Horrible Road Accident: భయంకరమైన రోడ్డు యాక్సిడెంట్.. అతి వేగంగా వచ్చి పోలీసుని ఢీకొట్టిన కారు

Horrible Road Accident Caught on Camera: పెట్రోలింగ్ విధుల్లో ఉన్న పోలీసు ఆఫీసర్ ఓ బిఎండబ్లూ కారుని ఆపి తనిఖీలు చేస్తూ డ్రైవర్‌ని వివరాలు అడిగి తెలుసుకుంటున్నాడు. ఇంతలోనే కీసుమంటూ భారీ శబ్ధంతో డ్రిఫ్టింగ్ చేస్తూ అదుపు తప్పిన మరో బీఎండబ్లూ కారు తమ వైపే దూసుకురావడం గమనించిన పోలీసు ఆఫీసర్‌కి అక్కడి నుంచి తప్పించుకునే వ్యవధి కూడా లేకపోయింది. ఆ తరువాత ఏం జరిగిందో మీరే చూడండి

Written by - Pavan | Last Updated : May 3, 2023, 04:58 PM IST
Horrible Road Accident: భయంకరమైన రోడ్డు యాక్సిడెంట్.. అతి వేగంగా వచ్చి పోలీసుని ఢీకొట్టిన కారు

Horrible Road Accident Caught on Camera: నిత్యం ఎన్నో రోడ్డు యాక్సిడెంట్స్ జరుగుతుంటాయి. కానీ అన్నిసార్లు ఆ యాక్సిడెంట్స్‌కి సంబంధించిన లైవ్ ఫుటేజ్ వీడియోలు మనకు దొరికే ఛాన్స్ ఉండదు. ఒకవేళ అలా యాక్సిడెంట్ వీడియోలు లభించినా.. అన్నిసార్లు అవి మన దృష్టిని ఒకచోట ఆగిపోయేలా చేయకపోవచ్చు. కానీ ఇదిగో ఈ యాక్సిడెంట్‌కి సంబంధించిన వీడియో మాత్రం కచ్చితంగా మీ అటెన్షన్‌ని క్యాచ్ చేయడమే కాదు.. ప్రమాదం ఎప్పుడు, ఎటువైపు నుంచి వస్తుందో మనకు తెలిసే అవకాశం కూడా లేదు అని అనిపించేలా చేస్తుంది. అంతేకాదు.. ఈ వీడియోని మళ్లీ మళ్లీ చూస్తే మీ గుండె వేగం పెంచేలా చేస్తుంది.

పెట్రోలింగ్ విధుల్లో ఉన్న ఒక పోలీసు ఆఫీసర్ తన విధుల్లో భాగంగా ఒక బీఎండబ్లూ కారుని ఆపి కారుని తనిఖీ చేస్తుండగా అతడికి ఎదురైన భయంకరమైన అనుభవం ఇది. అమెరికాలోని వర్జీనియా రాష్ట్రంలో ఫేయిర్ ఫాక్స్ కౌంటీలో జరిగిన ఈ ఘటనకు సంబంధించిన వివరాలు ఇలా ఉన్నాయి. ఫెయిర్ ఫాక్స్ లోని పార్క్‌వే మార్గంలో పెట్రోలింగ్ విధుల్లో ఉన్న పోలీసు ఆఫీసర్ ఓ బిఎండబ్లూ కారుని ఆపి తనిఖీలు చేస్తూ డ్రైవర్ ని వివరాలు అడిగి తెలుసుకుంటున్నాడు. ఇంతలోనే కీసుమంటూ భారీ శబ్ధంతో డ్రిఫ్టింగ్ చేస్తూ అదుపు తప్పిన మరో బీఎండబ్లూ కారు తమ వైపే దూసుకురావడం గమనించిన పోలీసు ఆఫీసర్ కి అక్కడి నుంచి తప్పించుకునే వ్యవధి కూడా లేకపోయింది. అయినప్పటికీ అక్కడి నుంచి ఆ వెనుకే ఆగి ఉన్న తన కారువైపు పరుగెత్తబోయాడు. కానీ కళ్లు మూసి తెరిసినంతలోపే మెరుపు వేగంతో దూసుకొచ్చిన కారు తన ముందున్న బీఎండబ్లూ కారును ఢీకొట్టింది. అంతటితో ఆ కారు వేగం అదుపులోకి రాకపోవడంతో అక్కడి నుంచి వచ్చి పోలీసు ఆఫీసర్ పెట్రోలింగ్ వాహనాన్ని ఢీకొట్టింది. పోలీసు ఆఫీసర్ వాహనాన్ని ఢీకొట్టడానికంటే ముందుగా లైట్‌గా పోలీసు ఆఫీసర్ ని కూడా తాకింది. 

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

ఆండ్రాయిడ్ లింక్ -  https://bit.ly/3P3R74U 

ఆపిల్ లింక్ -  https://apple.co/3loQYe 

మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండిTwitter , FacebooK

Trending News