Rajasthan Girl Murder Case: బాలికపై సామూహిక హత్యాచారం.. కుమార్తె చితిలోకి దూకేసిన తండ్రి

Bhilwara Gang Rape And Murder Case: రాజస్థాన్‌లోని భిల్వారా జిల్లాలో హృదయవిదారక ఘటన వెలుగులోకి వచ్చింది. కుమార్తె అంత్యక్రియల్లో చితిపై దూకి తండ్రి ఆత్మహత్యయత్నం చేశాడు. బాలికపై కామాంధులు సామూహిక అత్యాచారానికి పాల్పడి.. అతి కిరాతంగా హత్య చేశారు.  

Written by - Ashok Krindinti | Last Updated : Aug 8, 2023, 08:27 AM IST
Rajasthan Girl Murder Case: బాలికపై సామూహిక హత్యాచారం.. కుమార్తె చితిలోకి దూకేసిన తండ్రి

Bhilwara Gang Rape And Murder Case: కుమార్తెపై సామూహిక హత్యాచారాన్ని అతను భరించలేకపోయాడు. అల్లారుముద్దుగా పెంచుకున్న తన బంగారు తల్లికి జరిగిన అన్యాయాన్ని తట్టుకోలేకపోయాడు. తన కూతురులేని జీవితం తనకు వ్యర్థమనుకున్నాడు. కుమార్తె అంత్యక్రియలు నిర్వహిస్తున్న సమయంలో చితిలోకి దూకి ఆత్మహత్య చేసుకునేందుకు ప్రయత్నించాడు. పక్కన ఉన్నవారు వెంటనే పక్కకు లాగి.. ఆసుపత్రికి తరలించారు. కన్నీరు పెట్టించే ఈ ఘటన రాజస్థాన్‌లోని భిల్వారా జిల్లాలో సోమవారం చోటుచేసుకుంది. పూర్తి వివరాలు ఇలా..

భిల్వారా జిల్లాలోని ఒక గ్రామంలో ఈ నెల 2వ తేదీన ఓ బాలిక (14) పశువులను మేపేందుకు వెళ్లి అదృశ్యమైంది. బాలిక ఎత్తుకెళ్లిన కామంధులు అత్యాచారానికి పాల్పడ్డారు. అనంతరం అదేరోజు రాత్రి బాలికను దారుణంగా హత్య చేసి.. మృతదేహాన్ని బొగ్గుల కొలిమిలో కాల్చారు. బాలిక ఆనవాళ్లు లేకుండా చేసేందుకు సగం కాలిన శరీర భాగాలను చెరువులో విసిరేశారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు.. గుర్తుపట్టలేని స్థితిలో ఉన్న బాలిక శరీర భాగాలను స్వాధీనం చేసుకున్నారు. మృతదేహాన్ని బాధితు కుటుంబ సభ్యులకు అప్పగించారు. అంత్యక్రియలు నిర్వహించడానికి ఏర్పాట్లు చేస్తుండగా.. బాలిక తండ్రి అప్పటివరకు మౌనంగా రోదించాడు. చితికి నిప్పంటించిన తరువాత ఆ తండ్రి హృదయ తల్లడిల్లిపోయింది. 

వెంటనే కుమార్తె చితిలోకి దూకేశాడు. అక్కడ ఉన్న వారు గమనించి.. మంటల్లో నుంచి అతడిని బయటకు లాగారు. చికిత్స నిమిత్తం జిల్లా ఆస్పత్రికి తరలించారు. ప్రస్తుతం అతని ఆరోగ్య పరిస్థితి నిలకడగా ఉందని ప్రభుత్వ మహాత్మా గాంధీ ఆసుపత్రి డైరెక్టర్ డాక్టర్ అరుణ్ గౌర్ తెలిపారు. ప్రాణపాయ స్థితి నుంచి బయటపడ్డారని చెప్పారు. మంటల్లో నుంచి తక్షణమే లాగడంతో ప్రాణాలకు ముప్పువాటిల్లలేదన్నారు.

బాలికపై సామూహిక అత్యాచార ఘటనను భిల్వారా పోలీసులు సీరియస్‌గా తీసుకున్నారు. ఈ ఘటనకు సంబంధించి ఆరుగురు పురుషులు, నలుగురు మహిళలను నిందితులుగా గుర్తించినట్లు భిల్వారా ఎస్పీ ఆదర్శ్ సిద్ధూ వెల్లడించారు. కేసులో నిర్లక్ష్యంగా వ్యహరించినట్లు కోట్రా ఏఎస్‌ఐపై ఆరోపణలు రాగా.. వెంటనే సస్పెన్షన్‌ వేటు వేసినట్లు తెలిపారు. ఇది అత్యంత అరుదైన కేసు అని..  నిందితులకు మరణశిక్ష విధించేలా అన్ని ప్రయత్నాలు చేస్తామని చెప్పారు. ఫాస్ట్ ట్రాక్ కోర్టు ద్వారా విచారణ జరిపి.. శిక్ష పడేలా చూస్తామని హామీ ఇచ్చారు. 

Also Read: Ind vs WI 3rd T20 Updates: విండీస్‌తో నేడే మూడో టీ20.. ఓడితే సిరీస్ గోవిందా..!  

Also Read: Child Marriage: రూ.25 వేలకు ఆశపడి కూతురికి బాల్య వివాహం.. ట్విస్ట్ ఇచ్చిన బాలిక..!   

 

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U

ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 

TwitterFacebook సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి 

Trending News