Khammam: అధికారుల నిర్లక్ష్యం.. మున్నేరు నదిలో ముగ్గురు చిన్నారులు జలసమాధి

Three Children Drowned To Death In Munneru River: వేసవికాలం సెలవులు మూడు కుటుంబాల్లో తీవ్ర విషాదం నింపింది. సరదాగా ఈతకు వెళ్లిన ముగ్గురు చిన్నారులు ప్రమాదవశాత్తు నీటిలో మునగి చనిపోయారు. 

Written by - Ravi Kumar Sargam | Last Updated : May 9, 2024, 07:01 PM IST
Khammam: అధికారుల నిర్లక్ష్యం.. మున్నేరు నదిలో ముగ్గురు చిన్నారులు జలసమాధి

Swimming To Death: విద్యాలయాలకు వేసవి సెలవులు కావడంతో విద్యార్థులు సరదాగా ఆడిపాడుతున్నారు. ఈ క్రమంలో గ్రామంలోని జలాశయాలకు వెళ్లి ఈతకు వెళ్తూ సరదాగా గడుపుతున్నారు. ఇలా ఈతకు వెళ్లిన ముగ్గురు చిన్నారులు జల సమాధి అయ్యారు. ఈ ఘటనతో మూడు కుటుంబాల్లో తీవ్ర విషాదం అలుముకుంది. అయితే ఆ ప్రమాదం అధికారుల నిర్లక్ష్యం కారణంగా జరగడంతో తీవ్ర విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ఈ సంఘటన ఖమ్మం జిల్లాలో చోటుచేసుకుంది.

Also Read: Maharashtra: యూట్యూట్‌ నటుడు నిర్వాకం.. ముఖ్యమంత్రి కాన్వాయ్‌లోకి దూసుకెళ్లడంతో కలకలం

 

ఖమ్మం జిల్లా దంసలాపురంలో మున్నేరు నది ఉంది. అక్కడ మున్నేరు నదిపై బ్రిడ్జి నిర్మాణం జరుగుతోంది. పనుల్లో భాగంగా బ్రిడ్జి కోసం పెద్ద గుంట తవ్వారు. అందులో నీరు నిలిచి బావిలోకి మారింది. ఖమ్మం పట్టణం 20వ డివిజన్‌కు చెందిన అందాల చిరంజీవి మున్నేరులో చేపలు పట్టేందుకు వెళ్లాడు. తన వెంట ఇద్దరు కొడుకులు లోకేశ్‌, హరీశ్‌తోపాటుమరో బాలుడు బానోత్ గణేశ్‌ తీసుకెళ్లారు.

Also Read: Singanamala: ప్రచారంలో ఎండదెబ్బ.. మంచానికి పరిమితమైన శింగనమల టీడీపీ అభ్యర్థి

 

నీటి కుంటలో ముగ్గురు బాలురు ఈత కొడుతున్నారు. అయితే ప్రమాదవశాత్తు ఆ చిన్నారులు నీటిలో మునిగిపోయారు. ఈత కోసం వెళ్లిన పిల్లలు ఇంకా రాకపోవడంతో చిరంజీవి ఆ గుంట వద్దకు వెళ్లారు. ఆ ముగ్గురు పిల్లలు నీటిలో తేలుతుండడంతో తీవ్ర భయాందోళన చెందాడు. వెంటనే స్థానికులను పిలిపించి వారిని బయటకు తీసుకొచ్చారు. అయితే అప్పటికే ఆ చిన్నారులు కన్నుమూశారు. ఈ సంఘటన స్థానికంగా తీవ్ర విషాదం నింపింది.

అధికారుల నిర్లక్ష్యం..
మున్నేరు నదిపై బ్రిడ్జి నిర్మాణం పనులతోనే ఈ ప్రమాదం జరిగిందని బాధిత కుటుంబసభ్యులు, స్థానికులు ఆరోపిస్తున్నారు. గ్రీన్ ఫీల్డ్ హైవే నిర్మాణంలో భాగంగా బ్రిడ్జి పిల్లర్ కోసం గుంటలు తీసి అలాగే వదిలేశారనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. ఏళ్లు గడుస్తున్నా పనులు చేయకపోవడంతో గుంటల్లో నీళ్లు నిలిచి ఇలా ప్రమాదాలు చోటుచేసుకుంటున్నాయని వాపోతున్నారు. వెంటనే పనులు చేయాలని స్థానికులు డిమాండ్‌ చేస్తున్నారు. ఈ సంఘటనపై పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U

ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 

సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి FacebookTwitter

Trending News