BJP MLA: మైనర్ బాలికపై బీజేపీ ఎమ్మెల్యే అత్యాచారం.. 25 ఏళ్లు జైలు శిక్ష

UP BJP MLA Rape Case: మైనర్ బాలికపై అత్యాచారానికి పాల్పడిన ఎమ్మెల్యేకు 25 ఏళ్ల జైలు శిక్ష, రూ.10 లక్షల జరిమానా విధించింది కోర్టు. తొమ్మిదేళ్ల క్రితం ఈ సంఘటన చోటు చేసుకోగా.. ఈ కేసులో ఎమ్మెల్యే దోషిగా తేలడంతో కోర్టు శిక్ష విధించింది. పూర్తి వివరాలు ఇలా..  

Written by - Ashok Krindinti | Last Updated : Dec 16, 2023, 12:11 PM IST
BJP MLA: మైనర్ బాలికపై బీజేపీ ఎమ్మెల్యే అత్యాచారం.. 25 ఏళ్లు జైలు శిక్ష

UP BJP MLA Rape Case: మైనర్ బాలికపై అత్యాచారం కేసులో బీజేపీ ఎమ్మెల్యే రాందులార్‌ గోండ్‌కు యూపీ హైకోర్టు 25 ఏళ్ల కఠిన కారాగార శిక్షను విధించింది. తొమ్మిదేళ్ల క్రితం బాలికపై అత్యాచారం కేసులో తాజాగా తీర్పును వెల్లడించింది. కోర్టు జైలు శిక్షతో ఆయన శాసన సభ సభ్యత్వంపై అనర్హత వేటు పడే అవకాశం ఉంది. ప్రజా ప్రాతినిధ్య చట్టం ప్రకారం.. రెండు సంవత్సరాలు లేదా అంతకంటే ఎక్కువ కాలం జైలు శిక్ష విధిస్తే.. ఆ రోజు నుంచి మరో ఆరేళ్ల వరకు ఎన్నికల్లో పోటీ చేసేందుకు అనర్హులుగా ఉంటారు.

సోన్‌భద్రలోని ఎంపీ, ఎమ్మెల్యే కోర్టు అదనపు జిల్లా సెషన్ జడ్జి అహ్సన్ ఉల్లా ఖాన్ ఈ కేసులో తీర్పునిస్తూ.. దుద్ది అసెంబ్లీ నియోజకవర్గం ఎమ్మెల్యే గోండుకు 10 లక్షల రూపాయల జరిమానాతోపాటు జైలు శిక్ష విధించారు. ఆ డబ్బులను బాధితురాలికి అందజేయాలని ఆదేశిచారు. డిసెంబర్ 12న  ఎమ్మెల్యేను దోషిగా కోర్టు నిర్ధారించిందని స్పెషల్ పబ్లిక్ ప్రాసిక్యూటర్ సత్యప్రకాష్ త్రిపాఠి వెల్లడించారు. తీర్పు వెలువడే ముందు ఎమ్మెల్యే తరఫున న్యాయవాది వాదిస్తూ.. ఎమ్మెల్యేకు శిక్ష తగ్గించాలని.. అత్యాచార బాధితురాలి కుటుంబ సంక్షేమానికి తన క్లయింట్ పూర్తి బాధ్యత తీసుకుంటాడని కోర్టుకు హామీ ఇచ్చాడు. 

సత్యప్రకాష్‌ త్రిపాఠి మాట్లాడుతూ.. ఈ సంఘటన నవంబర్ 4, 2014న జరిగిందని తెలిపారు. గోండ్‌పై 376 (అత్యాచారం), 506 (నేరమైన బెదిరింపులకు శిక్ష),  లైంగిక నేరాల (పోక్సో) చట్టం కింద అభియోగాలు మోపారని చెప్పారు. సంఘటన జరిగిన సమయంలో గోండ్ భార్య గ్రామ సర్పంచ్‌గా ఉన్నారు. బాధితురాలి సోదరుడు ఫిర్యాదు చేయడంతో మైయోర్‌పూర్ పోలీసులు అప్పట్లో కేసు నమోదు చేసి దర్యాప్తు చేశారు. ఘటన జరిగినప్పుడు గోండ్ ఎమ్మెల్యేగా లేరు. మొదట్లో పోక్సో కోర్టులో విచారణ జరిగింది. అయితే ఆయన ఎమ్మెల్యేగా ఎన్నికైన తర్వాత కేసు ఫైల్‌లు తదనంతరం MP-MLA కోర్టుకు బదిలీ అయింది. 

విచారణలో బాలిక 1998లో పుట్టిందని ప్రాసిక్యూషన్ వాదించగా.. ఎమ్మెల్యే 1994లో పుట్టిందని పాఠశాల పత్రాలను సమర్పించారని త్రిపాఠి తెలిపారు. గత తొమ్మిదేళ్లుగా ఎమ్మెల్యే, ఆయన సన్నిహితుల నుంచి కేసును ఉపసంహరించుకునేందుకు తాము ఎన్నో ఒత్తిళ్లు, బెదిరింపులు ఎదుర్కొన్నారని బాధిత కుటుంబం ఆరోపించింది. బాధితురాలి వయసు ప్రస్తుతం 25 ఏళ్లు. ఆమె భర్త, అత్తమామలతో నివసిస్తున్నారు. అసెంబ్లీ ఎన్నికలలో తన సమీప ప్రత్యర్థి సమాజ్‌వాదీ పార్టీ విజయ్ సింగ్‌ను ఓడించి గోండ్ ఎమ్మెల్యేగా ఎన్నికయ్యారు. తాజాగా జైలు శిక్ష పడడంతో ఆయనపై అనర్హత వేటు పడే అవకాశం ఉంది.

Also Read: ఈ సంవత్సరం అట్టర్ ఫ్లాప్ అయిన సినిమాలు ఇవే.. మరీ ఇంత దారుణంగా..!

Also Read: CM Revanth Reddy: సీఎం రేవంత్ రెడ్డి అనూహ్య నిర్ణయం.. ఆ ఇబ్బందులకు చెక్

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U

ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 

TwitterFacebook సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి

Trending News