Aishwarya Rai - Abhishek Bachchan Divorce: ఐశ్వర్యరాయ్ - అభిషేక్ బచ్చన్ విడాకులు.. అనూహ్యంగా తెర మీదకు కొత్త చర్చ!

Bollywood Star Couple Divorce: మాజీ ప్రపంచ సుందరి ఐశ్వర్యా రాయ్ గతంలో చాలా మందితో ప్రేమాయణం నడిపిన ఐశ్వర్య అభిషేక్ ను వివాహం చేసుకోగా ఇప్పుడు ఐశ్వర్య రాయ్ అభిషేక్ విడాకులు తీసుకోబోతున్నట్టు ప్రచారం మొదలైంది. 

Written by - Chaganti Bhargav | Last Updated : Apr 8, 2023, 06:52 PM IST
Aishwarya Rai - Abhishek Bachchan Divorce: ఐశ్వర్యరాయ్ - అభిషేక్ బచ్చన్ విడాకులు.. అనూహ్యంగా తెర మీదకు కొత్త చర్చ!

Aishwarya Rai-Abhishek Bachchan Divorce News: బాలీవుడ్‌లో కొందరు హీరోలతో ప్రేమాయణం నడిపిన ఐశ్వర్య రాయ్ చివరికి అమితా బచ్చన్ వారసుడు అభిషేక్ బచ్చన్‌ను వివాహం చేసుకున్న సంగతి తెలిసిందే. 2007వ సంవత్సరంలో వీరి వివాహం అతి సన్నిహితుల మధ్య ఘనంగా జరిగింది. వీరికి 2011లో ఒక పాప పుట్టగా... ఆమెకు ఆరాధ్య అని పేరు పెట్టుకున్నారు. ఒక రకంగా వీరిద్దరిని బాలీవుడ్‌లో క్యూట్ పెయిర్‌గా, చక్కనైన జంటగా వర్ణిస్తూ ఉంటారు అక్కడి అభిమానులు.

అలాంటి ఈ జంట మధ్య ఇప్పుడు విబేధాలు వచ్చాయని... త్వరలోనే ఈ జంట విడిపోతుందంటూ సరికొత్త ప్రచారం మొదలైంది. అయితే ఇందులో నిజానిజాలు ఎంతవరకు ఉన్నాయనే విషయం మీద క్లారిటీ అయితే లేదు. కానీ వారిద్దరూ కలిసి బయట కనిపించి చాలా కాలమే అవడంతో ఈ ప్రచారం తెరమీదకు వచ్చిందని తెలుస్తోంది. ఇటీవల నీతా ముఖేష్ అంబానీ కల్చరల్ సెంటర్ ఓపెనింగ్ సెర్మనికి ఐశ్వర్య రాయ్ బచ్చన్ తన కుమార్తె ఆరాధ్యతో కలిసి హాజరైంది. వీరిద్దరిని చూసి ఈ ఫోటోగ్రాఫర్లు తమ కెమెరాలకు పని చెప్పారు.

అమితాబ్ మనవరాలు, అభిషేక్, ఐశ్వర్యల కుమార్తె ఆరాధ్య... ఆ ఫోటోల్లో సెంటర్ ఆఫ్ అట్రాక్షన్‌గా నిలిచింది. అయితే వారిద్దరూ వచ్చారని సంబరపడే అభిమానుల కంటే అభిషేక్ ఎందుకు రాలేదని ఆరాల తీసి అభిమానులే ఎక్కువైపోయారు. అసలు అభిషేక్ బచ్చన్ ఈ కార్యక్రమానికి ఎందుకు హాజరు కాలేదు? ఆయనకు ఏం జరిగింది? ఆయన ఎందుకు ఈ కార్యక్రమానికి హాజరు కాలేదు... అంటూ పలు రకాల ప్రశ్నల వర్షం కురిపిస్తున్నారు.

Also Read: Who is Jasneet Kaur: ఇన్‌స్టాగ్రామే పెట్టుబడి.. సెమీ పోర్న్ రీల్స్ చూసి టెంప్ట్ అయ్యారా.. మీకూ ఇదే పరిస్థితి!

కొంతమంది నెటిజన్లు అయితే ఒక అడుగు ముందుకు వేసి కొంప తీసి విడాకులు కార్యక్రమాలు ఏమైనా ఉన్నాయా? అందుకే వీరిద్దరూ బయట కలిసి కనిపించడం లేదా? అంటూ ఆరాలు కూడా తీస్తున్నారు. ప్రస్తుతం ఈ విడాకుల వ్యవహారం బాలీవుడ్‌లో హాట్ టాపిక్‌గా మారింది. వాస్తవానికి బాలీవుడ్‌లో విడాకులు తీసుకోవడం పెద్ద విషయమేమీ కాదు. కానీ అమితాబచ్చన్ లాంటి సూపర్ స్టార్ కుమారుడు విడాకులు తీసుకుంటే... అది వార్త అవడం ఖాయం. ఎందుకంటే చాలా మందితో ప్రేమాయణం తర్వాత ఐశ్వర్య ఏరి కోరి ఆయనను వివాహం చేసుకుంది.

Also Read: Hanuman Jayanti 2023: ఏడాదిలో రెండు సార్లు హనుమాన్ జయంతి.. ఎందుకో తెలుసా?

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.

ఆండ్రాయిడ్ లింక్ -  https://bit.ly/3P3R74U

ఆపిల్ లింక్ -  https://apple.co/3loQYe

మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి  TwitterFacebook

 

Trending News