేశారు అంటూ పోలీసులకు బాధితురాలు ఫిర్యాదు ఇవ్వడం జరిగింది. కేసు నమోదు చేసిన పోలీసులు నిందితులను అరెస్ట్‌ చేశారు. బాధితురాలి స్నేహితురాలు కోసం పోలీసులు వెదుకుతున్నారు. ఈ కేసు విచారణ విషయంలో ఉన్నతాధికారులు చాలా సీరియస్ గా ఉన్నట్లుగా తెలుస్తోంది.

Also Read: Horrible Road Accident: భయంకరమైన రోడ్డు యాక్సిడెంట్.. పోలీసు వాహనాన్ని ఢీకొన్న కారు

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.

ఆండ్రాయిడ్ లింక్ -  https://bit.ly/3P3R74U

ఆపిల్ లింక్ -  https://apple.co/3loQYe

మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి TwitterFacebook

Trending News