Maulana Rapes Student in Madrasa: మదర్సలాలో మత్తు మందు ఇచ్చి విద్యార్థిపై అత్యాచారం

Maulana Rapes Student in Madrasa: తనకు ఆహారంలో మత్తు పదార్థాలు ఇచ్చిన మౌలానా.. తాను స్పహలో లేనప్పుడు, తన నిస్సహాయతను ఆసరగా తీసుకుని అత్యాచారం జరపడమే కాకుండా ఆ మొత్తం కీచక పర్వాన్ని వీడియో రికార్డు చేశాడు అని చెప్పుకుంటూ బాధితురాలు బోరుమంది.

Written by - ZH Telugu Desk | Last Updated : Jun 30, 2023, 04:17 PM IST
Maulana Rapes Student in Madrasa: మదర్సలాలో మత్తు మందు ఇచ్చి విద్యార్థిపై అత్యాచారం

Maulana Rapes Student in Madrasa: ముస్లిం విద్యార్థులకు విద్యాబుద్దులు నేర్పించే పవిత్రమైన మదర్సాలాలో దారుణం చోటుచేసుకుంది. ఒక విద్యార్థినికి మత్తు మందు ఇచ్చిన మౌలానా.. ఆమెపై దారుణంగా అత్యాచారానికి ఒడిగట్టాడు. అంతటి అరాచకంతో ఆగని మౌలానా.. ఆ బాధితురాలిపై అత్యాచార పర్వాన్ని వీడియో రికార్డు చేశాడు. ఉత్తర్ ప్రదేశ్ లో పేరొందిన మదర్సలాలలో ఈ దారుణం చోటుచేసుకుంది. తనకు జరిగిన ఘోరమైన అన్యాయం గురించి తెలుసుకున్న బాధితురాలు.. తనకు న్యాయం చేయండి అంటూ పోలీసులను ఆశ్రయించడంతో ఈ ఉదంతం వెలుగుచూసింది. 

విద్యా సంస్థల్లో విద్యార్థినులకు ఏ మేరకు భద్రత ఉందనే అంశాన్ని మరోసారి ప్రశ్నార్థకం చేసిన ఘటన ఇది. ఇస్లాంలో మతపరమైన బోధనలు నేర్పే మదర్సలాను ముస్లింలు అత్యంత పవిత్రంగా భావిస్తుంటారు. విద్యార్థిని విద్యార్థులకు విద్యాబుద్దులు నేర్పించే మౌలానాలను గురువులుగా గౌరవిస్తారు. అలాంటి హోదాలో ఉన్న వ్యక్తి తనపై తల్లిదండ్రులు చూపే నమ్మకాన్ని వమ్ము చేస్తూ ఈ కిరాతకానికి ఒడిగట్టాడు. తినే ఆహారంలో మత్తు పదార్థాలు కలిపి ఆపై అత్యాచారం జరిపాడు. బాధితురాలిని జీవితాంతం వేధించేలా ఆ పసి మనసుకు మానని గాయం చేశాడు.

తనకు ఆహారంలో మత్తు పదార్థాలు ఇచ్చిన మౌలానా.. తాను స్పహలో లేనప్పుడు, తన నిస్సహాయతను ఆసరగా తీసుకుని అత్యాచారం జరపడమే కాకుండా ఆ మొత్తం కీచక పర్వాన్ని వీడియో రికార్డు చేశాడు అని చెప్పుకుంటూ బాధితురాలు బోరుమంది. 

అతడు తీసుకున్న వీడియో అతడికే వ్యతిరేక సాక్ష్యమైంది..
నిందితుడు మౌలానా విద్యార్థినిపై జరిపిన అత్యాచార పర్వాన్ని వీడియో తీసుకోగా.. ప్రస్తుతం ఆ వీడియోనే కోర్టుకు సాక్ష్యంగా ఉపయోగపడనున్నట్టు తెలుస్తోంది. ఈ అత్యాచారం కేసు దర్యాప్తులో ఈ వీడియో కీలక సాక్ష్యంగా నిలవనుంది.

ఇది కూడా చదవండి : Buy 1, Get 1 free Offer Scams: ప్లేట్ మీల్స్ భోజనం ఖరీదు రూ. 90 వేలు

అరాచకంపై గళమెత్తిన స్థానికులు..
మదర్సలాలో ఇంతటి అరాచకం జరుగుతుంటే అక్కడి పరిపాలన వ్యవస్థ ఏం చేస్తోంది అంటూ స్థానికులు ఆగ్రహం వ్యక్తంచేశారు. మౌలానా అరాచకాలపై లోతైన దర్యాప్తు జరిపించాలి అని ప్రజా సంఘాలు డిమాండ్ చేశాయి.

ఇది కూడా చదవండి : Gang Rape: వివాహితకు మత్తు ఇచ్చి అయిదుగురు యువకుల అత్యాచారం

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

ఆండ్రాయిడ్ లింక్ -  https://bit.ly/3P3R74U 

ఆపిల్ లింక్ -  https://apple.co/3loQYe 

మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండిTwitter , FacebooK

Trending News