Vikram, Vijay Sethupathi: కమల్​ కథతో.. విక్రమ్​, విజయ్​ సేతుపతి మల్టీ స్టారర్​!

vikram, vijay sethupathi Multi starrer: కోలీవుడ్ అగ్రహీరోలు విక్రమ్, విజయ్ సేతుపతి ఒకే సినిమాలో నటించే అవకాశాలు కనిపిస్తున్నాయి. కమల్​ హాసన్ ఈ సినిమాకు స్టోరీ అందించన్నట్లు తెలుస్తోంది.

Written by - ZH Telugu Desk | Edited by - ZH Telugu Desk | Last Updated : Nov 15, 2021, 10:35 PM IST
  • ఓకే సినిమాలో విక్రమ్​, విజయ్​ సేతుపతి!
  • మల్టీస్టారర్​ స్క్రిప్ట్ రెడీ చేసిన కమల్​ హాసన్​!
  • త్వరలోనే సినిమాపై అధికార ప్రకటనకు అవకాశం
Vikram, Vijay Sethupathi: కమల్​ కథతో.. విక్రమ్​, విజయ్​ సేతుపతి మల్టీ స్టారర్​!

vikram, vijay sethupathi Multi starrer: తమిళంలో స్టార్​ హీరోలుగా ఉన్న విక్రమ్, విజయ్ సేతుపతి నటన పరంగా ఇద్దరూ ఇద్దరే. అలాంటిది వీరుద్దరూ ఒకే సినిమాలో కనిపిస్తే? అవును త్వరలోనే ఇది నిజమయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి.

విక్రమ్​, విజయ్ సేతుపతి మల్టీస్టార్​ను (vijay sethupathi in Vikram movie) తెరకెక్కించేందుకు తమిళ అగ్ర నటుడు కమల్​ హాసన్ ఓ స్క్రిప్ట్ తయారు చేస్తున్నారట. ఈ విషయంప కోలీవుడ్​ వర్గాల్లో ఇప్పటికే పెద్ద ఎత్తున చర్చ సాగుతోంది. ఈ సినిమాకు నిర్మాతగా కూడా కమల్​ వ్యవహరించే అవకాశలున్నాయి చెబుతున్నారు.

ఇప్పటికే ఈ సినిమాకోసం మహేశ్ నారాయణన్​ను డైరెక్టర్​గా ఎంపిక చేసినట్లు తెలిసింది. దీనిపై విక్రమ్​, విజయ్ సేతుపతిలతో చర్చలు సాగుతున్నాయని సమాచారం. ఈ స్క్రిప్ట్​కు ఈ ఇద్దరూ ఓకే చెప్పిన వెంటనే అధికారికంగా ప్రకటన వెలువడే అవకాశముంది. ఇందులో కమల్ కూడా ఓ చిన్న పాత్ర పోషించొచ్చని తెలుస్తోంది.

Also read: Mahesh-Rajmouli Combo: సమంత 'దూకుడు'.. మహేష్-జక్కన్న సినిమాలో హీరోయిన్‌గా సామ్..??

Also read: Cheating Case On Shilpa Shetty: ‘నా హక్కులను కాపాడండి’.. చీటింగ్ కేసుపై శిల్పాశెట్టి స్పందన

అభిమానుల్లో ఆసక్తి..

తమిళంలో విక్రమ్, విజయ్ సేతుపతిలకు నటన పరంగా మంచి గుర్తింపు ఉంది. అయితే ఈ ఇద్దరూ ఒకే సినిమాలో ఉంటే.. ఎవరు హీరో? ఎవరు విలన్ అనే విషయంపై సినిమా ప్రియులు చర్చించుకుంటున్నారు.

అయితే కొంత మంది విజయ్​ సేతుపతి విలన్​గా చేసే అవకాశముందంటున్నారు. ఇందుకు కారణం కూడా లేకపోలేదు. ఇప్పటికే పలు సినిమాల్లో విజయ్ సేతుపతి ప్రతి నాయకుడి పాత్రలు పోషించారు. మొత్తం మీద ఈ క్రేజీ ప్రాజెక్ట్​ మీద కోలీవుడ్​తో పాటు.. ఇండియన్​ సినిమా లవర్స్ భారీ అంచనాలు పెట్టుకుంటున్నారు.

Also read: Attack on Actress Shalu Chourasia: 'ఓ పిల్లా నీ వల్ల' సినిమాలో నటించిన హీరోయిన్ పై దాడి..

ఇప్పటికే కమల్​ స్వీయ నిర్మాణంలో 'విక్రమ్​' అనే సినిమా తెరకెక్కుతోంది. ఇందులో కమల్​, విజయ్ సేతుపతి, ఫహాద్​ ఫాజిల్ ప్రధాన పాత్రధారులు. ఈ చిత్ర టీజర్​ కూడా ఇప్పటికే విడుదలై.. ఆసక్తి పెంచుతోంది.

Also read: Ghani Movie Teaser: మెగా పవర్ స్టార్ వాయిస్ ఓవర్ తో.. వరుణ్ తేజ్ ‘గని’ టీజర్ వచ్చేసింది

Also read: Akhanda Trailer: ‘'మీకు సమస్య వస్తే దండం పెడతారు..మేము ఆ సమస్యకే పిండం పెడతాం'..అదిరిన 'అఖండ' ట్రైలర్

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు..  క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.

Android Link - https://bit.ly/3hDyh4G

Apple Link - https://apple.co/3loQYe 

మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook

Trending News