స్టార్ హీరోతో కృతి శెట్టి లిప్ లాక్.. ఇపుడిదే హాట్ టాపిక్ గురూ!

'ఉప్పెన' సినిమాతో కుర్రకారు హృదయాలను దోచుకున్న సుందరి కృతి శెట్టి.. 'శ్యామ్ సింగ రాయ్' టీజర్ లో నానికి లిప్ కిస్ తో అందరికి షాక్ ఇచ్చింది. ఇపుడు ఇదే హాట్ టాపిక్.. 

Written by - ZH Telugu Desk | Last Updated : Nov 18, 2021, 03:41 PM IST
  • విడుదలైన 'శ్యామ్ సింగ రాయ్' సినిమా టీజర్
  • లిప్ లాక్ ఇచ్చి షాకిచ్చిన హీరోయిన్ కృతి శెట్టి
  • ఇంటర్నెట్ లో హాట్ టాపిక్ గా కృతి శెట్టి లిప్ లాక్ ఫోటో
స్టార్ హీరోతో కృతి శెట్టి లిప్ లాక్.. ఇపుడిదే హాట్ టాపిక్ గురూ!

Actress Krithi Shetty Lip Lock Goes Viral: 'ఉప్పెన' (Uppena)సినిమాతో కుర్రకారు మొత్తాన్ని తనవైపు తిప్పుకున్న బెంగుళూరు భామ కృతి శెట్టి (Krithi Shetty).. ఒక్క సినిమాతోనే కృతి శెట్టి పేరు మారు మ్రోగిపోవటమే కాదు.. సౌత్ లో ఉన్న అన్ని ఫిల్మ్ ఇండస్ట్రీలను తనవైపు తిప్పుకుంది. ఉప్పెన సినిమాలో ఈ అమ్మడు అభినయానికి, అందానికి, నటనకు.. మూవీ మేకర్స్ వెతుక్కుంటూ వచ్చి మరీ ఆఫర్లు ఇస్తున్నారు. 

అయితే ప్రస్తుతం ఒక ఫోటో నెట్టింట్లో తెగ వైరల్ అవుతుంది.. సాధారణంగా సినిమాకి సైన్ చేసే ముందే.. స్క్రీన్ పైన స్కిన్ షో కానీ, హాట్ రొమాన్స్ సీన్స్ మరియు లీక్ లాక్ (Lip Lock) లకు ఒప్పుకోనని ముందే చెప్పే... ఈ అమ్మడు... ఇపుడు ఒక స్టార్ హీరోకి లిప్ కిస్ (Krithi Shetty Lip Lock) ఇస్తున్న ఫోటో ఇంటర్నెట్ లో తెగ వైరల్ అవుతుంది. లిప్ కిస్ ఇచ్చే ఫోటో చూసిన నెటిజన్లు షాక్ అవుతున్నారు. ఇక ఆమె ఆభిమానులు మాత్రం తీవ్ర నిరాశకు గురవుతున్నారు. 

Also Read: CM KCR Maha Dharna LIVE Updates: మహాధర్నా అనంతరం సీఎం కేసీఆర్‌ పాదయాత్ర..

అయితే ఆ ఫోటోలో ఉన్న స్టార్ హీరో మన నేచురల్ స్టార్ నానినే (Star Hero Natural Star Nani)... అవును ఈ రోజే విడుదల అయిన 'శ్యామ్ సింగ రాయ్' (Shyam Singha Roy Teaser) సినిమా టీజర్ చివర్లో ఈ సీన్ ఉంది. ఈ సినిమాలో డ్యూయల్ రోల్ లో నటిస్తున్న నాని సరసన సాయి పల్లవి (Sai Pallavi) మరియు కృతి శెట్టిలు హీరోయిన్ లు గా నటిస్తున్నారు. అయితే టీజర్ లో కృతి శెట్టి ఎక్కడ కనపడలేదు కానీ.. చివర్లో వచ్చే సీన్ లో నానికి లిప్ లాక్ ఇవ్వటం అందిరిని షాక్ కు గురి చేసింది. 

ప్రస్తుతం కృతి శెట్టి లిప్ కిస్ ఫోటో ట్రేండింగ్ అవగా.. ఇండస్ట్రీలో ఇదే హాట్ టాపిక్ గా మారింది. కృతి శెట్టి ప్రస్తుతం నాని (Nani), నాగ చైతన్యతో (Naga Chaitanya) కలిసి రెండు పెద్ద సినిమాలో నటిస్తుండగా.. ఇంకొన్ని ప్రాజెక్టులు ఒకే చేయటం కోసం ప్రయత్నాలు కొనసాగుతున్నాయి. కథల ఎంపికలో చాలా జాగ్రత్తగా ఉంటుంది హీరోయిన్ కృతి శెట్టి. 

Also Read: సంచలన నిజాలు వెల్లడించిన నటి షాలు చౌరాసియా.. పొదల్లోకి తోసి లైంగిక దాడికి పాల్పడ్డంటూ..

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు..  క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.

Android Link - https://bit.ly/3hDyh4G

Apple Link - https://apple.co/3loQYe 

మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook

Trending News