Who is Jasneet Kaur: అమ్మాయిల రీల్స్, మెసేజ్ లు టెంప్ట్ అయ్యారా..? ఇక మీ పని అయిపోయినట్టే!

Jasneet Kaur Arrested: ఇన్‌స్టాగ్రామ్ ఇన్‌ఫ్లుయెన్సర్ జస్నీత్ కౌర్‌ని ఇటీవల పంజాబ్ పోలీసులు అరెస్ట్ చేయడం హాట్ టాపిక్ అవుతోంది, మరీ ముఖ్యంగా ఆమె వ్యవహారాలు ఒక్కొక్కటి తెర మీదకు వస్తున్నాయి. 

Written by - Chaganti Bhargav | Last Updated : Apr 8, 2023, 04:48 PM IST
Who is Jasneet Kaur: అమ్మాయిల రీల్స్, మెసేజ్ లు టెంప్ట్ అయ్యారా..? ఇక మీ పని అయిపోయినట్టే!

Instagram Influencer Jasneet Kaur Arrested: ఈ మధ్యకాలంలో ఇంస్టాగ్రామ్ ఇన్ఫ్లుయెన్సర్లు చేస్తున్న రచ్చ అంతా ఇంతా కాదు. ఇంస్టాగ్రామ్ అంటే పోర్న్ లేదా సెమీ పోర్న్ సైటా అనే అనుమానం కలిగించే విధంగా రెచ్చిపోయి మరీ అందాలు ఆరబోస్తున్నారు. ఇప్పుడు పంజాబ్ కు చెందిన ఒక ఇంస్టాగ్రామ్ ఇన్ఫ్లుయెన్సర్ జస్నీత్ కౌర్‌ని పంజాబ్ పోలీసులు అరెస్ట్ చేశారు. దానికి కారణం ఆమె బోల్డ్ వీడియోలు చేసి వాటిని తన ఫాలోవర్లకు పంపి వారిని బ్లాక్మెయిల్ చేసి డబ్బు దండుకోవడమే. అయితే ఇప్పుడు జస్నీత్ కౌర్‌ చేసిన అనేక విషయాలు తెరమీదకు వస్తున్నాయి. 

మంగళవారం అరెస్టయినా ఇంస్టాగ్రామ్ ఇన్ఫ్లోయెన్సర్ జస్నీత్ కౌర్ తన సోషల్ మీడియా ఫాలోవర్లకు నగ్న ఫోటోలు పంపి బ్లాక్ మెయిల్ చేసేదని వారి నుంచి డబ్బులు వసూలు చేసేదని పోలీసులు తేల్చారు. లూధియానికి చెందిన ఒక వ్యాపారి ఫిర్యాదు మేరకు జస్నీత్ కౌర్ అలియాస్ రాజ్వీర్ కౌర్ ను అదుపులోకి తీసుకున్నామని పోలీసులు వెల్లడించారు. ఏప్రిల్ 1వ తేదీన లూధియానాలోని మోడల్ టౌన్ పోలీస్ స్టేషన్ లో ఈ కేసు నమోదు అయిందని వెంటనే తాము ఆమెని అదుపులోకి తీసుకుని బీఎండబ్ల్యూ కారుతో సహా ఆమె మొబైల్ ఫోన్ స్వాధీనం చేసుకున్నామని పోలీసులు వెల్లడించారు.

పంజాబ్ లోని సంగ్రూర్ జిల్లా నివాసైన జస్నీత్ కౌర్ తండ్రి కొన్నాళ్ల క్రితం మరణించాడు. తన ఇంటి ఆర్థిక పరిస్థితిని మెరుగుపరచాలని ఉద్దేశంతో తన అందాన్నే పెట్టుబడిగా చేసుకుని ఇలా ఇంస్టాగ్రామ్ లో హాట్ వీడియోలు షేర్ చేయడం మొదలుపెట్టింది. తన అందానికి ఫిదా అవుతున్నారని తెలిసిన వెంటనే తన ప్లాన్ అమలు చేసేది. వెంటనే రొమాంటిక్ చాట్ మొదలుపెట్టి నగ్న వీడియోలు పంపించడం నగ్నంగా చాట్ చేయడం వరకు వెళ్ళేది. అలా చేస్తున్నప్పుడే వారిని వీడియోలు తీసి కొన్ని రోజుల తర్వాత వారినే బెదిరించేది. 

Also Read: Mother Buffalo Fights with Lions: అప్పుడే పుట్టిన దూడ.. చుట్టూ సింహాల గుంపు.. తల్లి గేదె ఒంటరి పోరాటం.. గెలుపెవరిది..?

ఆమెకు పంజాబ్ లోని ఒక ప్రధాన రాజకీయ పార్టీకి సంబంధించిన నాయకుడితో మంచి స్నేహం ఉందని ఆయన అండ చూసి మరింత రెచ్చిపోయేదని చెబుతున్నారు. ఆమె ఇలా బ్లాక్ మెయిల్ చేసే దందాతో కొన్ని కోట్ల రూపాయలు వెనకేసినట్లుగా ప్రచారం జరుగుతోంది. పోలీసులు ఆమె దగ్గర నుంచి ఒక బీఎండబ్ల్యూ కారు సహా ఒక కాస్ట్ లీ ఫోన్ ని కూడా స్వాధీనం చేసుకున్నారు. సో ఇంతకీ చెప్పొచ్చేదేమిటంటే ఇంస్టాగ్రామ్ లో మోడల్స్ మెసేజ్ చేస్తున్నారు కదా అని టెంప్ట్ వారితో మెసేజ్ లు చేసి ఫోన్లు మాట్లాడితే చివరికి మనకు కొంపే మునిగే అవకాశం ఉందని టెక్ నిపుణులు చెబుతున్నారు. పరిచయం లేని వారు ఎలాంటి వారైనా వారి మెసేజ్లకు స్పందించాల్సిన అవసరం లేదని జాగ్రత్తగా లేకపోతే ఇబ్బందులు తప్పవని హెచ్చరిస్తున్నారు.
 

Also Read: Telugu Hot Movies List: ఒంటరిగా మీ పార్టనర్ తో చూడగలిగే హాటెస్ట్ తెలుగు సినిమాలు ఇవే!

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.

ఆండ్రాయిడ్ లింక్ -  https://bit.ly/3P3R74U

ఆపిల్ లింక్ -  https://apple.co/3loQYe

మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి  TwitterFacebook

Trending News