CM KCR Maha Dharna LIVE Updates: టీఆర్‌ఎస్ అధినేత తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ ఇందిరాపార్క్ వద్ద మహా ధర్నా చేస్తున్నారు. టీఆర్‌ఎస్ మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు మరియు పార్టీ నేతలతో సీఎం కేసీఆర్ మహా ధర్నాలో పాల్గొంటున్నారు. ఈ ధర్నా ముగియగానే పార్టీ శ్రేణులతో సలహా కేసీఆర్ పాద యాత్ర నిర్వహించనున్నట్లు సమాచారం.
ప్రస్తుతం కేంద్ర నిర్ణయాలకు వ్యతిరేకంగా.. ధాన్యం కొనుగోలు చేయాలని కేసీఆర్ అధ్యక్షతన మాహా ధర్నా కొనసాగుతుంది. సంవత్సరాల తరబడి అద్భుతమైన పోరాటాలు చేసి తెలంగాణ సాధించుకున్నాం.. రైతుల సమస్యలను తగ్గించటానికి అంతకు మించిన పోరాటాలు చేస్తమని.. అవసరమైతే ఢిల్లీకి వరకు యాత్ర చేస్తామని తెలిపారు.
ముగిసిన మహా ధర్నా.. డెడ్ లైన్ 48 హౌర్స్... ముఖ్యాంశాలు:
గవర్నర్ ను కలవటానికి రాజ్ భవన్ కు వెళ్తున్న సీఎం కేసీఆర్ మరియు టీఆర్‌ఎస్ శ్రేణులు
గవర్నర్ కు వినతి పత్రం ఇవ్వనున్న సీఎం కేసీఆర్
యాసంగి వడ్లు కొంటారా లేదా.. ??
రెండు రోజులు వేచి చూస్తాం.. సమాధానం రాకపోతే.. మా భవిష్యత్తు కార్యాచరణ ప్రకటిస్తాం..
కేంద్ర ప్రభుత్వానికి వ్యతిరేఖంగా పోరాటం చేస్తాము
భారత్ ప్రధానిని సూటిగా అడుగుతున్నా.. చేతులు జోడించి అడుగుతున్నా... వడ్లు కొంటారా..?? కొనరా..??
ఈ బాధ కేవలం తెలంగాణలోనే కాదు.. దేశ వ్యాప్తంగా ఉంది..
ఢిల్లీ రాజధానిలో రైతులు చాలా కలం నుండి పోరాటం చేస్తున్నారు
దేశాన్ని పాలించటంలో అన్ని పార్టీలు విఫలమయ్యాయి..
ఉత్తర భారతదేశంలో కూడా రైతుల పోరాటాలు జరుగుతున్నాయి.. రైతులపై దాడులు, అణచివేత.. కార్లు ఎక్కించటం చేస్తున్నారు..
పదవులకోసం, కేంద్ర పదవుల కోసం కాదు.. ఇప్పటికీ చాలా సార్లు రాజీనామాలు చేసి ప్రజా క్షేత్రంలో ఎన్నికలకు వెళ్లాము
మీ సర్జికల్ స్ట్రైక్స్.., బోర్డర్ లో నాటకాలు అన్ని ప్రజలకు తెలుసు..
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3hDyh4G
Apple Link - https://apple.co/3loQYe
మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook