Gangubai Kathiawadi Release: ‘ఆర్ఆర్ఆర్’ మూవీ కోసం సంక్రాంతి రేసు నుంచి తప్పుకున్న ‘గంగూబాయి’

Gangubai Kathiawadi Release: సంజయ్ లీలా భన్సాలీ దర్శకత్వంలో అలియా భట్ ప్రధానపాత్రలో నటించిన చిత్రం ‘గంగూబాయి కతియవాడి’. ఈ చిత్ర విడుదల మరోసారి వాయిదా పడింది. సంక్రాంతి కానుకగా జనవరి 6న విడుదల కావాల్సిన ఈ చిత్రం.. ఫిబ్రవరి 18కి వాయిదా వేసింది చిత్రబృందం.

Written by - ZH Telugu Desk | Last Updated : Nov 15, 2021, 04:50 PM IST
    • మరోసారి ‘గంగూబాయి కతియవాడి’ సినిమా రిలీజ్ వాయిదా
    • ఫిబ్రవరి 18న సినిమాను రిలీజ్ చేయనున్నట్లు చిత్రబృందం ప్రకటన
    • దర్శకత్వం వహించిన సంజయ్ లీలా భన్సాలీ
Gangubai Kathiawadi Release: ‘ఆర్ఆర్ఆర్’ మూవీ కోసం సంక్రాంతి రేసు నుంచి తప్పుకున్న ‘గంగూబాయి’

Gangubai Kathiawadi Release: బాలీవుడ్ నటి అలియా భట్ ప్రధానపాత్రలో తెరకెక్కిన చిత్రం ‘గంగూబాయి కతియవాడి’.. ఇప్పుడు సంక్రాంతి రేసు నుంచి తప్పుకుంది. సంజయ్ లీలా భన్సాలీ దర్శకత్వంలో రూపొందిన ఈ చిత్రం తొలుత సంక్రాంతి కానుకగా థియేటర్లలో విడుదల అవ్వాల్సింది. అయితే అదే సమయంలో ’ఆర్ఆర్ఆర్ ’ , ’రాధేశ్యామ్’ వంటి పాన్ఇండియా చిత్రాలు రిలీజ్ కానున్నాయి. ఈ నేపథ్యంలో భారీ బడ్జెట్ చిత్రాలు వారం రోజుల వ్యవధిలో రిలీజ్ అయితే వచ్చే నష్టం అంతా ఇంతా కాదు. దీన్ని దృష్టిలో ఉంచుకున్న ’గంగూబాయి..’ నిర్మాత.. ఆ సినిమా విడుదలను ఫిబ్రవరి 18కి వాయిదా వేస్తున్నట్లు ప్రకటించారు. దీంతో ’ఆర్ఆర్ఆర్’ సినిమాకు పోటీ లేకుండా పోయింది.  

దర్శకధీరుడు రాజమౌళి (Rajamouli RRR movie) తెరకెక్కించిన యాక్షన్‌, ఎమోషనల్‌ డ్రామా 'ఆర్‌ఆర్‌ఆర్‌'. రామ్‌చరణ్‌-తారక్‌ (ntr ram charan rrr movie) ప్రధాన పాత్రల్లో నటించిన ఈ సినిమా విడుదల కోసం ప్రపంచవ్యాప్తంగా ఉన్న సినీ ప్రియులందరూ ఎంతో ఆతృతగా ఎదురుచూస్తున్నారు. సుమారు రూ.450 కోట్ల భారీ బడ్జెట్‌తో రూపుదిద్దుకుంటోన్న 'ఆర్‌ఆర్‌ఆర్‌' చిత్రాన్ని డీవీవీ ఎంటర్‌టైన్‌మెంట్స్‌ పతాకంపై దానయ్య నిర్మిస్తున్నారు. కీరవాణి స్వరాలు అందిస్తున్నారు. ఆలియాభట్‌ (RRR heroine), ఒలీవియా మోరీస్‌ కథానాయికలు. శ్రియ, సముద్రఖని, అజయ్‌ దేవ్‌గణ్‌ కీలకపాత్రల్లో కనిపించనున్నారు. 

Also Read: Samantha item song in Pushpa: పుష్ప మూవీలో సమంత ఐటం సాంగ్

Also Read: Vikram, Vijay Sethupathi: కమల్​ కథతో.. విక్రమ్​, విజయ్​ సేతుపతి మల్టీ స్టారర్​!

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు..  క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.

Android Link - https://bit.ly/3hDyh4G

Apple Link - https://apple.co/3loQYe 

మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook

 

Trending News